55 ఏళ్ళ వయసులో ఆమెతో ఇంత అసభ్యంగానా, గౌరవం పోగొట్టుకున్న ఫ్యామిలీ మ్యాన్ హీరో..దారుణంగా ట్రోలింగ్
నటుడు మనోజ్ బాజ్ పాయ్ గురించి పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మనోజ్ బాజ్ పాయ్ ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నారు.
నటుడు మనోజ్ బాజ్ పాయ్ గురించి పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మనోజ్ బాజ్ పాయ్ ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా రాణిస్తూ వచ్చిన మనోజ్ బాజ్ పాయ్ కి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. మనోజ్ తన కామెడీ టైమింగ్, ఎమోషన్, యాక్షన్ తో అదరగొట్టేశారు.
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మనోజ్ బాజ్ పాయ్ కి నటుడిగా గుర్తింపు మాత్రమే కాదు గౌరవం కూడా తీసుకు వచ్చింది. టెర్రరిస్టుల కదలికల్ని గమనిస్తూ వారి అటకట్టించే సీనియర్స్ అధికారిగా మనోజ్ నటించారు. ఇదిలా ఉండాగా మనోజ్ బాజ్ పాయ్ ఇతర చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. గతంలో ఆయన తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. అల్లు అర్జున్ హ్యాపీ, పవన్ కళ్యాణ్ కొమరం పులి లాంటి చిత్రాల్లో మనోజ్ నటించారు.
మనోజ్ నటించిన లేటెస్ట్ మూవీ డిస్పాచ్ డిసెంబర్ 13 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చిత్రంలో మనోజ్ బాజ్ పాయ్, షహానా గోస్వామి జంటగా నటించారు. అయితే డిస్పాచ్ చిత్రంతో మనోజ్ బాజ్ పాయ్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కారణం ఈ చిత్రంలో శృతి మించిన రొమాంటిక్ సన్నివేశాలే.
మనోజ్, షహానా గోస్వామి మధ్య ఈ చిత్రంలో దారుణమైన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ సన్నివేశాలని సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. ఇంత అసభ్యకరమైన రొమాన్స్ ని మనోజ్ నుంచి అసలు ఊహించలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 55 ఏళ్ళ వయసులో ఇలాంటి సన్నివేశాల్లో నటించేందుకు మనోజ్ అసలు ఎందుకు అంగీకరించారు అనేది నెటిజన్ల ప్రశ్న.
మనోజ్ బాజ్ పాయ్ ట్రోలింగ్ కి గురి కావడం మాత్రమే కాదు నటుడిగా డిస్పాచ్ చిత్రంతో గౌరవం పోగొట్టుకున్నారు అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక హద్దు అంటూ లేకుండా అసభ్యంగా ఆ సన్నివేశాలు ఉన్నాయి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్రోలింగ్ పై మనోజ్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.