MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌

Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌

Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకుపై పోక్సో కేసు ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతుంది. దీనిపై మంచు మనోజ్‌ స్పందించారు. బండి సంజయ్‌కి పెద్ద ఝలక్‌ ఇచ్చాడు మంచు హీరో. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 11 2026, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బండి సంజయ్‌ కొడుకుపై పోక్సో కేసు
Image Credit : stockPhoto

బండి సంజయ్‌ కొడుకుపై పోక్సో కేసు

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కొడుకు కేసు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఒక అమ్మాయిని బలవంతం చేసి అఘాయిత్యం చేశాడనే ఆరోపణలతో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇదిప్పుడిది పెద్ద రచ్చ అవుతుంది. దీనిపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు కూడా సీరియస్‌ గా స్పందిస్తున్నాయి. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని, అమ్మాయికి న్యాయం జరగాలని అంటున్నారు. దీనిపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్‌ స్పందించారు. ఇటీవల కాలంలో ఆయన ప్రతి సామాజిక అంశంపై స్పందిస్తున్నారు. తన వాయిస్‌ని వినిపిస్తున్నారు. తాజాగా బండి కేసుపై రియాక్ట్ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బండి భగీరథ్‌పై పోక్సో కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్
Image Credit : Youtube/ Shreyas Media

బండి భగీరథ్‌పై పోక్సో కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్

తాజాగా ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్‌ని గట్టిగా ఇరికించారు. అమ్మాయికి న్యాయం జరగాలని, ఈ విషయంలో అధికారం, పదవి, పలుకుబడి, హోదా న్యాయానికి అడ్డు రాకూడదని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు బండి భగీరథ్‌పై ఇటీవల నమోదైన పోక్సో కేసు నన్ను తీవ్రంగా కలచివేసింది. పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రతి మైనర్ బాలికకు కచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే #POCSO చట్టాన్ని తీసుకువచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను. అధికారం, పదవి, పలుకుబడి, హోదా ఎప్పుడూ న్యాయానికి అడ్డు రాకూడదు. రాజ్యాంగం, చట్టం దృష్టిలో ప్రతి బాలికకు సమానమైన న్యాయం దక్కాల్సిందే.

Related Articles

Related image1
Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్‌ పోస్ట్
Related image2
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
33
న్యాయం గెలవాలి - మంచు మనోజ్‌
Image Credit : our own

న్యాయం గెలవాలి - మంచు మనోజ్‌

మైనర్లకు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించాలి, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరం. విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా, పక్షపాత చర్యలు తీసుకున్నా.. అది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఇది రాజకీయాలకు, వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. కేవలం నిజం బయటకు రావాలి, న్యాయం గెలవాలి. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలకు తావులేకుండా ఈ కేసు దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలన్నీ అత్యంత వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు అందరికీ స్పష్టంగా కనిపించాలి. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితం కావాలి. #Justice` అని తెలిపారు మంచు మనోజ్‌. ఇప్పుడిది పెద్ద రచ్చ చేస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
వినోదం
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Related Stories
Recommended image1
Ashu Reddy: హీరో మరణంతో అల్లాడిపోయిన ఆషు రెడ్డి.. హృదయం కదిలించేలా ఎమోషనల్‌ పోస్ట్
Recommended image2
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved