- Home
- Entertainment
- `హరి హర వీరమల్లు`లో బాలకృష్ణ.. సెన్సేషనల్ వార్త వైరల్.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది
`హరి హర వీరమల్లు`లో బాలకృష్ణ.. సెన్సేషనల్ వార్త వైరల్.. ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది
`హరి హర వీరమల్లు` సినిమాకి సంబంధించి ఒక సంచలన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో బాలకృష్ణ కనిపించబోతున్నారనే వార్త దుమారం రేపుతోంది.

`హరి హర వీరమల్లు`లో ఊహించని సర్‌ప్రైజ్
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరి హర వీరమల్లు` మూవీ మరికొన్ని గంటల్లోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు వరుస ప్రమోషన్స్ లో పవన్ బిజీగా ఉన్నారు.
మూడు రోజులుగా ఆయన తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుసగా ఇంటర్వ్యూలిస్తున్నారు. ఈరోజు(బుధవారం) కూడా విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
సినిమాని తనవంతుగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకి బిజినెస్ కాలేదని, బయ్యర్లు రావడం లేదనే టాక్ ఉన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన పవన్ తన భుజాలపై వేసుకుని మూవీని ప్రమోట్ చేస్తున్నారు.
`హరి హర వీర మల్లు`లో బాలకృష్ణ గెస్ట్ రోల్
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ విషయం బయటకు వచ్చింది. ఇందులో ఒక సంచలన సర్ప్రైజ్ ఉండబోతుందట. ఒక బిగ్ స్టార్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
`హరి హర వీరమల్లు`లో పవన్ కళ్యాణ్‌తోపాటు బాలయ్య కనిపించబోతున్నారట. ఒక చిన్నపాటి గెస్ట్ రోల్‌లో ఆయన కనిపిస్తారనే వార్త వైరల్ అవుతోంది. యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన వీడియోలో చెప్పారు.
వీరమల్లు మనవడిగా బాలకృష్ణ
`హరి హర వీరమల్లు` సినిమాలో ఊహించని ట్విస్ట్ ఉంది. ఇందులో బాలకృష్ణ ఎంట్రీని ఎవరూ ఊహించరు. ఆయన శ్రీకృష్ణదేవరాయగా కనిపించోతున్నారు. వీరమల్లు మనవడి పాత్రలో బాలయ్య కనిపించబోతున్నారట. అది ఆడియెన్స్ కి థియేటర్లో బిగ్ సర్‌ప్రైజ్‌గా చెప్పొచ్చు.
ఈ విషయాన్ని ట్రైలర్‌లో ఎక్కడా చూపించలేదు, కానీ థియేటర్ ఆడియెన్స్ కి మాత్రం పెద్ద సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు` అంటూ నా అన్వేషణ అన్వేష్ తెలిపారు. మరి ఆయన చెప్పినదాంట్లో నిజం ఎంతా అనేది ఆశ్చర్యంగా మారింది.
శ్రీకృష్ణ దేవరాయగా బాలయ్య `హరి హర వీరమల్లు`లో ఎలా సాధ్యం?
`హరి హర వీరమల్లు` మూవీ కథ 17వ శతాబ్దంలో జరుగుతుంది. కానీ శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో ఉన్నారు. 1504లో ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. ఆయనకు వీరమల్లుకి సంబంధం ఏంటి? అనేది సస్పెన్స్ గా మారింది.
పైగా 15వ శతాబ్దంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు 17వ శతాబ్దంలో ఉన్న వీరమల్లుకి మనవుడిగా ఎలా వస్తారనేది సస్పెన్స్ గా మారింది. టెక్నీకల్‌గా ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
ఒకవేళ సినిమా కోసం, సినిమా లిబర్టీ తీసుకుని పెట్టారు అనుకుంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన లీకేజ్ ఇవ్వలేదు టీమ్. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. వారికే తెలియదంటున్నారు.. కాబట్టి ఇందులో నిజం లేదని అర్థమవుతోంది.
బాలయ్య ఉన్నారనే వార్త `హరి హర వీరమల్లు`కి ఊహించని బజ్
`హరి హర వీరమల్లు` సినిమా కోసం నిర్మాత ఏఎం రత్నం నానా కష్టాలు పడ్డారు. మూవీని పూర్తి చేయడానికి, బిజినెస్ పరంగానూ ఇబ్బందులు పడ్డారు. అదే బాలయ్య ఇందులో ఉన్నారని తెలిస్తే అది సినిమాకి బాగా హెల్ప్ అయ్యేది.
మార్కెట్ పరంగా, ప్రమోషన్స్ పరంగానూ, బిజినెస్ పరంగానూ చాలా కలిసి వచ్చేది. ఇందులో బాలయ్య ఉన్నాడనే వార్త సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య రోల్ ని సస్పెన్స్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూస్తే ఇందులో బాలకృష్ణ క్యామియోగా కనిపించారనేది నమ్మేలా లేదు. నిజం ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు ఊహించని బజ్‌కి కారణమవుతోంది.
పవన్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన `హరి హర వీరమల్లు` చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రం రేపు గురువారం(జులై24)న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.