MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu మార్చి 5 ఎపిసోడ్: వార్నింగ్ ఇచ్చి మరీ భాగ్యాన్ని పంపేసిన నర్మద, ఇకపై సాగర్‌కు ఇత్తడే

Illu Illalu Pillalu మార్చి 5 ఎపిసోడ్: వార్నింగ్ ఇచ్చి మరీ భాగ్యాన్ని పంపేసిన నర్మద, ఇకపై సాగర్‌కు ఇత్తడే

Illu Illalu Pillalu మార్చి 5 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద.. వేదవతి చుట్టూ బతిమిలాడుతూ తిరుగుతూ ఉంటుంది. కానీ వేదవతి పట్టించుకోదు. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఇంట్లో నుంచి పంపిస్తుంది నర్మద. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Mar 05 2026, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేదవతిని బతిమిలాడిన నర్మద
Image Credit : Jio hotstar

వేదవతిని బతిమిలాడిన నర్మద

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద వేదవతితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. అత్తయ్యా అని పిలిచినా వేదవతి కోపంగా వెళ్ళిపోతుంది. అది చూసి భాగ్యం, శ్రీవల్లి ఎంతో ఆనందపడతారు. భాగ్యం తన కూతురితో నర్మదను మీ అత్తమామలు పట్టించుకోరు, నా గవర్నమెంట్ కోడలు తెలివైనది అనుకుంది, కానీ ఇకపై అలా సాగదు అని అంటుంది. ఇంతలో నర్మద వేదవతితో మాట్లాడేందుకు ప్రయత్నించినా వేదవతి కోపంగా ఉంటుంది. నర్మద మాట్లాడుతూ ‘మీ కోపాన్ని భరించే శక్తి నాకుంది. కానీ మీ మౌనాన్ని నేను భరించలేను. మీకు కోపం పోయేవరకు తిట్టండి. కానీ ఏదో ఒకటి మాట్లాడండి’ అని ఏడుస్తుంది. అయినా కూడా వేదవతి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అది చూసి భాగ్యం, వల్లి ఇంకా సంతోషపడతారు. దాని బతుకు ఒంటరి బతుకే అని సంతోషంగా ఉంటారు. 

నర్మద వారి దగ్గరికి వచ్చి ‘ఏంటి నేను వెళ్ళిపోయానని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు.. మళ్లీ నేను రావడం వల్ల బాధపడుతున్నారా’ అని అంటుంది. అప్పుడు వల్లి ‘నువ్వు వెళ్ళిపోయాక చాలా ఏడ్చాను. నా కళ్ళు చూడు ఎలా ఉన్నాయో.. కాకపోతే మా జుట్టు మీ చేతిలోనే ఉంది కదా.. అందుకే నువ్వు వెళ్ళిపోతే కొంచెం హ్యాపీగా అనిపించింది’ అంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
భాగ్యాన్ని ఇంట్లోంచి పంపేసిన నర్మద
Image Credit : Jio hotstar

భాగ్యాన్ని ఇంట్లోంచి పంపేసిన నర్మద

భాగ్యంతో నర్మద మాట్లాడుతూ ‘మీ ఇల్లు ఎక్కడో మీకు తెలియదా, మా మామయ్యకి ఆరోగ్యం బాలేదని ఇక్కడే ఉండిపోయారు. సర్దుకొని వెళ్ళండి’ అని అంటుంది. అప్పుడు వల్లి మా అమ్మ వాళ్ళు నాతోనే ఉంటారు, వాళ్ళని వెళ్లిపోమని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని అంటుంది. అప్పుడు నర్మద వల్లితో ‘సాగర్ జాబు గురించి తెలియడం వెనక, ఈ గొడవల వెనక మీరు ఉన్నారని తెలిస్తే అప్పుడు మీకు మామూలుగా ఉండదు’ అని గట్టిగానే వారిని ఇస్తుంది. దానికి ‘ఈ విషయానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇప్పుడు ఏంటి నేను వెళ్లిపోవాలి అంతే కదా వెళ్ళిపోతానులే’ అంటుంది భాగ్యం.

ఇక్కడ నుంచి సీన్ ప్రేమ, ధీరజ్ దగ్గరికి మారుతుంది. ప్రేమ నిద్రపోతూ ఉంటుంది. ధీరజ్ పక్కనే కూర్చుని ఆమెను చూస్తూ ఉంటాడు. ఇన్నాళ్లు సరిగా చూడలేదు కానీ నీ కళ్ళు చిలకల్లా ఉన్నాయే, బుగ్గలు బూరెల్లా ఉన్నాయి అంటూ ఒక బుగ్గ చుక్క పెడతాడు. తర్వాత ప్రేమకి మీసాలు పెడతాడు. ఈ లోపు ప్రేమ లేచి అద్దంలో చూసి ధీరజ్ ను తిడుతుంది. ఇక ఇద్దరు మీసాల పిల్ల పాటతో కాసేపు రొమాంటిక్ సీను నడిపిస్తారు. ఆ తర్వాత ఇద్దరం బయటికి వెళ్లాలి, కారు కొన్నాం కదా డబ్బులు కట్టాలి కదా త్వరగా రెడీ అవ్వు అంటాడు ప్రేమతో.

Related Articles

Related image1
Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: నర్మదపై రామరాజు కడుపు మంట రైస్ మిల్ కొట్టేయడానికి భాగ్యం ప్లాన్
Related image2
Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: రామరాజు కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంచి బయటికొచ్చేసిన సాగర్ నర్మద
34
సాగర్‌కు ఇచ్చిపడేసిన నర్మద
Image Credit : Jio hotstar

సాగర్‌కు ఇచ్చిపడేసిన నర్మద

ఇక సాగర్ ఉద్యోగానికి రెడీ అవుతాడు. నర్మదను వాచ్, పర్సు ఏదీ అని అడుగుతాడు. దానికి నర్మద ‘డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోవడం తెలుసుగాని, పర్సు గురించి తెలియదా’ అంటుంది .సాగర్ అయిపోయిన విషయం ఇప్పుడు ఎందుకు అంటాడు. దానికి నర్మద మాట్లాడుతూ ‘నువ్వు చేసిన తప్పుకు నేను శిక్ష పడుతున్నాను. అమ్మలా చూసుకున్న అత్త.. ఇప్పుడు నన్ను దూరం పెడుతుంది. ఇంట్లో ఎవరు తప్పు చేసినా నిలదీస్తాను. అలాంటిది నిన్ను క్షమిస్తాను అనుకుంటున్నావా? నువ్వు ఏదో సమస్యలో ఉన్నావని నగలు తాకట్టు పెట్టాను.. అంతే కానీ నిన్ను ఇంకా క్షమించలేదు’ అని చెబుతోంది.

ఇక భాగ్యం, ఇడ్లీ బాబాయి బ్యాగ్స్ పట్టుకుని బయలుదేరుతారు. నర్మద వెళ్లమని వార్నింగ్ ఇచ్చేలా సైగ చేస్తుంది. ఇంతలో రామరాజు వచ్చి వాళ్ళని ఆపుతాడు. వేదవతి కూడా వాళ్ళని వెళ్ళొద్దని చెబుతుంది. అప్పుడు నర్మద ‘ఇది కూడా మీ ఇల్లు అనుకుని ఉండండి... ఇంకా గోతులు తవ్వాలి కదా’ అని అంటుంది. దానికి రామరాజు ‘తప్పు చేసిన వాళ్ళే ఇంట్లో ఉంటున్నారు, మహాలక్ష్మిలాంటి కోడల్ని ఇచ్చారు. మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు’ అంటాడు. ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు రామరాజు. అదేమీ లేదని అక్కడ్నించి వెళ్లిపోతారు భాగ్యం, ఇడ్లీ బాబాయ్.

44
చందుపై రామరాజు ప్రేమ
Image Credit : Jio hotstar

చందుపై రామరాజు ప్రేమ

ఇక చందు రైస్ మిల్లుకు వెళ్లేందుకు సిద్ధమవుతాడు. రామరాజు దగ్గరికి వచ్చి రైస్ మిల్లుకు వెళ్తాను నాన్న అని చెబుతాడు. ఇక రామరాజు ఆనందంతో కొడుకు తలసర్దుతూ, చొక్కాకి బొత్తాలు పెట్టి.. ‘ఎంత అమాయకుడివి ఎలా బతుకుతావు? కొంతమంది ఉద్యోగం కోసమే బతుకుతారు, కానీ నువ్వు చేస్తున్న ఉద్యోగం వదిలేసి రైస్ మిల్లు చూసుకుంటున్నావు, తండ్రి వారసత్వం నువ్వే కొనసాగిస్తున్నావు’ అని అంటాడు. సాగర్ అది విని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. నర్మద వేదవతితో మాట్లాడినందుకు ప్రయత్నించినా కూడా ఆమె పట్టించుకోదు. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth ID Card: బస్ కండక్టర్‌ గా రజినీకాంత్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా? సూపర్ స్టార్ పాత ఐడీ కార్డు లో ఏముంది?
Recommended image2
Ram Charan బాడీ గార్డ్ ఎవరు..? అతని జీతం ఎంతో తెలుసా? మెగా పవర్ స్టార్ రక్షణకు అతను ఏం చేస్తాడంటే?
Recommended image3
Drishyam 3: 150 కోట్లు దాటి దూసుకుపోతున్న మోహన్ లాల్ మూవీ, మేకింగ్ వీడియో చూశారా?
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu మార్చి 4 ఎపిసోడ్: నర్మదపై రామరాజు కడుపు మంట రైస్ మిల్ కొట్టేయడానికి భాగ్యం ప్లాన్
Recommended image2
Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: రామరాజు కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంచి బయటికొచ్చేసిన సాగర్ నర్మద
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved