Samantha: నా జీవితానికి గట్టి ఎదురుదెబ్బ, విభేదాలు సహజం.. అసభ్య కామెంట్స్ పై సమంత
నాగ చైతన్యతో బ్రేకప్ చేదు అనుభవాలు ఇంకా Samanthaని వెంటాడుతూనే ఉన్నాయి. విడాకుల సమయంలో కొంత కాలం మౌనం వహించిన సమంత ఇప్పుడు మీడియా ముందు తన అభిప్రాయాలు ధైర్యంగా చెబుతోంది.

నాగ చైతన్యతో బ్రేకప్ చేదు అనుభవాలు ఇంకా సమంతని వెంటాడుతూనే ఉన్నాయి. విడాకుల సమయంలో కొంత కాలం మౌనం వహించిన సమంత ఇప్పుడు మీడియా ముందు తన అభిప్రాయాలు ధైర్యంగా చెబుతోంది. చైతు, సమంత ఇద్దరూ అక్టోబర్ లో విడాకులు ప్రకటించారు. వీరిద్దరి జీవితాల్లో ఇది గట్టి ఎదురు దెబ్బ. ఇండస్ట్రీకి , అభిమానులకు ఊహించని షాక్. విడాకుల తర్వాత చాలా రోజుల పాటు సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగింది.
Samantha బిహేవియర్ వల్లే విడాకులు జరిగాయని అనేక అంశాలతో ఆమెని నిందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఆమె గురించి కొన్ని అసత్య ప్రచారాలు ప్రసారం చేశారు. సమంత యూట్యూబ్ ఛానల్స్ ని మాత్రం కోర్టు ద్వారా అడ్డుకోగలిగింది. కానీ సోషల్ మీడియాని అడ్డుకోవడం సాధ్యం కాదు. ఇటీవల సమంత బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వ్యక్తిగతంగా అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నట్లు పేర్కొంది. విడాకుల గురించి ప్రస్తావించింది.
ఈ ఏడాది నా వ్యక్తిగత జీవితానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో ఏళ్ళు కష్టపడి నా కెరీర్ ని నిర్మించుకున్నా. నా ఆశలు శిథిలమైపోయాయి. కానీ నా డెస్టినీ ఎలా ఉంటే అలా ఎదుర్కొనేందుకు సిద్ధం. కొందరు నాపై అసభ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. వారికి ఒక్కటే చెప్పదలుచుకున్నా. కుటుంబ సభ్యులు.. స్నేహితుల మధ్య కూడా బేదాభిప్రాయాలు ఉంటాయి. నేను అందరికి నచ్చాలని లేదు. నా అభిప్రాయాలు నచ్చకపోతే దానిపై స్పందించేందుకు ఒక విధానం ఉంటుంది.
సోషల్ మీడియా స్టార్స్ కి క్రేజ్ తెచ్చిపెడుతుంది. అందులో సందేహం లేదు. కానీ కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. మీ అభిప్రాయాలు చెప్పాలనుకుంటే చెప్పండి.. కానీ అసభ్యంగా మాత్రం కాదు అని సమంత వాపోయింది.
చైతూతో విడాకుల తర్వాత సమంత ఫుల్ బిజీగా మారిపోయింది. వరుస చిత్రాలకు సమంత ఒకే చెబుతోంది. పాన్ ఇండియా చిత్రాలు కూడా చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంతకు ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ లో సామ్ నెగిటివ్ రోల్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. అలాగే ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రంతో పాటు.. యశోద అనే పాన్ ఇండియా మూవీలో కూడా సమంత నటిస్తోంది. Also Read: బ్లాక్ గౌన్ లో తెలుగమ్మాయి సోయగాల విందు.. ఈషా రెబ్బా అందాలకు చూపు తిప్పుకోలేరు