శృంగార తార షకీలా పొలిటికల్‌ ఎంట్రీకి ప్లాన్‌.. సోదరి వల్లే మోసపోయానని వెల్లడి

First Published Dec 20, 2020, 8:25 AM IST

దక్షిణాదిలో శృంగార తార పాపులర్‌ అయిన మల్లు బ్యూటీ షకీలా త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందట. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం రూపొందుతున్న తన బయోపిక్‌లో గతంలో తాను చేసిన తప్పులన్నీ చూపిస్తారట. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది షకీలా. 
 
షకీలా.. పేరు చెబితే, తానొక శృంగార తారగానే గుర్తుకొస్తుంది. మల్లు బ్యూటీగా ఈమె పాపులర్‌ అయ్యింది. అడల్ట్ సినిమాలతో మెప్పించి ఆడియెన్స్ ని మైమరపించింది.

దాదాపు 250కిపైగా చిత్రాల్లో నటించి మెస్మరైజ్‌ చేసింది షకీలా. తెలుగు, తమిళ, కన్నడతోపాటు ప్రధానంగా మలయాళ చిత్రాల్లో నటించి మల్లు నటిగా పాపులర్‌ అయ్యింది.

1990,20 టైమ్‌లో షకీలా సినిమాలకు విశేషమైన క్రేజ్‌ ఉండేది. స్టార్‌ హీరోల సినిమాలకు షకీలా శృంగార సినిమాలు విడుదల కావడంతోపాటు, భారీ కలెక్షన్లని సంపాదించేవి.

షకీలా సినిమాలు విడుదలవుతున్నాయని తెలిసి వాయిదా వేసుకున్న స్టార్‌ హీరోలు కూడా ఉన్నారు. అంతగా తన హీటు పుట్టించే అందాలతో రెచ్చిపోయిందీ అమ్మడు.

షకీలా సినిమాలంటే అడల్ట్ కంటెంట్‌ మాత్రమే కాదు, సెక్స్‌పై అవగాహన కల్పించేలా కూడా ఉండేది. ఒక సందేశాత్మక కంటెంట్‌ ఉండేది. అందుకే షకీలాకి అంత గౌరవం, పాపులారిటీ సొంతమయ్యాయి. దీంతోపాటు ఇతర సినిమాల్లో కీలక పాత్రల్లో, ఐటెమ్‌ భామగానూ సినిమాపై హైప్‌ తీసుకొచ్చేది షకీలా.

ప్రస్తుతం షకీలా జీవితం ఆధారంగా ఆమె బయోపిక్‌ రూపొందుతుంది. `షకీలా` పేరుతో ఐదు భాషల్లో రూపొందుతుంది. ఇందులో షకీలా పాత్రలో ఎస్తర్‌ నటిస్తుంది. ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ, తాను రాసుకున్న తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం షకీలా అని తెలిపారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఇందులో  పొందుపరచలేదని.. చిత్రానికి ఏది అవసరమో దాన్ని చెప్పినట్లు తెలిపారు. ఒక వ్యక్తి జీవించి ఉండగానే తన జీవిత చరిత్ర సినిమాగా రూపొందడం ఆసక్తికరమైన విషయమని అన్నారు. తాను చేసిన తప్పులను కూడా ఈ చిత్రంలో చూపినట్లు తెలిపారు.

ఈ చిత్రం నటీనటులకు, ఇతర మహిళలకు ఒక మంచి పాఠంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను తన సొంత సోదరి కారణంగానే చాలా మోసపోయానని చెప్పారు. అయినా తన కుటుంబాన్ని ఇప్పటికీ తానే పోషిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లోకి వస్తారా అని చాలా మంది అడుగుతున్నారని, తాను తప్పకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా ఆ పార్టీలో చేరడానికి సిద్ధమని షకీలా పేర్కొన్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?