MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌తో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనంటోన్న `రొమాంటిక్‌` బ్యూటీ.. అసలైన అందాలతో అదరహో అనిపిస్తుందిగా..

ప్రభాస్‌తో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనంటోన్న `రొమాంటిక్‌` బ్యూటీ.. అసలైన అందాలతో అదరహో అనిపిస్తుందిగా..

 ప్రభాస్‌ `రొమాంటిక్‌` చిత్ర యూనిట్‌ని పిలిపించుకుని ఇంటర్వ్యూ చేయడం నమ్మలేకపోతున్నానని తెలిపింది. ఆమె చెబుతూ, `డార్లింగ్` మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతోన్నారు అంటే నేను అస్సలు నమ్మలేద`ని చెప్పింది.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 27 2021, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

`బాహుబలి`తో దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయిన బిగ్‌ స్టార్‌ ప్రభాస్‌(Prabhas) తమని ఇంటర్వ్యూ చేయడం  నమ్మలేకపోయానని, ఆయనతో ఉన్న క్షణాలు ఫ్యాన్‌ గర్ల్ మూవ్‌మెంట్‌ అని అంటోంది కేతిక శర్మ(Ketika Sharma). `రొమాంటిక్‌`(Romantic) చిత్రంతో సునామీ సృష్టిస్తుంది Ketika Sharma. తొలి చిత్రంతోనే అత్యంత బోల్డ్ రోల్‌లో నటించి గ్లామర్‌ షోకి హద్దే లేదని నిరూపించుకుంటోంది. ఆకాష్‌ పూరీతో ఆమె కలిసి నటించిన `రొమాంటిక్‌` చిత్రం ఈ నెల 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా కేతిక శర్మ అనేక ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముఖ్యంగా ప్రభాస్‌ `రొమాంటిక్‌` చిత్ర యూనిట్‌ని పిలిపించుకుని ఇంటర్వ్యూ చేయడం నమ్మలేకపోతున్నానని తెలిపింది. ఆమె చెబుతూ, `డార్లింగ్` మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతోన్నారు అంటే నేను అస్సలు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు, నార్త్ సైడ్ అంతా ఎక్కువగా సౌత్ సినిమాలు చూడరు. కానీ `బాహుబలి` మాత్రం అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇండస్ట్రీ అంటే `బాహుబలి`తోనే గుర్తిస్తున్నారు. అలాంటి ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయాను. ఆయనతో ఉన్న క్షణాలు ఫ్యాన్ గర్ల్ మూవ్‌మెంట్‌. అద ఎప్పటికీ మర్చిపోలేను.  ప్రభాస్‌ ఎంతో ఒదిగి ఉంటారు. చాలా మంచి వారు. ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మా సినిమాను ప్రమోట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది` అని తెలిపింది. 

36

`రొమాంటిక్‌` చిత్రంలో ఆఫర్‌ రావడంపై స్పందిస్తూ, నేను డిల్లీ నుండి వ‌చ్చాను. మాది డాక్ట‌ర్స్ ఫ్యామిలీ. అందుకు భిన్నంగా నేను మాత్రం ఒక‌  కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నా. నాకు సినీ ఇండస్ట్రీ అంటే ఇష్టం. పూరీగారీ బ్యానర్‌తో ఎంట్రీ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. `ఇన్ స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం.. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి` అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. ఆడిషన్ ఇచ్చాను.. అలా సినిమా మొదలైంది.

 

46

  నా మొదటి చిత్రమే ఇంత పూరి క‌నెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉంది. పూరి సార్ లెజెండరీ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగానే కాకుండా మనస్తత్వం ఇంకా చాలా ఇష్టం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నా` అని చెప్పింది. 

56

`రొమాంటిక్‌` చిత్రంతో తన పాత్ర గురించి చెబుతూ, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. నా మొదటి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా వల్లే కాదే పాటను పాడాను చాలా  ఆనందంగా ఉంది. నా సినిమా రెండు రోజుల్లో విడుదల కాబోతోందనే సంతోషంగా నాలో ఎక్కువైంది. తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరుతోంది.ఈ చిత్రంలో క్లైమాక్స్ అద్బుతంగా ఉంటుంది. ఎంతో ఇంటెన్సిటీతో ఉంటుంది` అని  కేతిక శర్మ తెలిపింది. 

66

`నాకు ఈ సినిమా విడుదల కాకముందే అవకాశాలు వచ్చాయి. అదంతా పూరి గారి వల్లే. నాగ శౌర్యతో `లక్ష్య`, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను. బయోపిక్స్‌లో నటించాలని ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. `లవ్ స్టోరీ` సినిమాను చూశాను. ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చేసే ప్రతీ ఒక్కటీ నాకు ఇష్టమే` అని వెల్లడించింది కేతిక. 

also read: వైరల్‌ అవుతున్న సమంత పోస్ట్.. కూతుళ్లని పెళ్లికోసం కాదు తనకోసం బతికేలా పెంచండి అంటూ..

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved