Samantha Shocking Looks: సమంత ఇలా మారిపోయిందేంటి, అంతా హాలీవుడ్ కోసమేనా?
Samantha Shocking Looks: ఊహించని విధంగా మారిపోయి షాక్ ఇచ్చింది స్టార్ హీరోయిన్ సమంత. అసలు ఈఫోటోలో ఉన్నదిసమంతేనా అని డౌట్ వచ్చేవిధంగా తనలుక్స్ ను మార్చేసింది. ఇంతకీ ఈ షాకింగ్ లుక్స్ కు కారణం ఏంటి..?

Samantha Shocking Look: చాలా రోజులు గ్యాప్ తరువాత ఈమధ్యే మళ్ళీ యాక్టీవ్ అవుతోంది సమంత. అయితే ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో ఏ ప్రాజెక్ట్ చేయడంలేదు. తెలుగుపరిశ్రమకు దూరంగా బాలీవుడ్ తోనే ఎక్కువ టైం గడుపుతోంది. అంతే కాదు అక్కడే సెటిల్ అవుతుంది అని కూడా అంటున్నారు. ఈక్రమంలో సమంత సీటాడెల్ వెబ్ సిరీస్ ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే.
Also Read: 3 సినిమాలు, ఒక్కో సినిమాకు 100 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇక సమంత బాలీవుడ్ లోనే పలు ప్రాజెక్ట్ లు చేస్తోందని సమాచారం. ఈక్రమంలో సమంత త్వరలో హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది అని సమాచారం అందుతోంది. ఈక్రమంలోనే సమంత షాకింగ్ లుక్స్ కొన్ని సంచలనంగా మారాయి. ఖుషి మూవీ తరువాత తనకు ఉన్న మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడంతో పాటు.. కొంత కాలం రెస్ట్ తీసుకోవడంకోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సమంత.
Also Read:మాజీ ప్రధాని మనవరాలు, స్టార్ హీరోకు రెండో భార్య, రాజవంశానికి చెందిన హీరోయిన్
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సమంత. తాజాగా కొన్నిఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ పేజ్ లో పంచుకుంది. ఈ ఫోటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు. నిజంగా సమంతేనా ఈమె అంటూ ప్రశ్నిస్తున్నారు. కంప్లీట్ గా లుక్స్ ను ఛేంజ్ చేసింది సమంత. షార్ట్ హెయిర్ తో ఓ అబ్బాయి మాదిరి తయారయ్యింది.
ఈ ఫోటోలు చూసి ప్యాన్స్ షాక్ అవుతున్నారు. సమంత ఎందుకు ఇలా తయారయ్యిందంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కొత్త లుక్స్ సినిమా కోసం కాదని.. ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం సమంత ఇలా మేకోవర్ అయ్యిందంటున్నారు. పనిలో పనిగా హాలీవుడ్ లో అవకాశాలు కూడా వస్తాయని ఇలా చేస్తోందట.
అయితే కేవలం మ్యాగజైన్ కోసం ఇలా మారిపోతుందా అని ఆమె ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా సమంత సోంతంగా ఓ నిర్మాణ సంస్థ కూడా స్టార్ట్ చేసింది. అటు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుంటూనే.. ఇటు మూవీస్ కు ప్రోడ్యూసర్ గా కూడా ఉండబోతోంది. అంతే కాదు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి రకరకాల ఈవెంట్లు కూడా ఫ్లాన్ చేస్తుందట సమంత. మరి సమంత హాలీవుడ్ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది చూడాలి మరి.