MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్

Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్

Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి ఓ ఐటెం గర్ల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన ఆమెకి తాను హీరోయిన్ గా అవకాశం ఇచ్చానని అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 11 2026, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పోసాని కృష్ణ మురళి
Image Credit : our own

పోసాని కృష్ణ మురళి

పోసాని కృష్ణ మురళి రచయితగా, దర్శకుడిగా రాణించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా టాలీవుడ్ లో దుమ్ములేపారు. కమెడియన్ గా కూడా నటించారు. పోసాని కృష్ణ మురళి పవిత్రబంధం, ప్రేమించుకుందాం రా లాంటి అద్భుతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు. శ్రావణమాసం అనే చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆపరేషన్ దుర్యోధన మూవీ
Image Credit : Social Media

ఆపరేషన్ దుర్యోధన మూవీ

పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో పొలిటికల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కిన ఆపరేషన్ దుర్యోధన ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ నట విశ్వరూపం ప్రదర్శించారు. రాజకీయాల్లో, సమాజంలో ఉన్న లోపాలని పోసాని ఈ చిత్రంతో ఎత్తి చూపారు. ఈ మూవీలో ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన ముమైత్ ఖాన్ ఒక హీరోయిన్ గా నటించింది.

Related Articles

Related image1
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Related image2
Comedian Ali: ప్రివ్యూ షో చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. అలీతో పూరి జగన్నాధ్ చేసిన అద్భుతం ఏంటో తెలుసా ?
35
ఆమె హీరోయిన్ గా పనికిరాదు
Image Credit : our own

ఆమె హీరోయిన్ గా పనికిరాదు

పోసాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరోయిన్ గా ముమైత్ ఖాన్ ని అనుకున్నా. కానీ నా చుట్టూ ఉన్న వారంతా వద్దు ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అని అన్నారు. లేదు నాకు ఎందుకో ఆ అమ్మాయి బాగా నచ్చింది. ఒకరిని కొట్టాలి, తిట్టాలి, అందంగా కనిపించాలి అంటే ఆమె పర్ఫెక్ట్ అని అనిపిస్తోంది అని చెప్పా. ముమైత్ ఖాన్ ని పిలిపించా.

45
జోక్ చేస్తున్నా అనుకుంది
Image Credit : our own

జోక్ చేస్తున్నా అనుకుంది

మురళిగారు మీ కోసం ఏం చేయాలి అని అడిగింది. నువ్వు హీరోయిన్ గా నటించాలి అని చెప్పా. వెంటనే బిగ్గరాగా నవ్వేసింది. నేను జోక్ చేస్తున్నా అని అనుకుంది. లేదు నేను సీరియస్ గా చెబుతున్నా. నువ్వు ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నావ్ అని చెప్పా. లేదు సార్ నేను ఐటెం గర్ల్ ని. ఐటెం సాంగ్ ఇవ్వండి డ్యాన్స్ చేసి ముంబై వెళ్ళిపోతా. హీరోయిన్ గా చేయలేను అని చెప్పింది. నువ్వు ఆ ఫీలింగ్ మైండ్ లోనుంచి తీసేయ్.

55
ఏకంగా 9 సినిమాల్లో ఛాన్స్
Image Credit : Asianet News

ఏకంగా 9 సినిమాల్లో ఛాన్స్

హీరోయిన్ గా బాగా చేయగలవు అని చెప్పా. వెంటనే వాళ్ళ అమ్మని పిలిపించింది. ఆమె కూడా ఆశ్చర్యపోయింది. మా అమ్మాయిని హీరోయిన్ ని చేస్తున్నారా నిజమా అని అడిగింది. సరే ఒకసారి చేసి చూడు అని ముమైత్ ఖాన్ కి వాళ్ళ అమ్మ చెప్పింది. ఆపరేషన్ దుర్యోధన చిత్రం హిట్ అయ్యాక ముమైత్ ఖాన్ కి హీరోయిన్ గా 9 సినిమాల్లో అవకాశం వచ్చింది అని పోసాని తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image3
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Related Stories
Recommended image1
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Recommended image2
Comedian Ali: ప్రివ్యూ షో చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. అలీతో పూరి జగన్నాధ్ చేసిన అద్భుతం ఏంటో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved