- Home
- Entertainment
- Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
Ram Charan: రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? మెగా పవర్ స్టార్ వెల్లడించిన షాకింగ్ విషయాలు
గ్లొబల్ స్టార్ రామ్ చరణ్ కు సిగరెట్ తాగే అలవాటు ఉందా? మెగా హీరో ఆల్కాహాల్ తాగుతారా? మెగా పవర్ స్టార్ స్వయంగా వెల్లడించిన నిజం ఏంటి? ఇంతకీ ఆయన ఏమన్నాడు?

తండ్రిని మించిన తనయుడు..
మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. చిరంజీవి టాలీవుడ్లో మాత్రమే మెగాస్టార్ గా పేరు తెచ్చుకుంటే.. రామ్ చరణ్ మాత్రం పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ ను సాధించాడు. సినిమా కోసం ఎంతో కష్టపడుతూ.. ఎన్నో సాహసాలు చేస్తూ.. తనను తాను నిరూపించుకున్నాడు. గతంలో కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన చరణ్.. రంగస్థలం సినిమా నుంచి తన రూట్ ను మార్చుకున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన అద్భుతమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా పెద్ది సినిమాతో అంతకు మించి ఇమేజ్ ను సాధించాడు చెర్రి.
రామ్ చరణ్ అలవాట్లపై ప్రశ్నించిన దర్శకుడు
సినిమా వాళ్లంటే.. మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు అన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. టాలీవుడ్ హీరోలలో కూడా చాలామందికి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉంటుంది. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు స్మోకింగ్ అలవాటు ఉందా? ఆరెంజ్, రంగస్థలం, పెద్ది లాంటి చాలా సినిమాల్లో చెర్రి స్మోకింగ్ చేస్తూ కనిపించాడు. నిజజీవితంలో ఆయన ఎప్పుడైనా సిగరెట్ తాగారా అనే అనుమానం అభిమానులకు ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయాన్ని స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూలో చరణ్ ను స్వయంగా అడిగాడు. గోవిందుడు అందరివాడేలే సినిమా రిలీజ్ టైమ్ లో జరిగిన ఇంటర్వ్యూలో చరణ్ కు ఈ ప్రశ్న ఎదురయ్యింది.
మెగా పవర్ స్టార్ సిగరెట్ తాగుతాడా?
రియల్ లైఫ్ లో నువ్వు స్మోక్ చేస్తావా అని రామ్ చరణ్ ను డైరెక్ట్ గా అడిగేశాడు దర్శకుడు కృష్ణ వంశీ. రామ్ చరణ్ మాట్లాడుతూ..'' నేను ట్రై చేశాను.. స్మోకింగ్ మాత్రమే కాదు అన్నీ ట్రై చేశాను.. కానీ ఏదీ నాకు సెట్ అవ్వలేదు. పర్మినెంట్ అలవాటుగా మారలేదు. స్మోక్ చేస్తే స్కిన్ పాడైపోద్ది, వాయిస్ పాడైపోద్ది అంటుంటారు. మనకు తెలిసిందే కదా.. సినిమాల్లో కూడా ముందు యాడ్ వేస్తుంటారు స్మోకింగ్ గురించి. నేను తాగలేదు అని చెప్పట్లేదు.. అన్ని ట్రై చేశాను.. తప్పు అని నేను అనను. ఎవరి ఇష్టం వారిది కదా'' అని అన్నారు చరణ్. దాంతో చరణ్ గతంలో స్మొకింగ్ ట్రై చేశాడని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.
పెద్దిలో రఫ్పాడించిన రామ్ చరణ్..
రామ్ చరణ్ రీసెంట్ గా పెద్ది’ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ లో రన్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది. సినిమా అంతా తన భుజాలపై మోశాడు మెగా పవర్ స్టార్. సెకండ్ హాఫ్ తో పాటు క్లైమాక్స్‌లో ఆయన చూపించిన ఎమోషనల్ సీన్స్,అభిమానులను కదిలించింది. చరణ్ ఈసినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తన బాడీని మూడు పాత్రలకు తగ్గట్టుగా మార్చుకున్నాడు. చరణ్ కష్టం అంతా పెద్ది సినిమాలో కనిపించింది. సినిమా కోసం ఎంత సాహసం చేయడానికి అయినా ఆయన వెనకాడటంలేదు. అందుకే చరణ్ అంటే అభిమానులతో పాటు అందరు ప్రేమిస్తున్నారు.

