- Home
- Entertainment
- 15 ఏళ్లుగా రిస్క్ చేస్తూనే ఉన్నా.. హీరోయిన్ గా క్రేజ్ ఉన్న టైంలో ఇలాంటి నిర్ణయంపై సమంత..
15 ఏళ్లుగా రిస్క్ చేస్తూనే ఉన్నా.. హీరోయిన్ గా క్రేజ్ ఉన్న టైంలో ఇలాంటి నిర్ణయంపై సమంత..
సమంత ఇటీవల నిర్మాత అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్గా నటించి చాలా కాలం అవుతుంది. విజయ్ దేవరకొండ ఖుషి చిత్రం తర్వాత సమంత మళ్ళీ హీరోయిన్ గా నటించలేదు.

సమంత ఇటీవల నిర్మాత అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్గా నటించి చాలా కాలం అవుతుంది. విజయ్ దేవరకొండ ఖుషి చిత్రం తర్వాత సమంత మళ్ళీ హీరోయిన్ గా నటించలేదు. మధ్యలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ మాత్రం చేసింది. ఇప్పుడు సడన్ గా సమంత హీరోయిన్ గా మారడంతో ఫాన్స్ లో అనేక సందేహాలు మొదలయ్యాయి.
హీరోయిన్ గా క్రేజ్ ఉన్నప్పుడు సినిమాలో నటించకుండా నిర్మాతగా ఎందుకు మారినట్లు అని చర్చించుకుంటున్నారు. ఒకరకంగా తన క్రేజ్ ని రిస్క్ లో పెట్టడమే అని అంటున్నారు. దీనిపై సమంత తాజాగా ఇంటర్వ్యూలో స్పందించింది. నా 15 ఏళ్ల కెరీర్ ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటా. కొన్ని భయాలు కారణంగా చేయాలనుకున్న పనులను పక్కన పెట్టేస్తాం.
నా 15 ఏళ్ల కెరీర్ అనుభవంలో రిస్క్ చేయకుంటే మనం కోరుకున్న అర్థవంతమైన మార్పుని సాధించలేం అని తెలిసింది. నా కెరీర్లో అప్పుడప్పుడు రిస్క్ తీసుకుంటూనే ఉన్నా. కొన్నిసార్లు అవి ఫలించాయి. ఇప్పుడు నిర్మాతగా ప్రయత్నిస్తున్నా అని సమంత తెలిపింది.
సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించి అందులో శుభం అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం మే 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. తన నిర్మాణ సంస్థలో అద్భుతమైన టీం ఉందని సమంత పేర్కొంది. సమంత నిర్మాణంలో వస్తున్న శుభం చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. సమంత 2010లో ఏ మాయ చేసావే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత సమంత అనేక సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా మారారు. దూకుడు, బృందావనం, మనం, అత్తారింటికి దారేది, ఓ బేబీ, రంగస్థలం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇలా సమంత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.