- Home
- Entertainment
- 'సింగిల్' ట్రైలర్ లో వివాదాస్పద డైలాగులు, తీవ్ర ఆగ్రహంతో మంచు విష్ణు.. చర్యలు తీసుకుంటారా ?
'సింగిల్' ట్రైలర్ లో వివాదాస్పద డైలాగులు, తీవ్ర ఆగ్రహంతో మంచు విష్ణు.. చర్యలు తీసుకుంటారా ?
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ #సింగిల్. ఈ చిత్రంలో శ్రీవిష్ణు కి జోడిగా కేతికా శర్మ, ఇవన నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

Manchu Vishnu
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ #సింగిల్. ఈ చిత్రంలో శ్రీవిష్ణు కి జోడిగా కేతికా శర్మ, ఇవన నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం వాయిదా పడడంతో శ్రీ విష్ణు తన చిత్రాన్ని అదే రోజున రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గా సింగిల్ ట్రైలర్ ని విడుదల చేశారు.
యువతని ఆకట్టుకునే వినోదం, కామెడీ అంశాలతో ట్రైలర్ బాగా వైరల్ అయింది. సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్ ఆకట్టుకుంది. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నాడు. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవన మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంశంతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ఇద్దరి కామెడీ పంచ్ లు బాగా పేలాయి.
Single Movie Trailer
అయితే కొన్ని డైలాగులు వివాదానికి కారణం అవుతున్నాయి. సింగిల్ ట్రైలర్లో కొన్ని డైలాగులు మంచు విష్ణుని, మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కన్నప్ప చిత్రంలో మంచు విష్ణు శివయ్య అని గట్టిగా అరిచే సన్నివేశం ఉంది. కన్నప్ప టీజర్ లో ఆ సీన్ ని చూపించారు. దానిని స్పూఫ్ చేసే విధంగా శ్రీ విష్ణు సింగిల్ ట్రైలర్ లో డైలాగ్ పెట్టారు.
sree vishnu
ట్రైలర్ చివర్లో 'మంచు కురిసిపోతారు' అనే డైలాగ్ కూడా ఉంది. అది కూడా మంచి ఫ్యామిలీని ఉద్దేశించిందే అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారం మంచు విష్ణు వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. సింగిల్ ట్రైలర్ పట్ల, శ్రీ విష్ణు పట్ల మంచు విష్ణు ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సింగిల్ చిత్రంపై మంచు విష్ణు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా ఉన్నారు.
తనని తన ఫ్యామిలీని కించపరిచేలా ఉన్న సింగిల్ ట్రైలర్ పై ఫిలిం ఛాంబర్ లో మంచు విష్ణు కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే మంచు విష్ణు ఈ వివాదం పై స్పందిస్తారా లేక ఇంతటితో వదిలేస్తారా అనేది వేచి చూడాలి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.