- Home
- Entertainment
- సమంతని తీసేసి రష్మిక మందన్నాతో ఓపెనింగ్ చేశారు, ఆగిపోయిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఏంటో తెలుసా?
సమంతని తీసేసి రష్మిక మందన్నాతో ఓపెనింగ్ చేశారు, ఆగిపోయిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ఏంటో తెలుసా?
రష్మిక మందన్నా ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆగిపోయింది. సమంతతో చేయాల్సిన ఆ మూవీని ఆమెని తప్పించి నేషనల్ క్రష్‌ని ఫైనల్ చేశారు. అయినా సినిమా కంప్లీట్ కాలేదు.

సమంతతో అనుకున్న మూవీ రష్మికతో
చిత్ర పరిశ్రమలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఇక సినిమాలు పట్టాలెక్కడం, మధ్యలోనే ఆగిపోవడం చాలా తరచుగా జరుగుతూనే ఉంటాయి. బడ్జెట్ పెరిగిపోవడం, సరైన ఔట్‌పుట్ రాకపోవడం, హీరోహీరోయిన్లకి, దర్శకుడికి మధ్య డిఫరెన్సెస్ రావడం, నిర్మాతకు ఇబ్బందులు ఎదురుకావడం వంటి కారణాలతో సినిమాలు ఆగిపోతుంటాయి. అలానే ఇటీవల ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆగిపోయింది. సమంతతో మొదట ప్రకటించి, ఆ తర్వాత రష్మిక మందన్నాతో ఓపెనింగ్ చేశారు. చివరికి అది ఆగిపోయింది.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంటున్న రష్మిక
ప్రస్తుతం రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా రాణిస్తోంది. `చావా`, `పుష్ప 2` చిత్రాలతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో రష్మిక వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె `ది గర్ల్ ఫ్రెండ్` అనే సినిమాలో నటిస్తోంది. ఇది విడుదలకు రెడీ అవుతోంది. దీంతోపాటు ఇటీవలే `మైసా` అనే చిత్రాన్ని ప్రకటించింది. ఇందులో తనే లీడ్ రోల్. భారీ యాక్షన్ మూవీగా ఇది రూపొందుతోంది.
ఆగిపోయిన రష్మిక మందన్న `రెయిన్ బో` మూవీ
అయితే వీటికంటే ముందే రష్మిక మందన్నా `రెయిన్ బో` అనే చిత్రంలో నటించేందుకు కమిట్ అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్‌ని అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా నిర్వహించారు. అమల చేతుల మీదుగా ఈ మూవీ ఓపెనింగ్ జరిగింది. `శాకుంతలం` ఫేమ్ దేవ్ మోహన్ ఇందులో రష్మికకి జోడీ కట్టారు. శాంతరూబన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మించే బాధ్యతలు తీసుకుంది. కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత అప్ డేట్ రాలేదు. బడ్జెట్ కారణమా? కథ బాగా రాలేదా? క్రియేటివ్ డిఫరెంట్స్ ఏదైనా ఉందా? కారణం ఏంటో గానీ రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ మూవీ ఆగిపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది.
సమంత హీరోయిన్‌గా `రెయిన్‌బో` ప్రకటన, తర్వాత రష్మిక ఎంట్రీ
అయితే ఈ సినిమాలో మొదట నటించాల్సిన హీరోయిన్ సమంత. సామ్‌తో నిర్మాతలు ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. అంతా ఓకే అయ్యింది. షూటింగ్ ప్రారంభం కావాల్సింది. కానీ చివరి నిమిషంలో ఆమెని తప్పించి రష్మికని ఎంపిక చేశారు. సామ్ తప్పుకోవడంతో రష్మికని ఫైనల్ చేసినట్టు సమాచారం. అయినా `రెయిన్‌బో` మూవీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడం గమనార్హం. అలా రష్మిక మందన్నా తన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆదిలోనే ఆగిపోయింది. ఇప్పుడు `ది గర్ల్ ఫ్రెండ్`, `మైసా` చిత్రాలతో అలరించేందుకు రాబోతుంది ఈ నేషనల్ క్రష్. మరోవైపు హిందీలో `తామా` అనే మూవీలో నటిస్తోంది. ఇటీవల `కుబేర`తో రష్మిక ఆకట్టుకున్న విషయం తెలిసిందే.