- Home
- Entertainment
- Guppedantha Manasu: దేవయానికి వార్నింగ్ ఇచ్చిన జగతి.. నా కొడుకు గురించి ఆలోచించడం మానేయాలంటూ?
Guppedantha Manasu: దేవయానికి వార్నింగ్ ఇచ్చిన జగతి.. నా కొడుకు గురించి ఆలోచించడం మానేయాలంటూ?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే గౌతమ్ (Goutham) సాక్షి గురించి అడుగుతూ ఉండగా రిషి పళ్ళు విరగొడతాను అన్నట్లు గా మాట్లాడతాడు. ఇక రిషి దగ్గరకు దేవయాని వచ్చి దేవుడు నీకు సాక్షికి ముడి పెట్టాడేమో అని అంటుంది. దాంతో రిషి (Rishi) ఒక విషయంలో నేను ఒకటి కాదు అనుకున్నాక దాని గురించి నేను ఇక మళ్ళీ ఆలోచించను అని అంటాడు.
ఈ లోపు అక్కడకు సాక్షి (Sakshi) వచ్చి లాంగ్ డ్రైవ్ కు వెళ్దామా? అని రిషి ను అడుగుతుంది. దాంతో రిషి పరాయి వాళ్ళ తో కలిసి ప్రయాణం చేసే అలవాటు నాకు లేదు అని అంటాడు. ఆ తర్వాత రిషి కారును దేవయాని, సాక్షి లు ఫాలో చేస్తూ ఉంటారు. ఇక రిషి (Rishi) వసు ఇంటికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటాడు.
ఇక వారిద్దరిని.. దేవయాని (Devayani) సాక్షి తో ఫోటో తీయమని చెబుతుంది. ఆ తర్వాత రిషి వసు ను రెస్టారెంట్ లో డ్రాప్ చేస్తాడు. మరోవైపు దేవయాని జగతి దగ్గరికి వెళ్లి నువ్వు ఏమనుకుంటున్నావ్? ఈ ఇంట్లోకి వచ్చి గెలిచి పోయాను అని అనుకుంటున్నావా అని అంటుంది. ఇక జగతి (Jagathi) గెలుపు ఓటములు గురించి ఆలోచించలేదు అంటుంది.
అదే క్రమంలో జగతి (Jagathi) సాక్షి కి బలాన్ని ఇచ్చారు. ఇక ఐడియాలు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా రిషి (Rishi) ను కూడా ఫాలో చేస్తున్నారు అని అంటుంది. ఆ తర్వాత దేవయాని జగతి ను భయపెడుతుంది. ఇక జగతి భయపడడం మానేసి చాలా కాలం అవుతుంది అని చెబుతుంది.
ఆ తర్వాత వసు (Vasu) రిషి ను తన ఇంటికి తీసుకుని వెళ్లి తాను స్వయంగా వండిన వంటను రిషి (Rishi) కి వడ్డిస్తుంది. అంతేకాకుండా మనకి ఇష్టమైన వాళ్ళు మనం చేసిన వంట తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది అని వసు అంటుంది. ఆ మాటతో రిషి వసు మనసులో ఏముంది అని ఆలోచిస్తాడు.
ఇక రిషి (Rishi) వసు ఇంట్లో భోజనం చేసి వెళతాడు. ఆ తర్వాత వసు దగ్గరకు ఇంటి పక్కవాళ్ళు వచ్చి ఆయనకి నీకు సంబంధం ఏమిటి? అతను మీ ఇంట్లో ఎందుకు అన్నం తిన్నాడు ఏంటి అని అడుగుతారు. ఆ తర్వాత రిషి వసు కు ఫోన్ చేస్తాడు. దాంతో వసు (Vasu) నీకేం పని లేదా ఆస్తమాను నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావ్ అని విరుచుకు పడుతుంది.