MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devata: దేవి కోసం బాధపడుతున్న చిన్మయి.. మీ నాయన ఎవరో నీకు చెప్తాను అంటూ దేవికి మాటిచ్చిన రుక్మిణి!

Devata: దేవి కోసం బాధపడుతున్న చిన్మయి.. మీ నాయన ఎవరో నీకు చెప్తాను అంటూ దేవికి మాటిచ్చిన రుక్మిణి!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెబర్ 2వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Sep 02 2022, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రుక్మిణి,దేవి పడుకున్నప్పుడు, మీ నాయన ఎవరో చెప్తే నీకు మంచిగానే ఉంటది, కానీ దాని తర్వాత అసలైన సమస్యలు మొదలవుతాయి. కనుక మంచి సమయం అప్పుడు నీకే నిజం తెలుస్తుంది అమ్మ అని బాధపడుతుంది. ఆ తర్వాత సీన్లో మాధవ్ తాగుబోతు కి ఫోన్ చేస్తాడు కానీ ఆ తాగుబోతు ఫోన్ ఎత్తడు. ఆ ఆఫీసర్ నుంచి తప్పించుకున్నాను ఇప్పుడు ఈయన దగ్గర దొరికిపోవడం కన్నా తప్పించుకోవడమే మంచిది అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు ఆ తాగుబోతు.
 

26

 ఆ తర్వాత చిన్మయి, రుక్మిణి  దగ్గరకు వెళ్లి, ఎందుకమ్మా దేవి ఇలా ఉంది?  మనసులో ఏమైనా బాధపెట్టుకుంటుందా? చాలా రోజుల నుంచి దాని ప్రవర్తనలలో మార్పు వస్తుంది. నాతో మాట్లాడడం కూడా తగ్గించింది అని అంటుండుగా నువ్వేం బాధపడొద్దు అమ్మా రెండు రోజులు ఆగితే దేవియే మారుతుంది. నువ్వు దాని గురించి దిగులు పడొద్దు అని చెప్తుంది. మనసులో మాత్రం మీ నాయన వల్లే దేవి అలా అవుతుంది అని నీకు ఎలా చెప్పను అమ్మా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్య దేవి గురించి ఆలోచిస్తూ, ఒకవేళ దేవికి నేనే నాన్నని అని చెప్తే మరి ఎందుకు వదిలేసావు అని అడుగుతుంది.అప్పుడు నేను చెడ్డవాడిని అవుతాను.
 

36

 మీ అమ్మే అందర్నీ వదిలి వెళ్ళిపోయింది అంటే రుక్మిణి నీ దేవి దృష్టిలో చెడ్డదాని చేసే వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో దేవి మాధవ్ దగ్గరికి వెళ్లి, ఎందుకు నాయనా నాకు అబద్ధం చెప్పావు ఎవరో వ్యక్తిని మా నాయన అని నాకు చెప్పావు నేను తన మీద అసలు పెట్టుకున్నాను అని అనగా నేను కూడా అతను మీ నాన్ననే అనుకున్నాను నన్ను క్షమించు అని బాధను నటిస్తాడు. అంతలో రుక్మిణి అక్కడికి వచ్చి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు.
 

46

 దేవి నేను చెప్పాను కదా మీ నాన్న ఎవరో నీకు చెప్తాను అని అంటుంది. నువ్వు ఎప్పుడూ చెప్తాను అనే అంటావు కానీ చెప్పవు అని దేవి ఏడుస్తుంది. అప్పుడు రుక్మిణి నేను నీకు త్వరలోనే చెప్తాను అని మాట ఇస్తున్నాను అని దేవిని అక్కడి నుంచి తీసుకువెళ్లి పోతుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్య భోజనం చేస్తూ ఉండగా సత్య, దేవుడమ్మ వడ్డిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడమ్మ ఆదిత్యతో ఈమధ్య నువ్వు ఇంటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టట్లేదు బయటే ఉంటున్నావు బయటపనులు అంత ముఖ్యమైనవా అని అడగగా బయట పనులు కూడా ఇంటికి సంబంధించినవే కొన్ని ఉన్నాయి అని అంటాడు ఆదిత్య.
 

56

 ఇంటికి సంబంధించిన పనులు చేస్తున్నావు కానీ ఇంట్లో మనుషుల గురించి ఆలోచించడం లేదు. సత్యని అమెరికా ఎప్పుడు తీసుకెళ్తావు అని అడగగా నాకు కొంచెం పని ఉన్నది అమ్మ అని అంటాడు ఆదిత్య. ఆ పని ఎప్పుడూ ఉండేదే కదా తను పాపం ఎన్ని అసలు పెట్టుకుంది తీసుకెళ్ళు అని అంటుంది దేవుడమ్మ. అప్పుడు ఆదిత్య ఎందుకు అలా పిల్లలు, పిల్లలు అనుకొని అరుస్తున్నారు. ఇప్పుడు అదంతా అవసరమా అని అడగగా సత్య, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీసుకెళ్తావు ఆదిత్య, నీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకొని ఉన్నాము అసలు నీకేమైనా శ్రద్ధ ఉన్నదా అని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతుంది.
 

66

ఆ తర్వాత సీన్లో మాధవ్ రుక్మిణి దగ్గరికి వచ్చి ఆదిత్య, దేవి కి ఇచ్చిన వాచ్ ని చూపించి  బాగానే ప్లాన్ చేశారు నువ్వు మీ పెనిమిటి కలిసి. దేవి ఎక్కడున్నాదో మీరు తెలుసుకోలేరు అనుకున్నాను కానీ తెలివిగా వెళ్లారు. కానీ నేను ఇక్కడితో ఆగను అని మాధవ్ నవ్వుతాడు. అప్పుడు రుక్మిణి నవ్వు ఎంత నవ్వినా నువ్వు ఇప్పుడే నవ్వాలి తర్వాత ఏడుపే కదా నీకు మిగిలేది అని అంటుంది.మీరు రేపో మాపో దేవికి నిజం చెప్పేస్తారు కానీ నేను ఉండగా అది జరగనివ్వను కదా అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Recommended image2
Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం
Recommended image3
2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved