- Home
- Entertainment
- ఆదిపురుష్ ఫ్లాప్ అని ఒప్పుకున్న సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ తెలివితక్కువ వాదనతో అంతా షాక్
ఆదిపురుష్ ఫ్లాప్ అని ఒప్పుకున్న సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ తెలివితక్కువ వాదనతో అంతా షాక్
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Prabhas
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రామాయణం పురాణ గాధను మోడరన్ స్టైల్ పేరుతో చిత్ర విచిత్రంగా తెరకెక్కించిన ఓం రౌత్ తీవ్ర విమర్శల పాలయ్యారు. దీంతో చాలామంది అభిమానులు అసలు చూస్తున్నది రామాయణమేనా అని ఆశ్చర్యపోయారు.
రామాయణ పురాణ గాధకి హాలీవుడ్ స్టైల్ గ్రాఫిక్స్ జోడించి ఓం రౌత్ చేసిన ప్రయోగం పూర్తిగా బెడిసి కొట్టింది. ముఖ్యంగా రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ని చూపించిన విధానం ఎవరికీ నచ్చలేదు. దీంతో ఆదిపురుష్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇటీవల వేవ్స్ సమ్మిట్ లో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఆదిపురుష్ చిత్రాన్ని తన కొడుకుతో కూర్చుని చూశానని తెలిపారు. మూవీ చూసిన అనంతరం అలాంటి పాత్రలో నటించినందుకు తన కొడుక్కి సారి చెప్పినట్లు సైఫ్ తెలిపారు. అంటే ఆదిపురుష్ చిత్రం ఫ్లాప్ అని సైఫ్ అలీ ఖాన్ పరోక్షంగా అంగీకరించారు.
కానీ దర్శకుడు ఓం రౌత్ మాత్రం తెలివి తక్కువ తనంతో వింత వాదన చేస్తున్నారు. ఇప్పటికీ ఓం రౌత్ తన తప్పుని ఒప్పుకొని, ఆదిపురుష్ మూవీ ఫ్లాప్ అని చెప్పడం లేదు. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగులో 120 కోట్లు పెట్టి కొన్నారని, అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసినట్లే కదా. దీని ప్రకారం ఆదిపురుష్ విజయం సాధించినట్లే కదా అంటూ వింత వాదన చేశారు. ఓం రౌత్ కామెంట్స్ తో అంతా షాక్ అవుతున్నారు.
ఒక దర్శకుడికి సినిమా బిజినెస్ పై అవగాహన ఇంతేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే విజయం సాధించినట్లు కాదు అంతకంటే ఎక్కువ వసూళ్లు వస్తేనే విజయం సాధించినట్లు. ఈ మాత్రం కూడా ఓం రౌత్ కి తెలియదా అంటూ నెటిజన్లు మరోసారి అతడిని ట్రోల్ చేస్తున్నారు.
దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆదిపురుష్ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. ప్రభాస్ ని ఓం రౌత్ శ్రీరాముడిగా చూపించిన విధానం ఎవరికీ నచ్చలేదు. కానీ కల్కి చిత్రంలో ప్రభాస్ కొన్ని నిమిషాల పాటు కర్ణుడి పాత్రలో కనిపించి గూస్ బంప్స్ తెప్పించాడు.