MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Peddi Hit Target: పెద్ది మూవీ సక్సెస్‌ కావాలంటే ఎన్నికోట్లు రావాలో తెలుసా? పెద్ద రిస్కే

Peddi Hit Target: పెద్ది మూవీ సక్సెస్‌ కావాలంటే ఎన్నికోట్లు రావాలో తెలుసా? పెద్ద రిస్కే

Peddi Hit Target: రామ్‌ చరణ్‌ నటించిన అత్యంత ప్రస్టీజియస్‌ మూవీ `పెద్ది`. మరో రెండు రోజుల్లో రిలీజ్‌ కాబోతున్న ఈ మూవీ కలెక్షన్లు టార్గెట్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతనేది చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 02 2026, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్దికి బజ్‌ లేకపోవడానికి కారణం ఇదే
Image Credit : Asianet News

పెద్దికి బజ్‌ లేకపోవడానికి కారణం ఇదే

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ `పెద్ది` సినిమాతో రాబోతున్నారు. మరో రెండు రోజుల్లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. గత నెల రోజులుగా వరుసగా ప్రమోషన్స్ తో టీమ్‌ బిజీగా ఉంది. సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బజ్‌ రావడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ జోరు కనిపించడం లేదు. ట్రైలర్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అభిమానుల అంచనాలను ట్రైలర్‌ అందుకోలేదని అంటున్నారు. అందుకే ఓవర్సీస్‌ బుకింగ్స్ స్లోగా ఉన్నాయని టాక్‌. ప్రస్తుతం ఇది ఓవర్సీస్‌లో 750కే డాలర్లు దాటింది. ఒక మిలియన్‌ దిశగా వెళ్తుంది. అక్కడ రిలీజ్‌కి ఒక్క రోజే ఉంది. అయినా ఇంకా వన్‌ మిలియన్‌ టచ్‌ కాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అక్కడ హిట్‌ కావాలంటే దాదాపు  ఐదు మిలియన్స్ డాటాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెద్ది ప్రీ రిలీజ్‌ థియేట్రికల్‌ బిజినెస్
Image Credit : Asianet News

పెద్ది ప్రీ రిలీజ్‌ థియేట్రికల్‌ బిజినెస్

ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్‌ లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ మూవీ `గేమ్‌ ఛేంజర్‌`ని దాటలేకపోయింది. కానీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ మాత్రం భారీగానే ఉంది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.218.50కోట్ల బిజినెస్‌ అయ్యిందట. నైజాంలో రూ.48కోట్లకు అమ్ముడు పోయింది. సీడెడ్‌ రైట్స్ రూ.24కోట్లకు అమ్ముడు పోగా, ఉత్తరాంధ్ర రూ.18కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.10.20కోట్లు, వెస్ట్ గోదావరి రూ.8.25కోట్లు, గుంటూరు రూ.11.20, కృష్ణ రూ.9.30కోట్లు, నెల్లూరు రూ.6.30కోట్లకు అమ్ముడు పోయింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.135.25కోట్లు వ్యాపారం జరిగిందట.

35
పెద్ది కలెక్షన్ల టార్గెట్‌
Image Credit : Asianet News

పెద్ది కలెక్షన్ల టార్గెట్‌

దీంతోపాటు కర్నాటకలో రూ.17కోట్లు, తమిళనాడులో రూ.5.25కోట్లు, కేరళాలో రెండు కోట్లు నార్త్ లో రూ.25కోట్ల వరకు వ్యాల్యూ కట్టారు. ఓవర్సీస్‌లో రూ.34కోట్లకు సేల్‌ అయ్యింది. మొత్తంగా రూ.220కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో ఈ మూవీ విడుదల కాబోతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ మూవీకి ఉన్న బజ్‌ నేపథ్యంలో ఈ టార్గెట్‌ చాలా పెద్దదే అని టాక్‌ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే రూ.450కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రావాలి. మరి అది సాధ్యమేనా అనేది ప్రశ్న.

45
ఫస్ట్ డే టాక్‌ మీదే నమ్మకం పెట్టుకున్న పెద్ది టీమ్‌
Image Credit : Asianet News

ఫస్ట్ డే టాక్‌ మీదే నమ్మకం పెట్టుకున్న పెద్ది టీమ్‌

టీమ్‌ మాత్రం కంటెంట్‌ని నమ్ముకుంది. ఫస్ట్ డే టాక్‌తోనే ఈ మూవీ పుంజుకుంటుందనే భరోసాతో ఉన్నారు. కంటెంట్‌ మీద నమ్మకంతోనే ముందుకు సాగుతున్నారు. ఈ మూవీ భవిష్యత్‌లో మొదటి రోజు టాక్‌ మీదనే ఆధారపడి ఉందని చెప్పొచ్చు. అయితే బుచ్చిబాబు మీద నమ్మకం, రామ్‌ చరణ్‌ పడ్డ కష్టం మీద అంతా నమ్మకంతో ఉన్నారు. మరి అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

55
పెద్ది టీమ్‌, బడ్జెట్‌ వివరాలు
Image Credit : Asianet News

పెద్ది టీమ్‌, బడ్జెట్‌ వివరాలు

రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన `పెద్ది` సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రుతి హాసన్‌ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. శివరాజ్‌ కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మించారు. ఈ మూవీకి సుమారు రూ.350కోట్ల బడ్జెట్‌ అయ్యిందని సమాచారం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Related Stories
Recommended image1
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image2
Most Anticipated Film: పెద్ది, టాక్సిక్, రామాయణ చిత్రాలకు ఝలక్.. 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved