సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దవుతుందా ?..దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు, బన్నీ బెయిల్ రద్దుపై ఇలా..
పుష్ప 2 ప్రీమియర్స్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై పోలీసులు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అయితే బన్నీ మధ్యంతర బెయిల్ పై బయటకి వచ్చారు.
పుష్ప 2 ప్రీమియర్స్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై పోలీసులు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అయితే బన్నీ మధ్యంతర బెయిల్ పై బయటకి వచ్చారు. తాజాగా హైదరాబాద్ సీపీ సివి ఆనంద్ సంధ్య థియేటర్ కి షోకాజు నోటీసు జారీ చేయడం ఈ కేసులో ఆసక్తికర పరిణామంగా మారింది.
ఆల్రెడీ పోలీసులు అల్లు అర్జున్ పై, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పలు కేసులు నమోదు చేశారు. సంధ్య థియేటర్ లైసెన్సు రద్దు చేసే ఆలోచన దిశగా పోలీసుల చర్యలు మొదలయ్యాయి. అయితే లైసెన్స్ రద్దవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. సంధ్య థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సివి ఆనంద్ యాజమాన్యానికి షోకాజు నోటీసు పంపారు. దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు.
యాజమాన్యం ఇచ్చే వివరణపై పోలీసుల తదుపరి చర్యలు ఉంటాయి. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు సిసి ఆనంద్ తెలిపారు. నేడు సివి ఆనంద్, హెల్త్ సెక్రటరీ తో కలసి శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు.
వైద్యులని అడిగి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. శ్రీతేజ్ చికిత్సకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది అని అన్నారు. చివర్లో మీడియా ప్రతినిధులు.. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు అవుతుంది అని వార్తలు వస్తున్నాయి.. దీనిపై స్పందించాలని కోరగా ఆయన నిరాకరించారు.