- Home
- Entertainment
- Maa Inti Bangaram: సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ఎందుకు చూడాలనేదానికి 5 కారణాలు
Maa Inti Bangaram: సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ఎందుకు చూడాలనేదానికి 5 కారణాలు
సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ నుంచి ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. మరి ఈ మూవీని ఎందుకు చూడాలంటే, ఐదు కారణాలు చూద్దాం.

మా ఇంటి బంగారంతో సందడి చేయబోతున్న సమంత
సమంత టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఒకప్పుడు అత్యంత బిజీ హీరోయిన్‌గా రాణించింది. తెలుగులో దాదాపు అందరు స్టార్లతో కలిసి నటించింది. వరుసగా విజయాలు అందుకుంది. అత్యంత క్రేజీ హీరోయిన్ అయిన సమంత ఇప్పుడు కొంత గ్యాప్‌తో వస్తోంది. ప్రస్తుతం ఆమె `మా ఇంటి బంగారం` చిత్రంలో నటించింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సమంత భర్త రాజ్ నిడిమోరు కథ, మాటలు అందించడం విశేషం. అంతేకాదు ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్‌నిడిమోరు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల(జూన్) 19న విడుదల కాబోతుంది. మరో రెండు వారాల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఎందుకు చూడాలనేదానికి ఐదు కారణాలు తెలుసుకుందాం.
మూడేళ్ల తర్వాత వస్తోన్న సమంత
`మా ఇంటి బంగారం` సినిమా చూడ్డానికి మొదటి ప్రధాన కారణం.. మూడేళ్ల తర్వాత సమంత నటించిన చిత్రమిది. ఆమె చివరగా `ఖుషి` చిత్రంతో మెరిసింది. 2023లో ఇది రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఏడాది బ్రేక్ ప్రకటించింది. కానీ మూడేళ్లు వచ్చింది. మయోసైటిస్ అనే వ్యాధిని ఎదుర్కొని సినిమాలు చేసే క్రమంలో.. తన తండ్రి చనిపోయాడు. దీంతో మరింతగా కుంగిపోయింది సమంత. దాన్ని తట్టుకుని, అనేక అడ్డంకులను దాటుకుని ఈ మూవీ చేసింది సామ్. మూడేళ్ల తర్వాత థియేట్రికల్ రిలీజ్‌తో వస్తోన్న సమంత కోసం ఈ మూవీని చూడొచ్చు.
భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సినిమా నిర్మించిన సమంత
ఈ సినిమా చూడ్డానికి రెండో కారణం.. సమంతనే నిర్మాత. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మించింది. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ ని స్థాపించి మొదటగా చిన్న బడ్జెట్‌తో `శుభం` చిత్రాన్ని నిర్మించింది సమంత. సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఈ మూవీ చేసింది. పెళ్లి తర్వాత సమంత నుంచి రిలీజ్ అవుతున్న సినిమా కావడం, భర్తతో కలిసి నిర్మించిన సినిమా కావడం ఓ విశేషమైతే, దీనికి కథ, స్క్రీన్‌ప్లే రాజ్ నిడిమోరు అందించడం మరో విశేషం.
యాక్షన్‌తో దుమ్ములేపిన సమంత
`మా ఇంటి బంగారం` సినిమా చూడ్డానికి మూడో కారణం.. యాక్షన్. ఇందులో సమంత చేసిన యాక్షన్ చూస్తే వాహ్ అనాల్సిందే. హీరోల రేంజ్‌లో ఫైట్స్ చేసి మెప్పించింది. స్టయిలీష్ యాక్షన్‌తో అదరగొట్టింది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్‌లో సమంత యాక్షన్ చేసింది. అదోరకమైన యాక్షన్. ఇది మరో రకమైన యాక్షన్. ఇలా ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరోయిన్ చేయలేదని చెప్పొచ్చు. సమంత మతిపోగొట్టింది. ఆమె చేసే ఫైట్స్ కోసమైనా మూవీ చూడాలని చెప్పొచ్చు.
ఫ్యామిలీ కంటెంట్ మరో హైలైట్
ఇక నాల్గో కారణం కంటెంట్ సినిమాలో మంచి కంటెంట్ ఉందనిపిస్తోంది. ఫ్యామిలీ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి కామెడీ కూడా ఉంది. యాక్షన్‌తోపాటు ఫన్ ఇందులో హైలైట్‌గా నిలుస్తుందని, బయటకు సమంత వేరు, పెళ్లి చేసుకున్నాక అత్తారింట్లో ఆమె మ్యానేజ్ చేసే అంశాలు ఫన్నీగా ఉన్నాయని ట్రైలర్‌లో చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సమంత చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఇవి సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయని చెప్పొచ్చు.
సాలిడ్ టీమ్
ఫైనల్‌గా టెక్నీకల్ టీమ్.. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం. `ఓ బేబీ` తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ కావడం విశేషం. అలాగే సంతోష్ నారాయణ్ సంగీతం కూడా సినిమాకి మరో ప్లస్ కాబోతుందట. పాటలు ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా అదిరిపోతుందని టాక్. ఇందులో ఆర్టిస్ట్ లు కూడా సాలిడ్‌గానే ఉన్నారు. శ్రీముఖి నవ్వించేలా ఉంది. అలాగే దిగంత్, గుల్షన్ దేవయ్య వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గౌతమి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష, ఆనంద్, లక్ష్మి వంటి వారు నటిస్తున్నారు. ఇలా మంచి ప్యాకేజీగా ఈ మూవీ వస్తుందని తెలుస్తోంది. మరి థియేటర్లోకి వచ్చాక ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. ఈ సినిమా జూన్ 19న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

