MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • C M Vijay vs Ajith : సీఎం విజయ్‌కి పోటీగా తలా అజిత్? తమిళ రాజకీయాల్లో పెను తుపాను రాబోతోందా?

C M Vijay vs Ajith : సీఎం విజయ్‌కి పోటీగా తలా అజిత్? తమిళ రాజకీయాల్లో పెను తుపాను రాబోతోందా?

తమిళనాడులో దళపతి విజయ్ సీఎం అవ్వడంతో.. సినిమాల్లో ఆయనకు పోటీగా ఉన్న... బద్ధశత్రువు తలా అజిత్ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. జయలలిత మానసపుత్రుడిగా పేరున్న అజిత్‌ తో  విజయ్‌కి చెక్ పెట్టాలని చూస్తున్నారా? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : May 17 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
దళపతికి పోటీగా తలా.. పాలిటిక్స్‌లో కొత్త ఫైట్?
Image Credit : Asianet News

దళపతికి పోటీగా తలా.. పాలిటిక్స్‌లో కొత్త ఫైట్?

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాడు దళపతి విజయ్. ఎవరూ ఊహించని విధంగా పార్టీ పెట్టి.. రెండేళ్లలోనే అధికారం చేజిక్కించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. పాలలో అప్పుడే తన మార్క్ చూపించడం మొదలు పెట్టాడు విజయ్. అయితే దళపతి సీఎం అవ్వడం ఒకెత్తయితే, ఇప్పుడు సినిమాల్లో ఆయన బద్ధ శత్రువుగా పేరుపడ్డ తలా అజిత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు తమిళనాడు సినిమా, రాజకీయ వర్గాల్లో ఏం జరుగుతోంది. అజిత్ నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? ఇస్తే ఏ పార్టీ నుంచి వస్తారు. సొంతంగా పార్టీ పెడతారా?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
ఆశా కిరణంలా కనిపించిన అజిత్..
Image Credit : Asianet News

ఆశా కిరణంలా కనిపించిన అజిత్..

తమిళనాడు మొత్తం ఇప్పుడు విజయ్ నామస్మరణతో మారుమోగిపోతోంది. ఆయన అధికారం చేపట్టడం అక్కడి చాలామంది బడా నేతలకు మింగుడుపడటం లేదు. మొన్నటి వరకూ DMK వర్సెస్ AIADMK గా పోటీ జరిగేది. విజయ్ వచ్చినా.. పెద్దగా సాధించేది ఏమీ ఉండదు అని ఈ రెండు పార్టీలు అనుకున్నాయి. కానీ.. దశాబ్ధాలుగా తమిళనాట పాతుకుపోయిన ఈ రెండు ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ.. దళపతి గెలిచి సీఎం అయ్యాడు. దాంతో ఏం చేయాలి, విజయ్ కి ఎలా చెక్ పెట్టాలని DMK, AIADMK ప్లాన్ల మీద ప్లాన్స్ వేస్తున్నాయట. ఇలాంటి టైంలోనే AIADMK కి ఓ ఆశా కిరణం కనిపించింది.

Related Articles

Related image1
Director Teja: వాడిబొంద.. వాడు చెప్పేదంత సోది, స్టార్ హీరోపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్, కారణం ఏంటి ?
Related image2
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
38
ద్రావిడ రాజకీయాల్లో సునామీ కొత్త తరం యుద్ధం!
Image Credit : Asianet News

ద్రావిడ రాజకీయాల్లో సునామీ కొత్త తరం యుద్ధం!

విజయ్ సీఎం అవ్వడానికి సరిపడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. కాంగ్రెస్, వాపక్షాల  'సపోర్ట్ తో ఆయన సీఎం అయ్యారు. ఇక AIADMK నుంచి రెబల్ వర్గం ఎమ్మెల్యేలు చీలి.. విజయ్ కి మద్దతిచ్చారు. దాంతో AIADMK వర్గాలు విజయ్ పై బాగా కోపంగా ఉన్నట్టు సమాచారం. విజయ్ కి చెక్ పెట్టడానికి వారు పెద్ద ప్లానే వేశారట. త్వరలో తమిళ రాజకీయాలను ఓ సునామీ ముంచెత్తనుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ సునామీ మరెవరో కాదు.. ఒకప్పుడు అమ్మ జయలలితకు మానసపుత్రుడిగా పేరు తెచ్చుకున్న తలా అజిత్.

48
AIADMK నేతల మాస్టర్ ప్లాన్..?
Image Credit : Asianet News

AIADMK నేతల మాస్టర్ ప్లాన్..?

దళపతి విజయ్ మరో ఐదేళ్ల పాటు తమిళనాడును పాలించబోతున్నారు. ఇది చాలామంది రాజకీయ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా, ఒకప్పుడు పురిచ్చి తలైవిగా జయలలిత కట్టిన బ్రహ్మాండమైన కోట AIADMK పార్టీ ఘోరంగా ఓడిపోవడం, అమ్మ పేరును మట్టిలో కలిపినట్లయింది. ఇప్పుడు ఆ పార్టీని మళ్లీ నిలబెట్టాలి. దీనికోసం AIADMK ఒక పక్కా ప్లాన్‌తో ఉంది. అదే 'తలా అజిత్' అస్త్రం.మూడో స్థానానికి పడిపోయి, కనుమరుగయ్యేలా ఉన్న AIADMK పార్టీకి కొత్త నాయకత్వం రాబోతోందని అంటున్నారు. పార్టీని మళ్లీ బతికించుకోవడానికి, అమ్మ మానసపుత్రుడైన తలా అజిత్‌ను రంగంలోకి దించాలని AIADMK నేతలు ప్లాన్ చేస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.

58
విజయ్ కు పోటీ ఇచ్చే బలమైన నాయకుడు ఎవరు?
Image Credit : our own

విజయ్ కు పోటీ ఇచ్చే బలమైన నాయకుడు ఎవరు?

ప్రస్తుతం తమిళనాడులో విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం'కు గట్టి పోటీ ఇవ్వాలంటే, అమ్మ లాంటి బలమైన నాయకత్వం కావాలి. విజయ్ తన ప్రభుత్వంలోకి జయలలిత కోటలోని కీలక నేతలందరినీ లాగేసుకున్నారు. దీంతో ఇప్పుడు అమ్మ పార్టీ ఖాళీ అయిపోయింది. MGR కట్టి, జయలలిత పెంచిన AIADMK కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే అమ్మ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న నాయకుడిగా ప్రజలు అజిత్ వైపు చూస్తున్నారు.

68
అందరి చూపు అజిత్ వైపే..
Image Credit : our own

అందరి చూపు అజిత్ వైపే..

విజయ్‌ - అజిత్ మధ్య సినిమాల పోటీ ఎలా జరిగేదో అందరికి తెలిసిందే. ఇద్దరి సినిమాల మధ్య పోటీ రాజకీయాలను మించి జరిగేది అభిమానుల మధ్య యుద్దవాతావరణ ఉండేది. సినిమాల విషయంలోనే అంత పోటీ నడిస్తే.. రాజకీయంగా వీరు తలపడితే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయ్ కి సరిసమానమైన ఇమేజ్ ఉన్న స్టార్‌ను తీసుకురావాలనేది AIADMK ప్లాన్. ఈ ఎన్నికల ఫలితాలు చూశాక, సినిమా గ్లామర్ రాజకీయాల్లో ఎంత పనిచేస్తుందో అందరికీ అర్థమైంది. అందుకే ఇప్పుడు అందరి చూపు అజిత్ మీద పడింది. దీనికి మరో కారణం కూడా ఉంది.. అజిత్ అంటే జయలలితకు ఎంతో ఇష్టం.

78
అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన అజిత్!
Image Credit : our own

అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన అజిత్!

నిజానికి తలా అజిత్ రాజకీయాల్లోకి రావాలనేది జయలలిత, అజిత్ అభిమానుల కోరిక. అమ్మ తర్వాత ఆయనే నాయకుడు అనే మాటలు కూడా అప్పట్లో వినిపించాయి. కానీ అజిత్ దేనికీ తలొగ్గలేదు. తన అభిమాన సంఘాలను కూడా రద్దు చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.దళపతి విజయ్‌లాగే తమిళనాడులో తలా అజిత్‌కు కూడా విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు అమ్మ వీరాభిమానులు కూడా తోడైతే అది సునామీనే అవుతుంది. ముఖ్యంగా విజయ్, అజిత్ అభిమానులు ఎప్పుడూ ఒకటి కారు. వాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకవేళ విజయ్ పాలన ముగిశాక, అజిత్ అమ్మ పార్టీలోకి వస్తే తమిళనాడు రాజకీయం నిప్పుల గుండంగా మారడం ఖాయం.

88
నాయకత్వం అమ్మ మానసపుత్రుడికేనా?
Image Credit : Asianet News

నాయకత్వం అమ్మ మానసపుత్రుడికేనా?

MGR నుంచి నేటి విజయ్ వరకు, తమిళనాడును ఏలిన వాళ్లలో చాలామంది సినిమా రంగం నుంచి వచ్చినవారే. ముఖ్యంగా AIADMKని పాలించిన వాళ్లంతా సూపర్ స్టార్లే. అందుకే ఇప్పుడు విజయ్‌కి ధీటుగా నిలబడగల నాయకుడు నటుడు అజితే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.అజిత్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు, తమిళులకు ఆయన రియల్ లైఫ్ హీరో కూడా. సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్. కార్ రేసింగ్, బైక్ రైడింగ్ అంటే ప్రాణం. యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎలాంటి అభిమాన సంఘాలు లేకుండానే ఇంత పెద్ద స్టార్‌డమ్ ఆయన సొంతం. రాబోయే రోజుల్లో అమ్మ స్థానంలో అజిత్ కూర్చున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అజిత్ ఎంట్రీ ఇస్తే.. తమిళనాడు రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు.. దురదృష్టం, ఆ హీరో కూడా ప్రమాదంలోనే
Recommended image2
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Recommended image3
Director Teja: వాడిబొంద.. వాడు చెప్పేదంత సోది, స్టార్ హీరోపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్, కారణం ఏంటి ?
Related Stories
Recommended image1
Director Teja: వాడిబొంద.. వాడు చెప్పేదంత సోది, స్టార్ హీరోపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్, కారణం ఏంటి ?
Recommended image2
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved