- Home
- Entertainment
- Karthika Deepam: కార్తీకదీపంలో షాకింగ్ ట్విస్ట్.. కోటేష్, శ్రీవల్లిలను మర్డర్ చేయించిన రుద్రాణి!
Karthika Deepam: కార్తీకదీపంలో షాకింగ్ ట్విస్ట్.. కోటేష్, శ్రీవల్లిలను మర్డర్ చేయించిన రుద్రాణి!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం.

కార్తీక్, దీప ఒక దగ్గర కూర్చొని ఉండగా రుద్రాణి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు కార్తీక్ (Karthik) . ఇగ జరిగింది అంతా మన మంచికే అన్నట్టు దీప ధైర్యం చెబుతుంది. ఇక రేపటి నుంచి నేను పిండి వంటల పని మొదలు పెడతాను అని సంతోషంగా చెబుతుంది దీప (Deepa).
మరోవైపు స్టేషన్ నుంచి ఇంటికి వస్తుంది రుద్రాణి (Rudrani). ఘనంగా స్వాగతం పలికినట్టు తమ్ముళ్లు అక్కకోసం బిర్యాని తెస్తారు. అవేమి వద్దని జరిగిన దాని గురించి అలోచించి చాలా గట్టిగా కుట్ర పన్నుతుంది రుద్రాణి.
ఒకవైపు మోనిత నర్సమ్మ (Narsamma )ని కాఫీ అడగగా ఈరోజు చేయలేదు మేడం అని చెబుతుంది. ఎందుకని అడగగా పేపర్, పాలు మనకు వెయ్యరంట, అంతే కాకుండా కూరగాలు కూడా మనకు అమ్మము అని బస్తీ వాళ్ళు చెబుతున్నారని చెబుతుంది. దీనిగురించి దీర్ఘాంగా ఆలోచించడం మొదలు పెడుతుంది మోనిత (Monitha).
ఆ తరువాత మోనిత (Monitha ) బిడ్డను ఎత్తుకు వెళ్లినవాడి గురించి ఆలోచించి .. వాడిని ఎలా కనిపెట్టాలా అని.. నా ఆనందరావు (Anadharao) అసలు ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ భాదబడుతుంది.
మరోవైపు ఆనందంగా దీప (Deepa) నేను బాబును చూసుకుంటాను. మీరిద్దరూ గుడికి వెళ్ళండి అని శ్రీవల్లి కోటేష్ (Srivalli, kotesh)లకు చెబుతుంది. వారు దానికి సంతోషం వ్యక్తం చేసి ఇక ఇద్దరు గుడికి వెళ్లిపోతారు.
ఒకవైపు సౌందర్య (Soundarya) ఆదిత్యని కార్తీక్ ఎక్కడున్నాడో ఎమన్నా తెలిసిందా అని అడగగా.. ఇంకా లేదని.. పోలీస్ లకు కూడా వాళ్ళు ఎక్కడున్నారని చిన్న ఆధారం కూడా దొరకడం లేదని సమాధానం చెబుతాడు ఆదిత్య (Adithya). దానికి సాందర్య బాధపడుతుంది.
ఇక దీప బాబుని ఆడిస్తూ ఉండగా ఈలోపు కార్తీక్ (Karthik) వచ్చి, రుద్రాణి రాత్రే స్టేషన్ నుంచి బయటకు వచ్చిందంట అని చెబుతాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఇక శ్రీవల్లి (Srivalli) దంపతుల పరిస్థితి ఏంటీ అని ఇద్దరు ఆలోచిస్తారు.
ఆ తరువాత దీప (Deepa) బయటకు వెళ్లి పిల్లల కోసం చాక్లెట్స్, చెప్పులు తీసుకుంటుంది. అవి తీసుకొని నేరుగా స్కూల్ లో ఉన్న పిల్లలకు ఇస్తుంది. పిల్లలు ఎంతో సంతోష పడుతారు. హిమ, సౌర్య (Hima, Sourya) ఏ షో రూంలో కొన్నావ్ అమ్మ అని అడగా తోపుడు బండి దగ్గర కొన్నాను అని చెబుతుంది. పిల్లలు బాధగా ఆలోచిస్తారు.
మరోవైపు శ్రీవల్లి, కోటేష్ (Srivalli, Kotesh)లు పని ముగించుకొని బైక్ పైన వస్తుండగా రుద్రాణి (Rudrani ) తమ్ముళ్లు తో లారీ తో గుద్దిస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.