పెళ్లాలకు ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ చెప్పొందంటూ వెంకీ వార్నింగ్, `సంక్రాంతికి వస్తున్నాం` టీజర్ ఎలా ఉందంటే
వెంకటేష్ హీరోగా నటిస్తున్న `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇందులో పెళ్లాలకు ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీస్ చెప్పొందంటూ వెంకీ వార్నింగ్ ఇవ్వడం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న మూవీ `సంక్రాంతికి వస్తున్నాం`. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. దిల్ రాజు ఈ మూవీని నిర్మించడం విశేషం. వీరి కాంబినేషన్‌లో `ఎఫ్ 2`, `ఎఫ్3` వచ్చాయి. ఇప్పుడు `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో వస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. వెంకటేష్, మహేష్ కలిసి `సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో నటించారు. దిల్ రాజు నిర్మించారు. అది సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీకి కూడా సంక్రాంతికి రాబోతుంది.
దీంతో మరో హిట్ గ్యారంటీ అనే టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ వచ్చింది. ఇది ఆద్యంతం ఫ్యామిలీ ఎలిమెంట్లతో రూపొందించారు అనిల్ రావిపూడి. ప్రభుత్వం కూలిపోతుందని, సరైనా ఆఫీసర్‌ని పెట్టి ఒక ఆపరేషన్ చేయాలని నరేష్ తన అధికారులకు చెబుతాడు. దీంతో వెంకీ ఎంట్రీని చూపించారు.
తనదైన కామిక్ సీన్ తో వెంకీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఫ్యామిలీ బాధ్యతల్లో మునిగితేలుతుంటారు. వెంకటేష్, ఐశ్వర్యా రాజేష్ అన్యోన్య దంపతులుగా రాణిస్తున్నారు. మన మధ్యలోకి ఎవరు వస్తారు బావా అంటుంది ఐశ్వర్య. ఇంతలోనే పోలీస్ ఆఫీసర్ మీనాక్షి చౌదరి వస్తుంది. ఆమె వెంకీ ఎక్స్ లవర్.
మీనాక్షిని చూడగానే వెంకటేష్‌కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆమెకి షేక్ హ్యండ్ కూడా ఇస్తాడు. అది చూసి దిమ్మతిరిగి పడిపోతుంది ఐశ్వర్య. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుమానిస్తుంది ఐష్. మీ భర్తపై తనకు ఇంట్రెస్ట్ లేదు, అలాంటి ఫీలింగ్ లేదని చెబుతుంది. కానీ వర్షం పడుతుండగా, మెరుపుల శబ్దానికి భయపడి వెంకీని హగ్ చేసుకుంటుంది మీనాక్షి.
అంతే ఇక కొంప కొల్లేరు అన్నట్టుగా మారిపోతుంది. మీనాక్షి, వెంకీ కలిసి ఒక ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. వీరితోపాటు ఐశ్వర్యా కూడా వస్తానని చెబుతుంది. ఐష్‌కి వెంకీపై అనుమానం దీంతో తన ఆపరేషన్ సరిగా చేయలేకపోతాడు. ఎప్పుడూ భార్యతో గొడవలే జరుగుతుంటాయి.
read more: వాటిలో ఏది టచ్ చేసినా దెబ్బలే.. చిరంజీవి నటుడిగా మారడం వెనుక అసలు కారణాలు
దీంతో ఫ్లాష్ బ్యాక్‌లు, స్కూల్, కాలేజీ లవ్ స్టోరీలు పెళ్లాలలకు చెప్పొందంటూ సూచిస్తాడు. హెచ్చరిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్లాష్ బ్యాక్‌లు ఉంటాయంటూ యాక్షన్‌లోకి దిగుతాడు వెంకీ. ఓ వైపు విరోచితంగా యాక్షన్ చేస్తూనే ఈ భార్యతో దొబ్బులు తింటూనే ఉంటాడు.
భార్యతో వేధింపులు ఫేస్ చేస్తూనే ఉంటాడు. ఆమెనే మ్యానేజ్ చేసే క్రమంలో నానా కష్టాలు అనుభవిస్తుంటాడు. ఇక చివరగా ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారీ వీడిదే విజయం అని పోలీస్ క్యారెక్టర్ ద్వారా చెప్పించడం హైలైట్‌గా నిలిచింది.
also read: కన్నీళ్లు పెట్టుకున్న దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ ఎందుకిలా చేస్తున్నారు
ఫ్యామిలీ ఎలిమెంట్లు, భార్యతో గొడవలు, భార్యతో భర్త పడే బాధలు కామెడీగా ఉన్నాయి. అదే సమయంలో రొటీన్‌గా అనిపిస్తుంది. బలవంతపు కామెడీగా అనిపిస్తుంది. అనిల్ రావిపూడి `ఎఫ్2`తో ఫర్వాలేదనిపించాడు.
కానీ `ఎఫ్3`లో మాత్రం బలవంతపు కామెడీతో చిరాకు తెప్పించాడు. చూడబోతుంటే `సంక్రాంతికి వస్తున్నాం`లో కూడా అలాంటి ఛాయలే కనిపిస్తున్నాయి. కామెడీలో సహజత్వం కనిపించడం లేదు. ఫన్ ఎలిమెంట్లు వర్కౌట్ అయితేనే సినిమా నిలబడుతుంది, లేదంటే కష్టమనే చెప్పాలి.
ఫ్యామిలీ ఎలిమెంట్లు, పండగని తలపించే ఎలిమెంట్లు, భార్యాభర్తల మధ్య మనస్పర్థాలు, లవర్ వచ్చి చిచ్చు పెట్టడం మెయిన్‌గా ఉన్నా అవి తెరపై ఎంత వరకు వర్కౌట్ అవుతాయనేది చూడాలి. ట్రైలర్‌లో పెద్దగా వర్క్ కాలేదు. రొటీన్ రొడ్డకొట్టుడు ఫీలింగ్‌ని కలిగిస్తున్నాయి. మరి థియేటర్లో అయినా వర్క్ అవుతాయా? అనేది సస్పెన్స్. ఏం జరుగుతుందో చూడాలి.
trailer link: వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ట్రైలర్