MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • గేమ్ ఛేంజర్ తర్వాత దిల్ రాజు మరో పాన్ ఇండియా మూవీ..సల్మాన్ ఖాన్ తో ఫిక్స్, డైరెక్టర్ అతడే

గేమ్ ఛేంజర్ తర్వాత దిల్ రాజు మరో పాన్ ఇండియా మూవీ..సల్మాన్ ఖాన్ తో ఫిక్స్, డైరెక్టర్ అతడే

సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నట్లు ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలో ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 30 2026, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Salman Khan
Image Credit : Asianet News

Salman Khan

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్, టాలీవుడ్ కలయికలో మరో కీలక చిత్రం రూపుదిద్దుకోనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియాలో
Image Credit : instagram

సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియాలో

ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటిస్తూ అభిమానులకు తెలియజేశారు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవిని తిట్టినవాళ్ళెవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు
Related image2
నాగార్జున కోసం ఎప్పుడూ ఆ పని చేయలేదు, చిరంజీవి ఎలా ఎదిగాడో తెలుసా.. ఓపెన్ గా చెప్పేసిన ఏఎన్నార్
35
ప్రాజెక్ట్‌పై ఆసక్తి
Image Credit : Dil Raju\Instagram

ప్రాజెక్ట్‌పై ఆసక్తి

సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టులో, “Dil, Dimag, Jigar se from this April with @directorvamshi and #DilRaju” అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు వంశీ పైడిపల్లితో కలిసి తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ప్రకటనతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది.

Dil, Dimag, Jigar se from this April with @directorvamshi and #DilRaju#Shirish@SVC_official@kuldeeprathor9#RafiKazipic.twitter.com/RuK0KWq2HU

— Salman Khan (@BeingSalmanKhan) March 30, 2026

45
విజయవంతమైన సినిమాలు
Image Credit : instagram

విజయవంతమైన సినిమాలు

వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘మున్నా’, ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’, రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన ‘ఎవడు’..నాగార్జున, కార్తి నటించిన ‘ఊపిరి’, మహేష్ బాబుతో చేసిన ‘మహర్షి’,’ వంటి చిత్రాలు ఉన్నాయి.

55
బలమైన కంబ్యాక్ ఇవ్వాలని..
Image Credit : instagram

బలమైన కంబ్యాక్ ఇవ్వాలని..

ఇప్పుడు ఆయన సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడం ద్వారా మరో కీలక క్రాస్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో మళ్లీ బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ, నటీనటుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ కలయికపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని తిట్టినవాళ్ళెవరూ ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు.. వివి వినాయక్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
నాగార్జున కోసం ఎప్పుడూ ఆ పని చేయలేదు, చిరంజీవి ఎలా ఎదిగాడో తెలుసా.. ఓపెన్ గా చెప్పేసిన ఏఎన్నార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved