- Home
- Entertainment
- Kishkindhapuri Collections: `కిష్కింధపురి` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. సేఫ్ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Kishkindhapuri Collections: `కిష్కింధపురి` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. సేఫ్ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హర్రర్ థ్రిల్లర్ `కిష్కింధపురి` మూవీ రెండు రోజుల కలెక్షన్లు ఎంత వచ్చాయనేది తెలుసుకుందాం.

`కిష్కింధపురి` చిత్రంతో సందడి చేస్తోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా రోజులుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. చివరగా ఆయన `భైరవం` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇది యావరేజ్‌గానే ఆడింది. ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ `కిష్కింధపురి` మూవీతో సందడి చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. `మిరాయ్`తోపాటు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
`కిష్కింధపురి` మూవీకి మిశ్రమ స్పందన
`కిష్కింధపురి` మూవీ హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. హర్రర్ ఎలిమెంట్లు ఆకట్టుకున్నాయి. కానీ సరైన కథ లేదు, కథనానికి లాజిక్ లేదు. కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో `మిరాయ్` సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఆ ప్రభావం `కిష్కింధపురి` చిత్రంపై పడిందని చెప్పొచ్చు. అయినా ఈ మూవీ మంచి కలెక్షన్లనే రాబడుతుంది. బడ్జెట్ తక్కువ కావడం, థియేట్రికల్ బిజినెస్ కూడా తక్కువ కావడంతో దాన్ని బట్టి చూస్తే డీసెంట్ కలెక్షన్లనే రాబడుతుందని చెప్పొచ్చు.
`కిష్కింధపురి` మూవీ రెండు రోజుల కలెక్షన్లు
`కిష్కింధపురి` మూవీ తొలి రోజు ఇండియా వైడ్‌గా ఈ మూవీ రెండు కోట్ల(2.15) నెట్‌ని సాధించింది. ఇక రెండో రోజు ఈ మూవీ కలెక్షన్లు కాస్త పెరగడం విశేషం. శనివారం ఈ మూవీకి రూ.2.66కోట్లు వసూళ్లు వచ్చాయి. దీంతో రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.4.80కోట్ల(ఇండియా నెట్) కలెక్షన్లు రాబట్టింది. ఇక మూడో రోజు కూడా బాగానే ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు అడ్వాన్స్ బికింగ్స్ ద్వారా కోటి రూపాయల వరకు నెట్ వచ్చినట్టు సమాచారం. మరో రెండు షోస్ ఉండటంతో ఈ కలెక్షన్లు పెరుగుతాయి. ఆదివారం కూడా ఈ మూవీ రెండు నుంచి మూడు కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది.
`కిష్కింధపురి` మూవీ థియేట్రికల్ బిజినెస్
ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి కోటికిపైగానే కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఐదు కోట్ల నెట్ దాటింది. ఈ లెక్కన సుమారు పది కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు చేసినట్టు సమాచారం. సోమవారం కూడా కలెక్షన్లు బాగానే ఉంటే, సినిమా సక్సెస్ దిశగా వెళ్తుందని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రానికి సుమారు రూ.20-25కోట్ల బడ్జెట్ అయ్యింది. థియేట్రికల్ బిజినెస్ నైజాంలో మూడు కోట్లు, సీడెడ్‌లో కోటిన్నర, ఆంధ్రాలో మూడు కోట్ల వ్యాపారం జరిగింది. కర్నాటక, నార్త్, ఓవర్సీస్ కలిపి రెండు కోట్లు, మొత్తంగా రూ.9.50కోట్ల వరకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సినిమా సేఫ్ కావాలంటే, బయ్యర్లు సేఫ్ కావాలంటే, పది కోట్ల షేర్ సాధించాలి. అంటే ఇరవై కోట్ల గ్రాస్ రావాలి. మరి సాధ్యమేనా అనేది చూడాలి.
`కిష్కింధపురి`పై మిరాయ్ దెబ్బ
ఇదిలా ఉంటే బాక్సాఫీసు వద్ద `మిరాయ్` మూవీ రచ్చ చేస్తోంది. దానికి మంచి రెస్పాన్స్ ఉంది. ఆడియెన్స్ ఆ మూవీనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం `కిష్కింధపురి`పై పడుతుందని చెప్పొచ్చు. అయినా దాన్ని దాటుకుని నిలబడటం విశేషం.

