సావిత్రి నుండి సిల్క్ స్మిత వరకు... దుర్భర స్థితిలో తారల మరణాలు
First Published Dec 9, 2020, 11:46 AM IST
సినిమా ఒక మాయ ప్రపంచం... తెరపై మెరిసే నటుల జీవితాలు కూడా కనిపించినంత అందంగా ఏమీ ఉండవు. కెరీర్ సాగినంత కాలం ఫేమ్, స్టేటస్, విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఒక్కసారి ఫేడవుట్ అయితే పట్టించుకొనే నాధుడే ఉండదు. వెండితెరపై తిరుగులేని స్టార్డం అనుభవించి జీవిత చరమాంకంలో దుర్భర పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచిన నటులు అనేక మంది...వారెవరో ఒకసారి చూద్దాం..

గ్లామరస్ హీరోయిన్ గా 70లలో బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించారు హీరోయిన్ పర్వీన్ బాబీ. ఎంతో స్టార్ డమ్ అనుభవించిన పర్వీన్ మానసిక వ్యాధికి గురయ్యారు. దీనితో అమెరికాలో చాలా కాలం మెంటల్ హాస్పటిల్ లో గడిపారు. చివరి రోజుల్లో పర్వీన్ ఒంటరిగా మరణించారు. కాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఆమె మరణించారు. ఆమె మరణించిన మూడు రోజుల తరువాత ముంబైలోని అపార్ట్మెంట్ లో శవం స్వాధీనం చేసుకున్నారు. మూడురోజులుగా ఆమె ఏమి తినలేదని పోస్ట్మార్టంలో తేలింది. 2005లో పర్వీన్ బాబీ మరణించారు.

సౌత్ ఇండియాలో తిరుగులేని స్టార్ గా ఎదిగింది సావిత్రి. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ స్టార్ గా సావిత్రిని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి స్టార్స్ కి మించిన ఇమేజ్ సొంతం చేసుకున్న సావిత్రి, లెక్కలేనంత ఆస్థిని సంపాదించారు. దాన గుణం, నమ్మినవారు మోసం చేయడం వలన, ముందుకు బానిసై, చివరి రోజుల్లో కడు పేదరికంలో మరణించారు. తొమ్మిది నెలలు కోమాలో ఉన్న సావిత్రి 1981లో మరణించారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?