MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్

Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్

Priyanka Singh: సాయి తేజ్ నుంచి ప్రియాంక సింగ్ గా తన ప్రయాణం గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యింది సోషల్ మీడియా స్టార్ పింకీ. బతుకుతానో లేదో తెలియిన పరిస్థితుల్లో.. నొప్పులతో నిద్రలేని రాత్రులను జయించి ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 08 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ ద్వారా ప్రత్యేక గుర్తింపు..
Image Credit : our own

బిగ్ బాస్ ద్వారా ప్రత్యేక గుర్తింపు..

తెలుగు బుల్లితెరపై 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత 'బిగ్ బాస్' రియాలిటీ షోతో మరింత ప్రజాదరణ పొందిన సెలెబ్రిటీ ప్రియాంక సింగ్. చిన్నతనం నుంచే మనసులో తాను ఒక అమ్మాయిననే భావన ఉన్నప్పటికీ, సమాజం, పరిస్థితుల భయం మధ్య జీవించిన ఆమె.. చివరికి ధైర్యం చేసి అబ్బాయి (సాయి తేజ) రూపం నుండి పూర్తిగా అమ్మాయి (ప్రియాంక సింగ్)గా మారాలని నిర్ణయించుకున్నారు. అబ్బాయి నుంచి ట్రాన్స్‌జెండర్‌గా మారేందుకు ఆమె చేసిన పోరాటం, అనుభవించిన నరకం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ముంబైలో లింగమార్పిడి ‌- శారీరక, మానసిక వేదన
Image Credit : Insta_priyankasingh.official_

ముంబైలో లింగమార్పిడి ‌- శారీరక, మానసిక వేదన

ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్‌గా మారి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. లింగమార్పిడి (Gender Reassignment Surgery) కోసం ఆమె ముంబై వెళ్లి అనేక అవస్థలు పడ్డారు. ఆపరేషన్ తర్వాత తీవ్రమైన రక్తం కారడం (బ్రీడింగ్), విపరీతమైన శారీరక నొప్పులు, నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందని తెలిపారు. సర్జరీ అనంతరం కొంతకాలం విరామం తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో తీసుకున్న కొన్ని సర్జరీకి సంబంధించిన ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

34
బ్రతుకుతానో లేదో తెలియని పరిస్థితి..
Image Credit : social media

బ్రతుకుతానో లేదో తెలియని పరిస్థితి..

ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. "నా భవిష్యత్తు ఏమవుతుందో, నేను బతుకుతానో లేదో తెలియని పరిస్థితిలో తీవ్ర భయాందోళనలు, గందరగోళం అనుభవించాను. ఆ సమయంలో నేను చిందించిన కన్నీళ్లు, అనుభవించిన వేదనను మాటల్లో వర్ణించలేను" అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఎంతో కాన్ఫిడెంట్ తో లైఫ్ ను లీడ్ చేస్తోంది ప్రియాంక.

44
అద్దంలో నన్ను చూసుకుంటే గర్వంగా ఉంది!
Image Credit : our own

అద్దంలో నన్ను చూసుకుంటే గర్వంగా ఉంది!

ఈ పదేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా జీవితం అనేక భావోద్వేగ అధ్యాయాలతో నిండి ఉందని ప్రియాంక పేర్కొన్నారు. అందులో ఎంతటి మానసిక, శారీరక బాధాకరమైన సంఘటనలు ఉన్నాయో, వాటన్నింటినీ దాటుకుని అనుకున్న గుర్తింపు సాధించినందుకు అంతే సంతోషకరమైన క్షణాలు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. సమాజం నుండి వచ్చిన విమర్శలు, అవమానాలు ఎదుర్కొని ఒక స్వతంత్ర మహిళగా నిలబడడం సాధారణ విషయం కాదు. "ఈరోజు అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు, నేను సాధించిన విజయాన్ని బట్టి నాపై నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది" అని ప్రియాంక ధైర్యంగా స్పష్టం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian 3: రెండోది అట్టర్ ఫ్లాప్, అయినా మూడోది మొదలు పెట్టిన శంకర్.. వార్ మోడ్‌లో 'భారతీయుడు 3' షురూ
Recommended image2
Nana Patekar: హీరో హీరోయిన్లని డామినేట్ చేసిన నానా పటేకర్.. నేషనల్ అవార్డు కొట్టిన ఆ మూవీ మిస్ కావొద్దు
Recommended image3
Bathukamma Song : మంగ్లీ స్టైల్లో మరో బతుకమ్మ పాట రెడీ.. ఐదు గంటల్లోనే లక్ష వ్యూస్, యూట్యూబ్ ను షేక్ చేస్తోందిగా
Related Stories
Recommended image1
NTR: జనాలు రాళ్ళతో కొడతారేమో అని ఎన్టీఆర్ భయం, 10 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన తారక్..
Recommended image2
Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved