- Home
- Entertainment
- Devatha: ఆదిత్య, రుక్మిణిల పెళ్లి ఫోటో చూసేసిన చిన్నయి.. మాధవ్ కుంటి కాలి నాటకం గురించి తెలుసుకున్న రుక్మిణి?
Devatha: ఆదిత్య, రుక్మిణిల పెళ్లి ఫోటో చూసేసిన చిన్నయి.. మాధవ్ కుంటి కాలి నాటకం గురించి తెలుసుకున్న రుక్మిణి?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 10వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రాధ ఒక్కత్తే ఉన్నది ఏమైనా చేయాలి అనుకోని మాధవ్ మెట్ల మీద నుంచి వస్తున్నప్పుడు కావాలని తన కర్రని కింద పారేసి పడిపోయినట్టు నటిస్తాడు. దాన్ని చూసిన రాదా అక్కడికి వస్తుంది. నొప్పితో అలమటిస్తున్న మాధవ్ ని చూసి, ఈయన బుద్ధి ఎలాంటిదైనా నొప్పితో ఉన్నారు కదా సహాయం చేద్దాం లేకపోతే ఈయన కి నాకు తేడా ఉండదు అనుకొని పైకి లేపడానికి సహాయం చేస్తుంది. అప్పుడు మాధవ్ దేవి మీద చేయి వేస్తాడు. దేవి నడిపిస్తూ ఉండగా మాధవ్ ఆగి ఆ కర్ర నీ పక్కన పెట్టి, ఇలాగే నువ్వు ఎప్పుడు నా పక్కన ఉంటే బాగుంటది కదా రాధా ఈ కర్రతో పని ఉండదు అని ఆ కర్రని తోసేస్తాడు.
నువ్వు నన్ను ఎప్పుడు ఇలా నడడం చూడలేదు కదా బహుశా ఇదే మొదటిసారి అయ్యుండొచ్చు. మీ ఆడవాళ్ళ ప్రేమ దక్కించుకోవాలంటే మగవాళ్ళలో ఏదో ఒక లోపం ఉంటే సింపతి గైన్ చేసుకోవచ్చు కదా అని ఇన్ని నాటకాలు ఆడాను అని అంటాడు మాధవ్. దాన్ని చూసినా రుక్మిణి ఆశ్చర్య పోతుంది.తను నోట్లో నుంచి మాట కూడా రాదు. కన్న తల్లిదండ్రుల్ని, కూతుర్ని కూడా మోసం చేయడానికి మనసు ఎలా వచ్చింది అని తిడుతుంది. అంతలో జానకమ్మ వాళ్ళు అక్కడికి వస్తారు వెంటనే మాధవ్ కర్ర పట్టుకొని ఏమీ తెలియనట్టు నటిస్తాడు దాన్ని చూసి ఆశ్చర్యపోతుంది రుక్మిణి.
ఆ తర్వాత సీన్లో చిన్నయి దేవి ఆడుకుంటూ ఉండగా దేవి అందర్నీ అక్కడికి పిలిచి మేమిద్దరమే ఆడుకుంటున్నాము మీరందరూ కూడా ఆడండి అని దాగుడుమూతలు ఆడుదాము అని చెప్తుంది. అలాగా దేవుడమ్మ దొంగగా పెట్టి అందరిని దాక్కమని చెప్తుంది. దేవుడమ్మ పది అంకెలు లెక్కపెట్టే సరికి అందరూ వేరువేరు ప్రదేశాల్లో దాక్కుంటారు. అప్పుడు చిన్మయి,దేవి ఒక గదిలో వేరువేరు కబోర్డ్లలో దాక్కుంటారు అప్పుడు దేవికి తల మీద పుస్తకాలు పడిపోతాయి అవన్నీ పక్కన సర్దుతున్నప్పుడు ఒక ఫోటో కనిపిస్తుంది.
ఆ ఫోటో దేవుడమ్మ చిన్నప్పటిది. దాన్ని చూసి ఎంత బాగున్నావని మురిసిపోతుంది దేవి. పక్కన కబోర్డ్ లో ఉన్న చిన్నయి మీద కూడా పుస్తకాలు పడతాయి అవి సర్దుతున్నప్పుడు చిన్మయికి ఆదిత్య రుక్మిణిలో పెళ్లి ఫోటో కనిపిస్తుంది. చిన్నయ్య ఆశ్చర్యపోయి, అమ్మ ఆఫీసర్ తో ఫోటో తీసుకుంది ఏంటి? ఇది పెళ్లి ఫోటో కదా అంటే అమ్మకి ఆఫీసర్ సార్ కి ఫోన్ పెళ్లయిందా. మరి అమ్మ నాన్నతో ఉంటుంది?సత్య పిన్ని కదా ఆఫీసర్ సార్ వాళ్ళు భార్య? అని ఆశ్చర్య పోతుంది చిన్మయి. ఇంతలో దేవుడమ్మ ఇంట్లో వాళ్ళందరినీ వెతుకుతూ ఉంటుంది.
అందరూ దేవుడమ్మ కళ్ళను కప్పి తప్పించుకుంటారు. ఏంటి ఇంకా ఎవరూ రాలేదు అని దేవి కబోర్డ్ తీసి బయటికి వచ్చేలోగా దేవుడమ్మ దేవిని చూసి పట్టేస్తుంది.ఆ ఫోటో నీ చూసి ఇదెక్కడ దొరికిందే నీకు అని అడగగా, ఇది మీదే కదా అవ్వ నేను ఉంచుకుంటాను అని అంటుంది. నీకెందుకే అని దేవుడమ్మ అడగగా మీ గుర్తుగా నేను ఉంచుకోకూడదా నేను నీ మనవరాలునే కదా అని అంటుంది దేవి. అప్పుడు చిన్మయి కూడా కబోర్డ్ లో నుంచి దిగుతుంది. ఇంక ఆడి అలిసిపోయారు పదండి వెళ్లి తిందాము అని అంటాది దేవుడమ్మ. చిన్మయి ఈ సరే వస్తాను అని ఆ ఫోటో గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత సీన్లో రుక్మిణి మాధవ్ గురించి నిజం తెలుసుకొని ఏడుస్తూ ఉంటుంది. భాగ్యమ్మ ఏమైంది అని అడగగా ఇంక ఇక్కడ మనం ఉండొద్దమ్మా దేవిని తీసుకొని వెళ్ళిపోదాము ఇప్పుడే వెళ్లి పోదాము ఇంత నాటకం జరుగుతుంది అని అంటుంది. ఆ తర్వాత సీన్ లో మాధవ్, నేను నీకు నిజం చెప్పాను కానీ ఈ నిజం నువ్వు ఎవరికి చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. ఒకవేళ నువ్వు బలవంతంగా నా చేత నడిపించాలని చూసినా, అందరికీ నిజం బయటపెట్టే రోజు వచ్చినప్పుడు నా కాళ్ళని నేనే నరికి తీసుకుంటాను అంతేకాని నిన్ను వదులుకోను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో భాగ్యమ్మ, రుక్మిణి ఇద్దరూ ఆ ఇల్లు నీ వెతకడానికి వెతుకుతారు.
అందులో ఒక ఇల్లు నచ్చుతుంది. అప్పుడు భాగ్యమ్మ, ఇలా ఎందుకమ్మా మన ఇంట్లోనే ఉండొచ్చు కదా అని అనగా నేను అదే అనుకున్నాను అమ్మ. కానీ నేను అక్కడ ఉంటే అత్తమ్మకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అందుకే నా బతుకు నేను బతుకుతాను ఇక్కడే ఉంటాను అని అంటుంది. దానికి భాగ్యమ్మ ఆ మాధవ్ కళ్ళముందు కాకుండా ఇంకెక్కడున్నా నాకు పర్లేదు అమ్మ. నేను ఈ నెల డబ్బులు కట్టి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగిస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!