MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు

Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు

Mahesh Babu: సెలబ్రిటీలు సంపాదించిన డబ్బును ఎక్కువగా బిజినెస్ లలోనే పెడుతూ ఉంటారు. మహేష్ బాబు కూడా ఒక రెస్టారెంట్ ను ప్రారంభించారు. మహేష్ బాబు రెస్టారెంట్లో ఫుడ్ ఖరీదు చూస్తే షాక్ అవ్వాల్సిందే. కేవలం డబ్బున్నవారు మాత్రమే ఆ రెస్టారెంట్ కు వెళ్లగలరు. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 17 2026, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మహేష్ బాబు రెస్టారెంట్
Image Credit : Palace Heights by ANV/Instagram

మహేష్ బాబు రెస్టారెంట్

సెలబ్రిటీలకు వచ్చే డబ్బులు ఎక్కడో దగ్గర పెట్టుబడి రూపంలో పెట్టేందుకే ఆసక్తి చూపిస్తారు. అలా మహేష్ బాబు కూడా రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టారు. ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, ఏషియన్ గ్రూపు భాగస్వామ్యంతో.. మినర్వా షాప్ కాఫీ షాప్ తో కలిసి ఏఎన్ రెస్టారెంట్స్ చైన్స్ మొదలుపెట్టారు. ఈ బ్రాండ్ కు చెందినదే ఏవీఎన్ ప్యాలెస్ హైట్స్. ఇది బంజారాహిల్స్ లో ఉంది. ఈ రెస్టారెంట్ కు సాధారణ వ్యక్తులు వెళ్లలేరు. కేవలం వేలల్లో ఖర్చు పెట్టగలిగే వారు మాత్రమే వెళ్లాలి. కేవలం ఒక వాటర్ బాటిల్ కొనాలంటేనే అక్కడ వందల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక తిండి సంగతే సరేసరి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వాటర్ బాటిల్ ధర ఇదే
Image Credit : Palace Heights by ANV/Instagram

వాటర్ బాటిల్ ధర ఇదే

హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి రెస్టారెంట్ కు వెళ్లి ఆ బిల్లును తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. మహేష్ బాబు రెస్టారెంట్లో ధరలు చూస్తే సాధారణ ప్రజలు అడుగు కూడా పెట్టలేరని అర్థం అయిపోతుంది. బయట మార్కెట్లో మీకు ఒక వాటర్ బాటిల్ పది రూపాయల నుంచే దొరుకుతుంది. కానీ మహేష్ బాబు రెస్టారెంట్లో కనీసం 299 రూపాయలు ఖర్చు పెడితేనే ఒక లీటర్ వాటర్ బాటిల్ దొరుకుతుంది. అలాగే కోక్ క్యాన్ కూడా బయట 40 రూపాయలు మాత్రమే ఉంటే అక్కడ మాత్రం 180 రూపాయలుకు అమ్ముతున్నారు. ఇంత ఖర్చు పెట్టి సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వెళ్లలేరు. కేవలం సెలబ్రిటీలు, కోటీశ్వరులు మాత్రమే ఈ రెస్టారెంట్లో అడుగు పెట్టగలరు.

34
ఫుడ్ ధరలు ఇలా
Image Credit : Palace Heights by ANV/Instagram

ఫుడ్ ధరలు ఇలా

వాటర్ బాటిల్, కోక్ ధరలే అలా ఉంటే మరి మిగతా మెయిన్ మెనూ ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కదా. స్టార్టర్స్ విషయానికి వస్తే ఒక చికెన్ టిక్కా 725 రూపాయలు. అది ఒక మనిషికి కూడా కడుపునిండా సరిపోదు. అదే మటన్ బిర్యానీ 600 రూపాయలు. అది ఒకరికి సరిపోయేంత కూడా ఇవ్వరు. ఇక వీటిపై టాక్సులు, ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయి. ఒక మనిషి కడుపునిండా తినాలంటే మహేష్ బాబు రెస్టారెంట్లో కనీసం రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇక కుటుంబమంతా వెళితే ఎనిమిది నుంచి పదివేల రూపాయలు అవుతుంది. అయితే రుచి మాత్రం అదిరిపోతుందట. కానీ మహేష్ బాబు సినిమాలకు వెళ్లేది ఎక్కువగా మధ్యతరగతి ప్రజలే. వారు ఖర్చు పెట్టే రీతిలో కాస్త ధరలు సాధారణంగా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ మంది వెళ్లి ఆహారాన్ని ఆస్వాదించేవారు.

44
షేర్ అవుతున్న బిల్లు
Image Credit : Palace Heights by ANV/Instagram

షేర్ అవుతున్న బిల్లు

ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన బిల్లు వైరల్ అవ్వడంతో మహేష్ బాబు రెస్టారెంట్ పై కామెంట్లు ఎక్కువైపోయాయి. సెలబ్రిటీ బ్రాండ్ కోసం చూస్తే జేబులు ఖాళీ అవుతాయని కొంతమంది కామెంట్లు చేశారు. మరికొందరు ఇది అమాయక ప్రజలను లూటీ చేయడమేనని విమర్శించారు. గ్లోబల్ లెవెల్ సినిమాలు చేస్తున్న మహేష్ బాబు రెస్టారెంట్ ను కూడా అదే స్థాయిలో నడుపుతున్నాడని అర్థమవుతోంది. కానీ అతని సినిమాలు చూసేది మాత్రం ఎక్కువగా సామాన్య, మధ్యతరగతి ప్రజలే అని గుర్తు పెట్టుకోవాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bathukamma Song : మంగ్లీ స్టైల్లో మరో బతుకమ్మ పాట రెడీ.. ఐదు గంటల్లోనే లక్ష వ్యూస్, యూట్యూబ్ ను షేక్ చేస్తోందిగా
Recommended image2
Parasuram: పూరి, త్రివిక్రమ్ తర్వాత నువ్వే అని ముంచేశారు.. కృతజ్ఞతతో ఆ హీరో తండ్రి పేరే నా కొడుక్కి పెట్టా
Recommended image3
Chiranjeevi Villain: వాచ్‌మన్ నుంచి చిరంజీవి విలన్ వరకు.. ఒక్క దెబ్బకు 10 సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నటుడు
Related Stories
Recommended image1
Chemical Mangoes: మామిడి పండ్లు సహజంగా పండాయా లేక రసాయనాలతో పండాయా? ఇలా కనిపెట్టేయండి
Recommended image2
Shani Effects: ఈ 4 రాశుల వారికి శని జయంతి ఒక టర్నింగ్ పాయింట్.. జీవితంలో భారీ మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved