MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: దేవిని ఓదారుస్తున్న చిమ్మయి.. రుక్మిణి మీద అనుమానం పెంచుకుంటున్న సత్య!

Devatha: దేవిని ఓదారుస్తున్న చిమ్మయి.. రుక్మిణి మీద అనుమానం పెంచుకుంటున్న సత్య!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Sep 20 2022, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆదిత్య,దేవిని అలాగ అన్నదని ఆవేశంతో చేయి చేసుకున్నాను,నన్ను క్షమించు సత్య అని  అంటాడు. అప్పుడు దేవుడమ్మ,నాకు కావాల్సింది మీ ఇద్దరు క్షణమాపణలు కాదు.  ఈ గొడవ ఇంకెప్పుడు మీ ఇద్దరి మధ్య రాకూడదు అని అంటుంది. ఆ తర్వాత సీన్లో దేవి మంచం మీద కూర్చొని, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ నేను ఇష్టం లేద. సత్య పిన్నికి నేనంటే ఇష్టం లేదు అందుకే నన్ను అన్ని మాటలు అన్నది,నాకు ఇంకెప్పుడూ ఆ ఇంటికి వెళ్లాలని లేదమ్మా అని అంటుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

గోడ చాటు నుండి ఈ మాటలన్నీ విన్న మాధవ్ ఆనందపడతాడు. అంతలో చిన్మయి అక్కడికి వస్తుంది. నువ్వు అలా కనకూడదు దేవి మనల్ని వాళ్ళు చాలాసార్లు చాలా ప్రేమగా చూసుకున్నారు, ఎప్పుడు కోప్పడలేదు. అలాగని ఒకసారి కోప్పడినంత మాత్రాన వాళ్ళకి మనమీద ప్రేమ లేనట్టు కాదు.మనల్ని అమ్మ కూడా తిడుతుంది అలాగని అమ్మతో మాట్లాడడం మానేస్తామా ఇది కూడా అంతే. సత్య పిన్ని ఏదో కోపంలో అలా అని ఉంటది కాని నీ మీద కోపం తనకెప్పుడూ ఉండదు మనల్ని ఎప్పుడూ బా చూసుకుంటుంది కదా అని అంటుంది.
 

37

ఆ మాటలు విన్న రాధా ఆనందపడుతుంది.దేవి అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవి వెళ్ళిపోయిన తర్వాత రాధ చిన్మయి నీ హద్దుకుంటుంది. మనసులో, నీకు నిజం అంతా తెలిసిన సరే దేవిని అక్కడికి పంపించాలని ఎంత ఆరాటపడుతున్నావమ్మా అని ఆనందపడుతుంది.ఆ తర్వాత సీన్లో సత్య, మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తూ, అక్క వెళ్లిపోయింది కదా ఇప్పుడు తనకి ఇంకో పెళ్లి అయింది, పిల్లలు కూడా ఉన్నారు మంచి కుటుంబం కదా మళ్లీ ఎందుకు ఇట్టవైపు వస్తుంది.
 

47

అక్కకి ఆదిత్య అంటే మళ్ళీ ప్రేమ మొదలైందా?నాకోసమే కదా ఆదిత్యని వదిలి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు దేవిని పంపించి దేవి ద్వారా ఆదిత్య కి దగ్గర అవ్వాలనుకుంటుందా! ఎన్ని రోజులు నేను అక్కని ఎంత మంచి దానివి అనుకున్నాను, ఎప్పుడు అక్కని తప్పు పట్టలేదు. ఇప్పుడు జరిగిన విషయాలు చూస్తే అదే నిజమనిపిస్తుంది. అయినా నేను ఎన్నిసార్లు అడిగినా నాకు నిజం చెప్పలేదు అక్క కానీ ఆదిత్య ఎందుకు నిజం చెప్పింది అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో మాధవ్, నేను ఇన్ని రోజులు దేవిని ఆ ఇంటికి వెళ్ళకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశాను.
 

57

ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు.దేవి తనంట తానే అక్కడికి వెళ్ళనని అంది. పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి ఇదే సమయంలో రాదని ఎలాగైనా నేను శ్రీశైలం తీసుకువెళ్లాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో ఆదిత్య ఎంత ఫోన్ చేసినా రుక్మిణి ఫోన్ ఎత్తదు. అప్పుడు రుక్మిణి మనసులో, నేను మీకు ఫోన్ మళ్ళీ ఎత్తితే సత్య నా గురించి మళ్ళీ తప్పుగా అనుకుంటుంది.ఎప్పుడూ ఒక మాట కూడా అని సత్య ఈరోజు దేవిని తిట్టింది అంటే తన మనసు ఎంత బాధపడి ఉంటుంది.
 

67

 దేవిని చిన్నప్పటినుంచి ఎవరూ ఏమీ అనలేదు ఒకేసారి సత్య తిట్టే సరికి బాధపడుతుంది అని ఏడుస్తుంది. ఆ తర్వాత సీన్లో దేవి,చిన్మయి హాల్లో ఉండగా, దేవుడమ్మ కార్ డ్రైవరు గిఫ్ట్ పట్టుకొని అక్కడికి వస్తాడు.వచ్చి,అప్పుడు దేవుడమ్మ గారు మీకు ఈ గిఫ్ట్ ఇవ్వమని ఇచ్చారు అని చెప్తాడు.అప్పుడు దేవి నాకు ఏ గిఫ్ట్ వద్దు తిరిగి తీసుకువెళ్లిపొండి అంకుల్ అని అంటుంది. అప్పుడు చిన్మయి,వాళ్ళు మన కోసం ఎంత ప్రేమగా పంపించారు కదా వద్దు అని మనం చెప్పకూడదు అని ఆ గిఫ్ట్ని తీసుకుంటుంది. ఆ గిఫ్ట్ని తెరిచి అవన్నీ చూపిస్తుంది.
 

77

 చూసేవా దేవి మనం అంటే అంటే వాళ్లకి ఎంత ఇష్టమో! మనకోసం బట్టలు కూడా పంపించారు అని అంటుంది చిన్మయి.ఆ తర్వాత రుక్మిణికి  దేవుడమ్మ ఫోన్ చేస్తుంది.అమ్మ రాదా నేను దేవుడమ్మ  అని అనగా హా అని అంటుంది రాద. దేవిని తిట్టినందుకు నీకు కూడా కోపం వచ్చిందా అమ్మా! ఇక్కడ ఇంత జరిగిందని నాకు తెలీదు, నాకు దేవిని చూడాలని ఉన్నది అది నా మనవరాలు లాంటిది దాన్ని నేను ఎందుకు వదులుకుంటాను! వీలైతే ఒకసారి దాన్ని ఇంటికి పంపించమ్మా అని అడుగుతుంది దేవుడమ్మ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Upendra: ఆఫర్లు వస్తున్నా సినిమాలు వద్దంటోంది.. కూతురిపై ఉపేంద్ర కామెంట్స్
Recommended image2
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
Recommended image3
బ్ర‌హ్మానందం చెప్పిన ఈ మాట‌లు వింటే.. మ‌న‌సు తేలిక కావ‌డం ఖాయం. ఏం చెప్పాడు భ‌య్యా అస‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved