Asianet News TeluguAsianet News Telugu

ఏ మాత్రం తగ్గని సమంత దూకుడు.. అందులోనూ రికార్డు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గ‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్‌ను దాటింది. ఈ విషయాన్ని ఓ ఫొటో షేర్‌ చేస్తూ.. తన ఆనందాన్ని పంచుకుంది. తనను అభిమానిస్తున్న వారందరికీ థ‍్యాంక్స్‌ అంటూ పోస్ట్‌ చేసింది సామ్‌. 
 

Samantha Hits 20Million Followers On Instagram
Author
Hyderabad, First Published Dec 3, 2021, 12:25 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే సూప‌ర్ డూపర్ హిట్ సాధించి.. త‌న కంటూ ఓ స్పెష‌ల్ క్రేజ్ సంపాదించుకుంది. వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్ లో  టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్ర‌మంలోనే అక్కినేని న‌ట వార‌సుడు నాగ చైత‌న్య‌తో ప్రేమ‌, పెళ్లి చేసుకుంది.దీంతో ఆమె క్రేజ్ మ‌రింత పెరిగింది. ఆ త‌రువాత వరుస ఆఫర్స్‌తో దూకుడు పెంచింది. తెలుగు చిత్రాల‌తో పాటు  తమిళ్ చిత్రాల‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ వుమెన్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. 

అయితే ఇటీవల.. టాలీవుడ్ క్రేజీ , మోస్ట్ బ్యూటీ పుల్ కపుల్స్ పేరు పొందిన   అక్కినేని నాగచైతన్య – సమంత ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నామ‌ని సంచ‌లన ప్ర‌కట‌న చేసింది. దీంతో అటు అక్కినేనీ అభిమానుల‌తో పాటు, ఇటు టాలీవుడ్ కూడా కంగు తిన్న‌ది. వారి మ‌ధ్య ఏం జ‌రిగిందో కూడా స‌రైన క్లారిటీ లేదు. 

read also: https://telugu.asianetnews.com/gallery/entertainment/tollywood-star-actress-samanth-ruth-prabhu-number-1-after-divorced-with-akkineni-naga-chaitanya-r0yuvk#image5

ఇక నాగచైతన్యతో విడిపోయకా..  తన అభిమానులు కూడా బాగా విమర్శలు చేశారు. ప‌లు పుకార్లు షికార్లు చేశాయి. ఆ క్ర‌మంలో స‌మంతను టార్గెట్ చేస్తూ నెట్టిజ‌న్లు కామెంట్స్ చేశారు. వీటిపై స‌మంత త‌న‌దైనా స్టైల్లో స‌మాధాన‌మిచ్చింది. ఈక్ర‌మంలో ప‌లువురు ఆమెకు స‌పోర్టుగా నిలుచారు. 

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ట్రెండ్ ను ఫాలో అవుతుండే స‌మంత ఓ అరుదైన రికార్డు ను సెట్ చేసింది. చైతూతో విడాకులు తీసుకున్న త‌రువాత సామ్ త‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదని నిరూపించింది. ఇన్ స్టా గ్రామ్ లో 20 మిలియన్స్ ఫాలోవర్స్ మార్క్ ను టచ్ చేసింది. ఈ విషయాన్ని ఓ ఫొటో షేర్‌ చేస్తూ.. తన ఆనందాన్ని పంచుకుంది. తనను అభిమానిస్తున్న వారందరికీ థ‍్యాంక్స్‌ అంటూ పోస్ట్‌ చేసింది సామ్‌. 

స‌మంత కంటే.. ముందుగా ఇన్ స్టా గ్రామ్ లో  రష్మిక మంధనా (2.4 కోట్లు), కాజల్‌ అగర్వాల్‌ (2.2 కోట్లు)తో ముందు వరుసలో ఉన్నారు. అయితే త‍్వరలో సామ్‌ వీరిని కూడా దాటేసి ముందుకెళ్తుందేమో చూడాలి.

Read Also: https://telugu.asianetnews.com/gallery/entertainment/samantha-goes-bold-her-latest-photo-shoot-shakes-internet-r3faij

ఇదిలా ఉంటే.. ఇప్ప‌డిప్పుడే స‌మంత విడాకుల బాధ నుంచి బ‌య‌ట‌ప‌డుతుంది. అక్కినేని కోడ‌లు అనే ట్యాగ్ లైన్ ను  తొల‌గించుకుని పంజ‌రం నుండి బ‌య‌ట ప‌డ్డ ప‌క్షిలా స‌మంత స్వేచ్ఛ‌గా విహారిస్తోంది. ఈ మ‌ధ్య వ‌రుస‌గా సినిమాలు, వెబ్ సిరీస్లు, స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ త‌న దూకుడు పెంచింది. 

సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న‌ “పుష్ప: ది రైజ్”లో స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘పుష్ప’ సెట్స్‌లో చేరిన సామ్, బన్నీపై మేకర్స్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ కోసం భారీ మొత్తంలో పారిదోష‌కం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక సెన్సెష‌న‌ల్ డైరెక్ట‌ర్ గుణశేఖర్ దర్శకత్వం లో  పౌరాణిక డ్రామాగా రూపోందుతున్న “శాకుంతలం” చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం కాళిదాసు రచించిన ‘అభిజ్ఞానశాకుంతలం’ అనే నాటకం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో స‌మంత ..శకుంతల పాత్రలో నటిస్తుండగా, దుష్యంతగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. 

ఇటు తెలుగులోనే కాకుండా త‌మిళ్ చిత్రాల్లో కూడా న‌టిస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం షూటింగ్ ను కూడా ముగించింది. మ‌రో వైపు హాలీవుడ్ లో కూడా ఏంట్రీ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios