MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Samantha: అప్పుడు క్యూట్ గా ఇప్పుడు హాట్ గా... సమంత ఎంత మారిపోయింది!

Samantha: అప్పుడు క్యూట్ గా ఇప్పుడు హాట్ గా... సమంత ఎంత మారిపోయింది!

ఆత్మ విశ్వాసం, స్వతంత్ర భావాలు కలిగిన హీరోయిన్ సమంత జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తీరు అద్భుతం. ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో సమంత ఈ స్థాయికి చేరారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 03 2021, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీనేజ్ నుండే ఒకరిపై ఆధారపడకూడదని సమంత అనుకునేది. కాలేజీలో చదివే రోజుల్లో తన పాకెట్ మనీ తానే సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకుంది. దానికి మార్గంగా మోడలింగ్ ఎంచుకుంది. కొన్ని యాడ్స్ లో సమంత నటించారు. ఆ డబ్బులతో తనకు కావలసిన బట్టలు, వస్తవులు కొనుక్కునేది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఏమాయ చేశావే మూవీ కోసం దర్శకుడు గౌతమ్ మీనన్ ఓ ఫ్రెష్ ఫేస్ వెతుకుతున్నాడని తెలుసుకొని సమంత ఆడిషన్స్ కి హాజరయ్యారు. వందల మంది అమ్మాయిలు పాల్గొన్న ఆ ఆడిషన్స్ లో సమంత తనకు ఛాన్స్ వస్తుందని అనుకోలేదట. సమంత క్యూట్ నెస్ చూసిన గౌతమ్ మీనన్ ఆమెను ఎంపిక చేశారు. 
 

38

చదువులో కూడా చురుకైన సమంత మొదటి చిత్రంతోనే తన మార్క్ క్రియేట్ చేసింది. సమంత నటన, గ్లామర్ యూత్ కి తెగ నచ్చేసింది. దానికి తోడు మూవీ సూపర్ హిట్ అయ్యింది. మొదటి మూవీతోనే విజయం అందుకున్న సమంతకు అవకాశాలు వరస కట్టాయి. 


 

48

నెక్స్ట్ చిత్రంతోనే ఎన్టీఆర్ (NTR) తో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. బృందావనం మూవీలో కాజల్ తో పాటు మరో హీరోయిన్ గా సమంత నటించారు. ఆ మూవీ సూపర్ హిట్. అనంతరం మరో స్టార్ హీరో మహేష్ పక్కన మెయిన్ హీరోగా ఛాన్స్. సమంత హీరోయిన్ గా తెరకెక్కిన దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీ విజయం తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

58

ఆ వెంటనే రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మరో సూపర్ హిట్. సమంత ఆరంభం అంత అద్భుతంగా సాగింది. సమంత ఉంటే మూవీ హిట్ అన్నంతగా లక్కీ హీరోయిన్ అనే బ్రాండ్ రాబట్టారు. సమంత నటించిన చాలా చిత్రాలు విజయం సాధించాయి. 
 

68


టాలీవుడ్ లో సమంత స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యారు. అత్తారింటికి దారేది, రంగస్థలం ఆమె ఖాతాలో ఉన్న మరికొన్ని బ్లాక్ బస్టర్స్. కమర్షియల్ హీరోయిన్ గా పీక్స్ చూసిన సమంత, మెల్లగా లేడీ ఓరియెంట్ చిత్రాల వైపు మళ్లారు. యూ టర్న్, ఓ బేబీ చిత్రాలతో తన మార్క్ చూపించారు. ఓ బేబీ సూపర్ హిట్ కావడంతో పాటు రికార్డ్స్ నమోదు చేసింది. 
 

78


ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా శాకుంతలం మూవీ తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శాకుంతలం పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతున్న విషయం తెల్సిందే. 
ఇక కెరీర్ నే కాకుండా తన రూపును కూడా మార్చుకుంది సమంత. 
 

88


సమంత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి ఆమె వయసు 23. కాలం గడిచే కొద్దీ సమంత ముఖం చాలా మారిపోయింది. గత ఫొటోలతో ఆమెను ఇప్పుడు పోల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సమంత తన ముఖానికి సర్జరీ చేయించుకున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని, సహజంగానే ఆమె ముఖంలో ఆ మార్పు వచ్చిందని సమాచారం.  

Also read ఏ మాత్రం తగ్గని సమంత దూకుడు.. అందులోనూ రికార్డు

Also read Samantha: బోల్డ్ అండ్ స్టైలిష్... లేటెస్ట్ ఫోటో షూట్ లో సమంత గ్లామర్ జస్ట్ మైండ్ బ్లోయింగ్!
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved