MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కన్నీళ్లు పెట్టుకున్న దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ ఎందుకిలా చేస్తున్నారు

కన్నీళ్లు పెట్టుకున్న దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ ఎందుకిలా చేస్తున్నారు

టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న నిర్మాత ఎవరంటే అది దిల్ రాజు మాత్రమే. ఆయన నిర్మించిన పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని కూడా ఆయనే నిర్మించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 06 2025, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న నిర్మాత ఎవరంటే అది దిల్ రాజు మాత్రమే. ఆయన నిర్మించిన పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని కూడా ఆయనే నిర్మించారు. ఆ మూవీ జనవరి 14న రిలీజ్ అవుతోంది. మధ్యలో బాలయ్య డాకు మహారాజ్ చిత్రం కూడా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డాకు మహారాజ్ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కాదు.. కానీ నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మూడు చిత్రాల్లో దిల్ రాజు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అయితే దిల్ రాజు టెన్షన్ మొత్తం గేమ్ ఛేంజర్ పైనే కనిపిస్తోంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. పాటల కోసమే 75 కోట్లు ఖర్చు చేశారట. దీనితో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని దిల్ రాజు ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. జనవరి 4 న రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. 

36

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కువ సమయం మాట్లాడలేకపోయాను. ప్రేక్షకులు భారీగా రావడం వల్ల బ్యారికేడ్లు విరిపోతున్నాయి అని పోలీసు వారు తెలిపారు. దీనితో ఎలాంటి సంఘటనలు జరగకూడదని ఈవెంట్ ని త్వరగా ముగించాం. 

46

పవన్ కళ్యాణ్ గారు తనకి వకీల్ సాబ్ చిత్రం జనసేన పార్టీని నడిపించడానికి ఇంధనంలా పనిచేసింది చెప్పారు. ఆ విషయం నాకు తెలియదు. వకీల్ సాబ్ రెమ్యునరేషన్ వల్లే జనసేన పార్టీ నిలబడింది అని పవన్ కళ్యాణ్ అంతటి వ్యక్తి చెప్పడంతో వేదికపైనే నాకు కన్నీళ్లు వచ్చాయి. కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసిన పనుల వల్ల అద్భుతాలు జరుగుతుంటాయి అని దిల్ రాజు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి వకీల్ సాబ్ కంబ్యాక్ మూవీ. ఆ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఆయన సందేహపడ్డారు. ఆడియన్స్ నానుంచి ఇలాంటి కథని రిసీవ్ చేసుకుంటారా అని అడిగారు. 

56

దీనిని రీమేక్ మూవీగా చూడొద్దు, ఫ్యాన్స్ కి నచ్చేలా చేయడంలో నాది భాద్యత అని దిల్ రాజు పవన్ కి చెప్పారట. ఆ విధంగా వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ తో నా జర్నీ తొలిప్రేమ నుంచి మొదలైంది అని మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత పాలిటిక్స్ లోకి వెళుతున్నట్లు ప్రకటించారు. అరె.. పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా చేస్తున్నాడు.. ఇంత ఇమేజ్ పెట్టుకుని రాజకీయాల్లోకి ఎందుకు అని అనుకున్నా. నాతో పాటు ఆయన మంచి కోరుకునే చాలా మంది ఎందుకు పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు అని అనుకున్నాం. 

66

కానీ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. పాలిటిక్స్ ఒకసారి ప్రయత్నించారు వర్కౌట్ కాలేదు.. తిగిరి మళ్ళీ సినిమాలు చేశారు.. మల్లి రాజకీయాలపై ఫోకస్ చేసి గట్టిగా కొట్టారు. ఆయన ఎక్కడా హాప్ కోల్పోలేదు.. వదిలిపెట్టలేదు అని దిల్ రాజు తెలిపారు. 21 సీట్లకు 21 సీట్లు గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ నాకు గేమ్ ఛేంజర్ లాగా కనిపించారు అని దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved