MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Intinti gruhalakshmi: లాస్య కొత్త పథకం.. తులసికి ఉగ్రరూపం చూపించిన సామ్రాట్!

Intinti gruhalakshmi: లాస్య కొత్త పథకం.. తులసికి ఉగ్రరూపం చూపించిన సామ్రాట్!

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

2 Min read
Author : Navya G
Published : Sep 07 2022, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..అభి, వాళ్ళ అత్తగారు ఇంటికి వస్తాడు. అప్పుడు అంకిత వాళ్ళ అమ్మ, అంకిత తేకుండా నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా! మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.దానికి అభి, అంకిత లేకపోతే నాకు ఇంట్లో విలువ ఉండదా?, నేను ఏంటి అల్లుడు కాదా అని అడగగా కాదు, నువ్వు లేకపోయినా అక్కడ అంకితకు విలువ ఉంతుంది  కానీ అంకిత లేకపోతే ఇక్కడ నీకు విలువ ఉండదు. ఒకవేళ అంకిత రాను అంటే విడాకులు ఇచ్చేయు. అప్పుడు  చచ్చినట్టు మా ఇంటికి వస్తుంది అని అంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పుడు అభి, మరి ఈ ఇంట్లో నా స్థానం కోల్పోతాను కదా అని అనగా, అది నీ సమస్య దానికి నాకు ఏం సంబంధం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంకిత వాళ్ళ అమ్మ. ఆ తర్వాత సీన్లో నందు, నువ్వు చాలా తెలివైన దానివి లాస్య, ఏమాత్రం భయం లేకుండా భలే అబద్ధం చెప్పావు.ఒకవేళ సామ్రాట్ తులసి కలిసినప్పుడు నిజం తెలిస్తే ఏమవుతుంది అని అడగగా, వాళ్ళు ఇంక కలవరు.ఎందుకంటే నా దగ్గర ఇంకో ప్లాన్ కూడా ఉన్నది.నేను  తులసి లాగా పేపర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.
 

36

 వాళ్ళు పేపర్లో తులసి పేరు వేశారు.ఇది వెళ్లి ఇలా సామ్రాట్ కి చూపిస్తే తులసి పని సగం అయిపోతుంది.ఇప్పుడు ప్రెస్ వాళ్ళు తులసి ఇంటికి వెళతారు. అదే సమయంలో మనం సామ్రాట్ ని అక్కడికి తీసుకెళ్లేలా చేస్తే ఇంక తులసి పని పూర్తిగా అయిపోతుంది. ఎందుకంటే అందరి ముందు తులసి, సామ్రాట్ ప్రాజెక్ట్ తప్పుకుంది అని చెప్తే సామ్రాట్ కి అవమానం, అదే మనకు లాభం అని అంటుంది.దానికి నందు భయపడతాడు. ఆ తర్వాత సీన్లో తులసి ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్లి, నేను స్కూల్లో మ్యూజిక్ క్లాస్ చెప్పడం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను.
 

46

బాగా జరగాలని కోరుకోండి మావయ్య,అత్తయ్య అని ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్తుండగా ప్రెస్ వాళ్ళు అక్కడికి వస్తారు  మీరు సామ్రాట్ గారి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది నిజమేనా అని అడగగా, వీళ్ళకి ఎలా తెలిసింది?సామ్రాన్ గారు అందరికీ చెప్పి నా పరువు తీయాలని అనుకుంటున్నారా అని అనుకుంటుంది. అదే సమయంలో సామ్రాట్ పేపర్ లో వచ్చిన వార్తను చదువుతాడు. అయినా తను ఎందుకు ఇలా చేస్తుంది అసలు ఏమనుకుంటుంది అని అనగా లాస్య వచ్చి, చూశారా సార్ మీరు ఇలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇస్తే మీకే ప్రమాదం అని మరోసారి నిరూపించింది తులసి అని అంటుంది.
 

56

 అప్పుడు సామ్రాట్ నేనిప్పుడే వెళ్లి తన అంతు చూస్తాను అని వెళ్తాడు. అదే సమయంలో ప్రెస్ వాళ్ళందరూ, చెప్పండి మేడం మీరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా అని అడగగా, మీరు ఈ విషయాలన్నీ సామ్రాట్ గారిని అడగాలి. నా దగ్గరికి వచ్చి అడిగినంత మాత్రాన మీకు ఏమీ లాభం ఉండదు. అయినా సామ్రాట్ గారు ఈ విషయం గురించి మాట్లాడితేనే పద్ధతిగా ఉంటుంది ఇంక వదిలేయండి అని వారిని పంపించేస్తుంది.అదే సమయంలో సామ్రాట్ అక్కడికి వస్తాడు.
 

66

ప్రెస్ వాళ్ళు వెళ్లడం చూసి తులసి నిజంగానే ప్రెస్ వాళ్ళను తీసుకొచ్చింది,లాస్య  చెప్పింది నిజమే అనుకుంటాడు. అప్పుడు సామ్రాట, ఇంటి లోపలికి వచ్చి కుటుంబమంతా కలిసి నా మీద పథకం వేస్తున్నారా? పక్షి కొండమీదకి ఎక్కినంత మాత్రాన కొండ కన్నా ఎత్తు అయిపోదు అని తెలుసుకోమనండి. పరంధామయ్య గారు, మీరు ఏదో అన్నట్టున్నారు కదా మొన్న ఇప్పుడు ఏమైంది అయినా అవకాశం ఇచ్చేమని, ప్రతి ఒక్కరూ నెత్తినెక్కితే కుదరదు అని తిడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image2
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Recommended image3
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved