MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Savitri: మహానటి సావిత్రి చివరిగా స్నేహితురాలిని కలిసి చెప్పిన మాటలివే.. కన్నీళ్లు ఆపుకోలేరు

Savitri: మహానటి సావిత్రి చివరిగా స్నేహితురాలిని కలిసి చెప్పిన మాటలివే.. కన్నీళ్లు ఆపుకోలేరు

Savitri: మహానటి సావిత్రి చివరి రోజుల్లో తన మనసులోని బాధని బయటపెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేసిన తప్పేంటో వెల్లడించిందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 17 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సావిత్రి తెలుగు తెరకు దొరికిన ఒక అద్భుతం
Image Credit : Facebook/@mahanatiSavitri

సావిత్రి తెలుగు తెరకు దొరికిన ఒక అద్భుతం

మహానటి సావిత్రి తెలుగు చిత్ర పరిశ్రమ దొరికిన ఒక అద్భుతం. కానీ ఆ అద్భుతం తక్కువ కాలంలోనే ఈ లోకాలను విడిచి వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయింది. సావిత్రి జీవితం ఒక ఎమోషన్‌. ఆమెని ప్రత్యక్షంగా చూసినా, చూడకపోయినా, ఆమె గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురవుతారు. అయ్యే అని ఫీలవుతారు. ఉన్నన్ని రోజులు అద్భుతమైన నటనతోనే కాదు, గొప్పమనసుతోనూ ఆకట్టుకుంది. అందరి మనసులు దోచుకుంది సావిత్రి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్నేహితురాలి వద్ద ఆవేదన వ్యక్తం చేసిన సావిత్రి
Image Credit : Facebook/@mahanatiSavitri

స్నేహితురాలి వద్ద ఆవేదన వ్యక్తం చేసిన సావిత్రి

సావిత్రి తాను చివరి రోజుల్లో పడిన బాధని తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకుందట. తాను ఏం తప్పు చేశానో వెల్లడించిందట. ఒక్క తప్పు తన జీవితాన్ని మార్చేసిందని, సుఖం, సంతోషం లేదని ఆమె తన స్నేహితురాలి వద్ద వాపోయిందట. సావిత్రికి చిన్ననాటి నుంచి ఉన్న ఏకైక స్నేహితురాలు మద్దాలి సుశీల. క్లాసికల్‌ డాన్స్ లో శిక్షణ తీసుకునే టైమ్‌లో వీరి స్నేహం ప్రారంభమైంది. చివరి వరకు కంటిన్యూ అయ్యింది. సావిత్రి సినిమాల్లోకి వెళ్లేంత వరకు ఆమె మహానటితోనే ఉంది. ఆ తర్వాత కూడా సావిత్రి ఆమెని తనతో ఉండాలని కోరుకుంది. కానీ అప్పటికే సుశీలకి పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. దీంతో సావిత్రితో వెళ్లలేకపోయింది.

Related Articles

Related image1
Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది.. నా అన్వేష్‌పై మాధవీలత బోల్డ్ స్టేట్‌మెంట్‌
Related image2
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
35
ఎప్పుడొచ్చినా సుశీలని కలిసేది సావిత్రి
Image Credit : Facebook/Mahanati Savitri

ఎప్పుడొచ్చినా సుశీలని కలిసేది సావిత్రి

కానీ ఊరొస్తే మాత్రం కచ్చితంగా సుశీలని కలిసేదట. లేదంటే తన ఇంటికి పిలిపించుకునేదట. ఇలా తరచూ వీరిద్దరు కలిసేవారు. తన సినిమాల ఈవెంట్లకి వచ్చినప్పుడు కూడా కచ్చితంగా ఫ్రెండ్‌ని కలిసేదట. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నింటినీ సుశీలతో పంచుకునేవారట సావిత్రి. అయితే చివరి రోజుల్లో సుశీలని కలిసి తన మనసులోని బాధమొత్తాన్ని కక్కేసిందట. తాను ఎలాంటి తప్పు చేశానో అప్పటికి రియలైజ్‌ అయ్యిందట.

45
సుఖం లేదు, సంతోషం లేదంటూ సావిత్రి ఆవేదన
Image Credit : Facebook/@mahanatiSavitri

సుఖం లేదు, సంతోషం లేదంటూ సావిత్రి ఆవేదన

ఏలూరులో మెయిన్‌ రోడ్డు మీద సావిత్రి వాళ్లకి చెందిన విజయ స్పిన్నింగ్‌ మిల్ ఉండేదట. చనిపోవడానికి ముందు కొన్నేళ్ల క్రితం అక్కడ ఏదో పనిమీద విజయవాడ వచ్చినప్పుడు సావిత్రి, సుశీల కలుసుకున్నారట. ఆ సమయంలో ఓపెన్‌ అయ్యిందట సావిత్రి. అప్పట్లో తనతో సుశీల రాలేదని కోపం ఉండేదట. ఆ విషయాన్ని చెబుతూ, `మొదట్లో నీ మీద కొప్పడ్డాను, కానీ ఆ తర్వాత నువ్వు రాకపోవడమే మంచిదైంది. నేను అక్కడికి వెళ్లాననే గానీ, కోట్లు సంపాదించినా సుఖం లేదు, సంతోషం లేదు, భర్త పట్టించుకోదు, నాకు తొచింది తినలేను, నచ్చింది కట్టుకోలేను, నేను దిక్కులేని దానినైపోయాను. నువ్వయ్యినా ఇక్కడ సుఖంగా భర్త, పిల్లలతో ఉన్నావ్‌ అంతే చాలు` అని బాధతో చెప్పిందట సావిత్రి.

55
సుశీల చెప్పినా వినలేదు
Image Credit : Facebook/@mahanatiSavitri

సుశీల చెప్పినా వినలేదు

సావిత్రి అన్న ఆ మాటకి సుశీలకి కన్నీళ్లు ఆగలేదట. జెమినీ గణేషన్‌తో పెళ్లి వద్దు అని తను చాలా చెప్పిందట, కానీ సావిత్రి వినలేదని, చివరికి తన పరిస్థితి చూసి చాలా బాధేసిందని వెల్లడించింది సుశీల. సావిత్రి ఎంతో సంపాదించింది, ఎందరో అభిమానుల్ని సంపాదించింది. కానీ ఆఖరుకి ఏది లేకుండా, ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్లిపోయింది. ఆ సావిత్రిని ఇలా సినిమా ద్వారా అయినా చూసుకోవడం ఆనందంగా ఉంది అని సుశీల తెలిపింది. మహానటి మూవీ విడుదల సమయంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సావిత్రి (నటి)
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది.. నా అన్వేష్‌పై మాధవీలత బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved