MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?

Mokshagna: మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్, బాలకృష్ణ వల్ల కూడా కాలేదా? నిజమెంత?

నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ బాలయ్య తనయుడి అడుగు మాత్రం ముందుకు పడటంలేదు. ఈ విషయంలో డైరెక్ట్ గా నారా లోకేష్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నిజమెంత?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 30 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చినబాబు కోసం నందమూరి అభిమానుల వెయిటింగ్..
Image Credit : facebook.com/moksha9999

చినబాబు కోసం నందమూరి అభిమానుల వెయిటింగ్..

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నందమూరి అభిమానులు కూడా ఆయన తొలి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు అని ప్రకటనలే తప్పించి.. ఇప్పటివరకు మోక్షజ్ఞ అధికారికంగా వెండితెరపైకి రాకపోవడంతో ఆయన ఎంట్రీపై వస్తున్న వార్తలు తరచూ చర్చనీయాంశంగా మారుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తమ్ముడికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు..
Image Credit : our own

తమ్ముడికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు..

గత ఏడాది దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ఈ ప్రకటన తరువాత ఆ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు కూడా పెరిగాయి. మోక్షజ్ఞ న్యూ లుక్స్ కూడా వైరల్ అయ్యాయి.. ఎన్టీఆర్ కూడా తన తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ముందుకు సాగలేదని వార్తలు వచ్చాయి. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ మరోసారి వాయిదా పడినట్లైంది.

36
బాలయ్య డైరెక్ట్ చేస్తారా?
Image Credit : facebook.com/moksha9999

బాలయ్య డైరెక్ట్ చేస్తారా?

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య కూడా పలు సందర్భాల్లో కొన్ని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో కూడా మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల మాటలు వినిపించాయి. బాలయ్య హిట్ సినిమా ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చేయాలని.. ఆ సినిమా ద్వారా మోక్షజ్ఞను హీరోగా ఆరంగేట్రం చేయించాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. అంతే కాదు బాలయ్య డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన సినీ ప్రవేశంపై కొత్త ప్రచారం మొదలైంది.

46
మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్..?
Image Credit : Asianet News

మోక్షజ్ఞ కోసం రంగంలోకి నారా లోకేష్..?

ఇక తాజా ప్రచారం ప్రకారం, మోక్షజ్ఞ సినీ ఎంట్రీ విషయమై నారా లోకేష్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. బావుమరిదిని సెటిల్ చేసే పని తన భూజాల మీద వేసుకున్నాడట లోకేష్. మోక్షజ్ఞ కోసం ఆయన స్వయంగా రెండు కథలను విన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఏదో ఒక ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో మాత్రం ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

56
ఇంకెప్పుడంటున్న నందమూరి అభిమానులు..
Image Credit : our own

ఇంకెప్పుడంటున్న నందమూరి అభిమానులు..

త్వరలోనే మోక్షజ్ఞ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ, గత అనుభవాల కారణంగా అభిమానుల్లో కొంత సందేహం కూడా కనిపిస్తోంది. ఆయన ఎంట్రీపై గతంలో వార్తలు వచ్చినా.. అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 31, ఇంత వరకూ హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వలేదు. ఎన్టీఆర్ 18 ఏళ్లకే హీరో అయ్యాడు.. ఇటు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం మరింత ఆలస్యం అవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

66
హీరోగా మోక్షజ్ఞ తేజ మెప్పించగలడా..?
Image Credit : social media

హీరోగా మోక్షజ్ఞ తేజ మెప్పించగలడా..?

గతంలో మోక్షజ్ఞ తేజ లుక్ కి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. నందమూరి అందగాడు అనిపించుకున్నాడు యంగ్ స్టార్. ఇక హీరోగా ఆయన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. కానీ మోక్షజ్ఞ తొలి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ దర్శకుడితో తెరకెక్కుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఈ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. చినబాబు ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి వస్తున్న వార్తలైనా నిజమౌతాయా లేదా చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image2
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Recommended image3
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Related Stories
Recommended image1
IMDb Top Indian Stars: సీఎం విజయ్, ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన కుర్రాడు, IMDb రేటింగ్ లో నెం.1 ఎవరో తెలుసా?
Recommended image2
Rajamouli: ఫేవరెట్ హీరోయిన్ అనుష్క శెట్టి, మరి రాజమౌళి కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? జక్కన్నసేఫ్ గేమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved