Brahmamudi: కోడలి గుట్టు బయటపెట్టిన రుద్రాణి.. కావ్య సలహాతోనే చేశానంటూ ట్విస్ట్ ఇచ్చిన స్వప్న!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కోడలి నాటకం బయటపెట్టిన అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో నీ భార్య ది ఫేక్ ప్రెగ్నెన్సీ అంటుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావ్ మమ్మీ? తను అంత పెద్ద అబద్దాన్ని దాచలేదు, అయినా పొట్ట చూసావా ఎంత ఉందో అంటాడు రాహుల్. సినిమాలో హీరోయిన్స్ కూడా అలాగే ఉంటారు అలాగని వాళ్ళు రియల్ ప్రెగ్నెంట్సా? డాక్టర్ కి రిపోర్టులు పంపించాను తను చూసి కన్ఫర్మ్ చేస్తే అప్పుడు దీని పని చెప్తాను అంటుంది రుద్రాణి.
మరోవైపు నేను ముందు ఫ్రెష్ అవుతాను అంటే నేను ముందు ఫ్రెష్ అవుతాను అంటూ కావ్య దంపతులు తగదా పడుతుంటారు. ఆడవాళ్ళం రెడీ అయ్యేసరికి టైం పడుతుంది అని చెప్పి రాజ్ కి కితకితలు పెట్టి తనని బయట పెట్టేసి కావ్య రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది తొండి అంటాడు రాజ్. లేదు టెన్ మినిట్స్ లో వచ్చేస్తాను అని చెప్పి రెడీ అయ్యి వస్తుంది కావ్య.
తర్వాత తన డ్రస్సు, అపర్ణ ఇచ్చిన డ్రస్సు రెండూ మంచం మీద పెట్టి ఇప్పుడు ఎవరు ఇచ్చిన డ్రెస్ వేసుకుంటారో చూడాలి అనుకొని తలుపు తీస్తుంది. కావ్య ని ముస్తాబులో చూసిన రాజ్ ఫ్లాట్ అయిపోతాడు. మీది కాస్ట్లీ ఫోన్ కదా నాకు ఒక ఫోటో తీయండి అంటుంది కావ్య. ష్యూర్ అని చెప్పి ఆమెకి ఫోటో తీసి చూపిస్తాడు రాజ్. చాలా బాగుంది అంటుంది కావ్య.
కెమెరా అద్దం లాంటిది మనం బాగుంటే ఫోటో కూడా బాగుంటుంది అని చెప్పి ఫ్రెష్ అప్ అవటానికి రూంలోకి వెళ్తాడు. ఈ లోపు స్వప్న ని కిందకి తీసుకు వస్తారు పేరంటాళ్ళు. జరిగేదంతా జరిగిపోతూనే ఉంటుంది మనం చూస్తూ ఊరుకోవాలా అని తల్లితో అంటాడు రాహుల్. ఒక్క ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను కన్ఫర్మ్ అయిందంటే అప్పుడు అందరి మధ్యలోనే దాని బండారం బయటపెడతాను అంటుంది రుద్రాణి.
ఇంతలో చిట్టి వచ్చి కుర్చీలో కూర్చోబెడదాం అంటుంది. ధాన్యలక్ష్మి రుద్రాణిని పిలిస్తే మీరు కానివ్వండి అంటుంది. కనకం చిట్టి ఇద్దరు స్వప్నని కుర్చీలో కూర్చోబెడతారు. మరోవైపు రూంలో ఎవరి డ్రెస్ వేసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతాడు రాజ్. డోర్ బయట ఉన్న కావ్య కూడా ఎవరి డ్రెస్ వేసుకుంటారో చూడాలి అనుకుంటుంది. డోర్ ఓపెన్ చేసిన రాజ్ రెడ్ డ్రెస్ లో ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని కిందికి దిగుతూ ఉంటే చిట్టి, కనకం వాళ్ళు ఆనందపడతారు. రుద్రాణి కొడుకుతో తల్లి ఇచ్చిన డ్రెస్ వేసుకోకుండా పెళ్ళాం ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడు ఆ కావ్య మొగుణ్ణి గుప్పెట్లో పెట్టుకుంది, ఇప్పుడు మా వదిన రియాక్షన్ దగ్గరుండి చూడాలి అని అపర్ణ దగ్గరికి వెళుతుంది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న అపర్ణ తో నీ కొడుకు పూర్తిగా నీ చేయి జారిపోతున్నాడు అంటూ రెచ్చగొడుతుంది.
కనకం కావ్య దంపతులను చూసి నాదిస్టే తగిలేలా ఉంది అంటూ ఎమోషనల్ అయి దిష్టి చుక్క పెడుతుంది. తర్వాత ఆశీర్వచనానికి రుద్రాణిని రమ్మంటే ముందు మీరు అక్షింతలు వెయ్యండి అంటుంది. మళ్లీ ధాన్యలక్ష్మి ఆశీర్వచనానికి రమ్మంటే ఈ లోపు శ్రీదేవి ఫోన్ చేయటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. ఆమె నీ కోడలికి ఫేక్ ప్రెగ్నెన్సీ, ఆమె పెద్ద డ్రామా ఆడుతుంది అని చెప్తుంది శ్రీదేవి.
ఆ మాటలు విన్న రుద్రాణి ఆనందంగా కోడలి దగ్గరికి వచ్చి పుట్టిల్లు ప్రాప్తిరస్తు, విడాకులు ప్రాప్తిరస్తు అని మనసులోని దీవిస్తుంది. తర్వాత కొడుకుని తీసుకొని పక్కకు వెళ్లి అసలు విషయం చెప్తుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు రాహుల్. ఆ కడుపు అడ్డుపెట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని అందరి మధ్యలో చెబుదాం పదా అంటాడు. ఇప్పుడు మన మాటలు ఎవరూ నమ్మరు చెప్పవలసిన వాళ్లే చెప్పాలి అంటూ స్వప్న ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది రుద్రాణి.
ముందు స్వప్న ఫ్రెండ్ తప్పించుకోవాలని చూస్తుంది కానీ నీ ఫేక్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి అవి బయట పెడితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని బెదిరిస్తుంది. తరువాయి భాగంలో అందరి ముందు స్వప్న ఫేక్ ప్రెగ్నెన్సీ ని బయటపెడుతుంది రుద్రాణి. అందరూ షాక్ లో ఉండగానే ఈ ఫేక్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేయమని సలహా ఇచ్చింది కావ్యనే అంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది స్వప్న. దాంతో కావ్య మరింత షాక్ కి గురవుతుంది.