- Home
- Entertainment
- Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రం డిసెంబర్ 19న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అవతార్ 3పై ఎర్లీ రివ్యూస్ మొదలయ్యాయి.
అభిమాన ప్రాంఛైజీగా మారిన అవతార్
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది. అవతార్ ప్రాంచైజీపై అభిమానులలో ఇప్పటికే కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. అవతార్ మొదటి భాగం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లు వసూలు చేసి బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టించింది.
అవతార్ 3 ఫస్ట్ రివ్యూ
దీనితో ఈ ప్రాంఛైజీలో మూడవ భాగం అయిన అవతార్ ఫైర్ అండ్ యాష్ కోసం వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రిస్టమస్ సెలవుల్లో అవతార్ 3ని ఎంజాయ్ చేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. జేమ్స్ కామెరూన్ విజువల్ మాయాజాలం ఏ స్థాయిలో ఉంటుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కథ ఎలా ఉండబోతోంది
కానీ అవతార్ 3 గురించి వస్తున్న ఎర్లీ రివ్యూస్ అంత ఆశాజనకంగా లేవు. అవతార్ 2 కథ హీరో జేక్ సల్లీ చెబుతున్నట్లుగా నేరేషన్ ఉంటుంది. కానీ అవతార్ 3లో అతగాడి కొడుకు లోక్ కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ చిత్రంలో మాంగ్ క్వాన్ అనే అగ్నిజాతి తెగ ఎంట్రీ ఇవ్వనుంది. వీరితో హీరో ఎలా పోరాడబోతున్నాడు అనేది ఆసక్తికరం.
నెగిటివ్ రివ్యూలు మొదలు
ఆకాశంలో భారీ నౌకల్లో తిరిగే జాతి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఈ కొత్త ముప్పు నుంచి తన వారిని రక్షించడానికి హీరో ఏం చేశాడు అనేది కథలో ఆసక్తికరం కానుంది. అయితే ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు అవతార్ 3 చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం లేదు. ప్రముఖ రాటెన్ టొమాటోస్ సంస్థ కేవలం అవతార్ 3కి 69 శాతం రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇది అవతార్ 1, అవతార్ 2 కంటే తక్కువ.
డల్ అండ్ నాన్సెన్స్
ది గార్డియన్ సంస్థ అయితే అవతార్ 3ని డల్ గా సాగే చిత్రం, నాన్సెన్స్ అని అభివర్ణించింది. కేవలం 2 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రానికి ప్రధాన మైనస్ రన్ టైం అని చెబుతున్నారు. ఏకంగా ఈ చిత్రం 3 గంటల 17 నిమిషాల రన్ టైంతో ఉంది. అంతసేపు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అంటే కత్తిమీద సామే. అవతార్ 2 కి కూడా ముందుగా నెగిటివ్ రివ్యూస్ మొదలయ్యాయి. ఈ చిత్రం కనీసం 1 బిలియన్ డాలర్లు కూడా వసూలు చేయడం కష్టం అని అన్నారు. కానీ ఏకంగా 2 బిలియన్ డాలర్లతో కాసుల వర్షం కురిపించింది. అవతార్ 2 కూడా 3 గంటల 12 నిమిషాల రన్ టైంతో ఉంటుంది.
విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్
పండోర గ్రహం విజువల్స్, యాక్షన్ సీన్స్ లో వచ్చే విజువల్ నిజంగానే వండర్ అనిపించేలా ఉంటాయి. అయితే కథలో ఎమోషనల్ డెప్త్ లేదని అంటున్నారు. థ్రిల్లింగ్ అనిపించేలా ఎలిమెంట్స్, కథాబలం లోపించింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొంతమంది కేవలం విజువల్స్ మాత్రమే హై లైట్ చేస్తూ కథ ఏమీ లేకుండా జేమ్స్ కామెరూన్ చీటింగ్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

