- Home
- Entertainment
- Saiyaara Day 5 Box Office Collections: `సైయారా` 5వ రోజు కలెక్షన్స్.. అమీర్, అక్షయ్ లకు పెద్ద ఝలక్
Saiyaara Day 5 Box Office Collections: `సైయారా` 5వ రోజు కలెక్షన్స్.. అమీర్, అక్షయ్ లకు పెద్ద ఝలక్
'సైయారా' వరుసగా 5వ రోజు కూడా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసింది. గత 4 రోజులుగా ఈ సినిమా తన మొదటి రోజు వసూళ్లను మించిపోవడం విశేషం.

'సైయారా' ఐదవ రోజు కలెక్షన్లు
బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ మూవీ `సైయారా` ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అయాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ మూవీ గత శుక్రవారం(జులై 18న) విడుదలైంది. ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.
అయితే సినిమా కలెక్షన్ల పరంగా సునీమీ సృష్టిస్తుండటంతో ఈ చిత్రం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలనాలు క్రియేట్ చేయడం విశేషం. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా యువతని ఇది ఉర్రూతలూగిస్తుంది.
ట్రేడ్ ట్రాకర్ వెబ్‌సైట్ sacnilk.com ప్రకారం 'సైయారా' ఐదవ రోజు వసూళ్లు భారీగా ఉన్నాయి. ట్రేడ్ పండితులకు షాకిస్తున్నాయి. దీని ప్రకారం మంగళవారం ఈ మూవీ సుమారు రూ.25 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
'సైయారా' 5 రోజుల్లో మొత్తం ఎంత వసూలు చేసింది?
ఈ సైట్ నివేదికల ప్రకారం ఈ మూవీ ఐదు రోజుల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా వంద కోట్లు దాటింది. నాలో రోజే ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పుడు రెండు వందల కోట్ల దిశగా వెళ్తుంది.
sacnilk.com నివేదిక ప్రకారం, 5 రోజుల్లో 'సైయారా' భారతదేశంలో మొత్తం వసూళ్లు రూ.132 కోట్ల రూపాయలకు చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా సైయారా 170 కోట్లకు పైగా వసూలు చేసింది
'సైయారా' మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద 151 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. భారతదేశంలో ఐదవ రోజు వసూళ్లను కలుపుకున్న ప్రపంచవ్యాప్త గ్రాస్ రూ.172.78 కోట్లకు చేరుకుంది.
సైయారా రోజువారీ కలెక్షన్
`సైయారా` మూవీ భారతదేశంలో కలెక్షన్లు
మొదటి రోజు వసూళ్లు: 21.5 కోట్లు
రెండవ రోజు వసూళ్లు: 26 కోట్లు
మూడవ రోజు వసూళ్లు: 35.75 కోట్లు
నాల్గవ రోజు వసూళ్లు: 24 కోట్లు
ఐదవ రోజు వసూళ్లు: 25 కోట్లు
'సైయారా' దాని బడ్జెట్‌కు దాదాపు మూడు రెట్లు లాభం పొందింది
'సైయారా' బడ్జెట్ దాదాపు 45 కోట్ల రూపాయలు అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది బడ్జెట్‌కు దాదాపు మూడు రెట్లు ఎక్కువగా రాబట్టడటం విశేషం. ఇప్పుడు బయ్యర్లకి, నిర్మాతలకు లాభాల పంటపండిస్తుంది.
'సైయారా' ఆదిత్య చోప్రా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ పతాకం కింద నిర్మించబడింది. ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు.
ఈ మూవీ బాలీవుడ్‌లో సంచలనం సృష్టించడమే కాదు, బిగ్ స్టార్స్ కి షాక్ ఇస్తుంది. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి హీరోల సినిమాలు వంద కోట్లు దాటడానికి నానా కష్టాలు పడ్డారు. రెండు వందల కోట్లు దాటడం పెద్ద టాస్క్ అయ్యింది. కానీ ఈ చిత్రం సింపుల్‌గా తొలి వారమే రెండు వందల కోట్ల క్లబ్‌లో చేరబోతుండటం విశేషం.