Guppedantha Manasu: మళ్లీ మర్డర్ స్కెచ్ వేసిన శైలేంద్ర.. రిషి ప్రాణాలు కాపాడిన అనుపమ!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తండ్రి ఏదో దాస్తున్నాడని ఆ విషయాన్ని తెలుసుకోవాలని తపన పడుతున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో నిద్రపోతున్న వసుధారని లేపి కాఫీ ఇస్తాడు రిషి. వసుధార ఆశ్చర్యపోతూ ఏంటి సర్ ఇది అని అడుగుతుంది.ఈ ఏరియాలో ఈ కాఫీ చాలా స్పెషల్ అంట. ప్రత్యేకించి నీకోసమే చేయించాను అంటాడు రిషి. నేను చాలా అదృష్టవంతురాలిని, భర్త చేతి కాఫీ తాగుతున్నాను అంటుంది వసుధార. మరోవైపు రిషి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియక పిచ్చెక్కిపోతూ ఉంటాడు శైలేంద్ర. అదే విషయాన్ని తల్లితో చెప్తాడు. అంతలో అక్కడ ధరణి ఫోన్ కనిపిస్తుంది.
ఫోన్ చేద్దామంటే లాక్ ఓపెన్ అవ్వదు. ధరణిని పిలిచి చాలా ప్రేమగా మాట్లాడుతాడు శైలేంద్ర. మీకు ఏం కావాలి అని సూటిగా అడుగుతుంది ధరణి. తెలివైన దానివి, అర్థం చేసుకున్నావు అయినా ఇంత ఓపెన్ గా అడిగితే ఎలా అంటాడు శైలేంద్ర. ఓపెన్ గా మాట్లాడేదాన్ని అయితే మీ గురించి ఎప్పుడో అందరికీ చెప్పేసే దాన్ని అంటుంది ధరణి. అర్జెంటుగా ఒక మెయిల్ పంపించుకోవాలి నీ ఫోన్ లాక్ ఓపెన్ చెయ్యు అంటాడు శైలేంద్ర. ధరణి లాక్ ఓపెన్ చేసి ఇస్తుంది.
ధరణి చాట్ చేస్తున్నట్టుగా వసుధారతో చాట్ చేస్తూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు శైలేంద్ర. చాట్ చేస్తున్నది ధరణి కాదు అని అర్థం చేసుకుంటుంది వసుధార. అక్కడ నేచర్ కి ఒక పిక్ తీసి పెట్టేస్తుంది. ఆ తర్వాత ఆ పిక్ చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో గ్రహిస్తాడు శైలేంద్ర. ఫోన్ ధరణికి ఇస్తూ నువ్వు చెప్పకపోయినా నేను ఎలా తెలుసుకున్నానో చూసావా అంటాడు. భర్తని తిట్టుకుంటూ ఫోన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి.
మరోవైపు డాడ్ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అను అని కలవరిస్తున్నారు ఎవరు ఆవిడ? ఆవిడ గురించి తెలుసుకోవాలి డాడ్ ని అడిగినా చెప్పరు, నిన్న ఆయన వెళ్లిన ప్లేస్ కి వెళ్తే ఏమైనా తెలియొచ్చు అనుకొని వసుధార దగ్గరికి వెళ్లి నేను బయటకు వెళ్తున్నాను అని చెప్తాడు. పక్క రూమ్ నుంచి ఆ మాటలు వింటాడు మహేంద్ర. నా మీద అనుమానం వచ్చిందా అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకొని రిషి ని ఫాలో అవ్వడానికి వెళ్తాడు.
ఇంతలో ఒక వ్యక్తి రిషి ని అబ్జర్వ్ చేస్తూ సేలేంద్ర కి ఫోన్ చేసి బయటికి వెళ్తున్నాడు అని చెప్తాడు. అతడిని ఫాలో చెయ్యు వీలైతే చంపి అప్పుడు నాకు ఫోన్ చెయ్యు అంటాడు శైలేంద్ర. సరే అని ఫోన్ పెట్టేస్తాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత రిషి నడుచుకుంటూ వెళ్తుంటే అతన్ని ఫాలో అవుతాడు మహేంద్ర. అయితే ఒక దగ్గర రిషి ని మిస్ అవుతాడు.
మరోవైపు అనుపమ జగతి గురించి ఆలోచిస్తూ మహేంద్రని జగతి గురించి అడగాలి. రిసార్ట్ కి వెళ్తే బాగోదు నిన్న కలిసిన దగ్గరికి వస్తాడేమో, అక్కడికి వెళ్లాలి అనుకొని బయలుదేరుతుంది. వెళ్తున్న దారిలో ఆమె కారు ట్రబుల్ ఇస్తుంది. కార్ డ్రైవర్ ని బాగు చేయమని చెప్పి తను అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇంతలో రిషి కూడా అటువైపే వస్తాడు.
శైలేంద్ర అరేంజ్ చేసిన వ్యక్తి రిషి ని చంపటానికి అదే కరెక్ట్ టైం అనుకొని నడుస్తున్న రిషి మీదకి కారుపోనిద్దాం అనుకుంటూ స్పీడ్గా వస్తాడు. అదంతా చూస్తున్న అనుపమ పరిగెత్తుకుంటూ వెళ్లి రిషి ని పక్కకి లాగేస్తుంది. ఆ తర్వాత రిషిని రిలాక్స్ అవమని చెప్పి తనని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నారు అంటాడు రిషి.
ఏమీ లేదు అతను మిమ్మల్ని కావాలని టార్గెట్ చేశాడు. ఇది ఆక్సిడెంటల్ గా జరిగింది కాదు, మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ఇక్కడినుంచి వెళ్లిపోండి అంటుంది. సరే అని బయలుదేరబోతుంటే నా కారులో డ్రాప్ చేస్తాను రండి అని చెప్పి రిషి ని ఒప్పించి తన కార్లో తీసుకువస్తుంది. మరోవైపు మహేంద్ర రిసార్ట్ కి వచ్చి అక్కడే కూర్చుండు పోతాడు. రిషి ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచనలో పడతాడు.
ఇంతలో అక్కడికి వచ్చిన కారులోంచి రిషి, అనుపమ ఇద్దరూ దిగడం చూసి షాక్ అవుతాడు. కారు దిగిన రిషి అనుపమని లోపలికి రండి కాఫీ తాగుదురు గాని అంటాడు. వద్దు అని చెప్పిన అనుపమ మహేంద్ర ఉండేది కూడా ఇక్కడే కదా ఇతనికి తెలిసేమో అడుగుదాము అనుకుంటుంది. మళ్ళీ బాగోదేమో అని ఆలోచనలో పడుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.