MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • వైరల్‌ అవుతున్న సమంత పోస్ట్.. కూతుళ్లని పెళ్లికోసం కాదు తనకోసం బతికేలా పెంచండి అంటూ..

వైరల్‌ అవుతున్న సమంత పోస్ట్.. కూతుళ్లని పెళ్లికోసం కాదు తనకోసం బతికేలా పెంచండి అంటూ..

స్టార్‌ హీరోయిన్‌ సమంత గత కొన్ని రోజులుగా వార్తల్లో ప్రధానాంశంగా నిలుస్తున్నారు. హీరో నాగచైతన్యతో కలిసి విడిపోతున్నట్టు ప్రకటించడంతో సెంటర్‌ పాయింట్‌ అవుతుంది. అంతేకాదు ఆమె తన జీవిత అనుభావాల్లోనుంచి సందేశాలను పంచుకుంటోంది. ప్రస్తుతం కూతుళ్లున్న పేరెంట్స్ కి ఓ సందేశాన్ని ఇచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Oct 27 2021, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సమంత.. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం ఆ బ్యాడ్‌ ఎక్స్ పీరియన్స్ నుంచి, ఆ మానసిక సంఘర్షణ నుంచి, ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. తనని తాను తెలుసుకునేందుకు, తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తుంది. రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. అందుకోసం తనని వెంటాడుతున్న కన్నీటి జ్ఞాపకాలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

Samantha ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసింది. మరోవైపు ఆధ్యాత్మిక యాత్రని కూడా పూర్తి చేసింది. మరోవైపు ఇప్పుడు విదేశీ టూర్‌ ప్లాన్‌ చేసింది. దుబాయ్‌కి సమంత వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. మేకప్‌ ఆర్టిస్ట్ సద్నా సింగ్‌, స్టయిలిస్ట్ ప్రీతమ్‌ జుకాల్కేర్‌ కూడా ఉన్నారు. ఫారెన్‌ టూర్‌ వెళ్తున్నట్టు సమంత పేర్కొంది. 

38

మరోవైపు ఓ ఆసక్తికర సందేశాన్ని స్టోరీస్‌లో పేర్కొంది సమంత(Samantha Post). తన పెళ్లి బంధం బ్రేక్‌ అయిన నేపథ్యంలో అమ్మాయిల పెళ్లి, వారి పెంపకం గురించి పేర్కొంది సమంత. అమ్మాయిలను ఎలా పెంచాలో, వేటిక ప్రయారిటీ ఇవ్వాలో తెలియజేసింది. ఇందులో సమంత చెబుతూ, మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారు పడకుండా ఉండేంత సమర్థురాలిగా చేయండి. ఆమె పెళ్లి రోజు కోసం డబ్బుని పొదుపు చేయకుండా, ఆమె చదువుకి ఖర్చు పెట్టండి` అని చెప్పింది. 

48

ఇంకా చెబుతూ, `ముఖ్యంగా ఆమెని పెళ్లికి సిద్దం చేయడానికి బదులుగా తన కోసం తనని సిద్ధం చేయండి. ఆమెకి ఆత్మ విశ్వాసం, ధైర్యాన్ని నేర్పించండి. అవసరమైతే ఆమె ఎవరినైనా గొంతు పిసికేయగలదని కూడా బోధించండి` అని పేర్కొంది సమంత. మొత్తంగా అమ్మాయిలను ధైర్యవంతులుగా, సొంతంగా జీవించేలా పెంచాలని సూచిస్తుంది సమంత. తన జీవితంలో జరిగిన అనుభవాలను బేస్‌ చేసుకుని కూతుళ్లున్న తల్లిదండ్రులకు ఇలా హితబోధ చేస్తుంది.

58
Samantha

Samantha

ప్రస్తుతం సమంత పంచుకున్న ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నాగచైతన్యతో విడాకుల విషయంలో తనలో కలిగిన మానసిక సంఘర్షణకిది నిదర్శనమని అంటున్నారు నెటిజన్లు. సమంత అనుభవించిన బాధని మరెవరూ అనుభవించ కూడదని ఇలాంటి పోస్ట్ పెట్టిందని చెబుతున్నారు. దీనికి చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. సమంతకి మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె చెప్పింది నిజమని తెలియజేస్తున్నారు. అమ్మాయిలున్న పేరెంట్స్ లో మార్పు రావాలని కోరుతున్నారు. 

68

సమంత.. నాగచైతన్య ఈ నెల 2న తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించారు. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఫుల్‌ స్టాప్‌ పెడుతున్నామని, విడిపోయినా స్నేహంగానే ఉంటామన్నారు. తమ వ్యక్తిగత జీవితాలకు స్వేచ్ఛనివ్వాలని, దీనిపై ఎవరూ ఒత్తిడి చేయకూడదని తెలిపారు. అయితే తాను విడిపోవడానికి పలు యూట్యూబ్‌ చానెల్స్ రకరకాలు వార్తలను ప్రసారం చేయడంతో మండిపోయిన సమంత.. వాటిపై చర్యలు తీసుకోవాలని, కూకట్‌పల్లి కోర్ట్ ని ఆశ్రయించింది. దీంతో మంగళవారం ఈ కేసుని విచారించిన కోర్ట్ సమంతపై ప్రసారం చేసిన తప్పుడు కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. 
 

78

సమంత ఇకపై కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. వరుసగా సినిమాలు చేసేందుకు కమిట్‌ అవుతుంది. ఇప్పటికే ఆమె తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు కొత్తగా రెండు బైలింగ్వల్‌ ప్రాజెక్ట్ లను ప్రకటించింది. మరోవైపు హిందీలోకి డెబ్యూ ఇవ్వబోతుందట. అటీ-షారూఖ్‌ఖాన్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందని తెలుస్తుంది. నయనతార స్థానంలో సమంతని తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.

 

88

ఇదిలా ఉంటే సమంతలో మరో కళ ఉంది. ఆమెలో పెయింటింగ్‌(ఆర్ట్) కళ ఉంది. గోడలపై వేసే పెయింట్‌తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఓ ఫోటోని పంచుకుంది సమంత. ఇందులో గోడపై రకరకాల కలర్స్ తో పెయింటింగ్‌ వేసింది. అనేక అర్థాలు దాగున్న ఆమె పెయింటింగ్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

also read: Katrina kaif: డిసెంబర్ లో విక్కీ-కత్రినా వివాహం... విశ్వసనీయవర్గాల సమాచారం ఏంటంటే

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Rathod: నిమ్మతోట వనములో సాంగ్ తో దుమ్మురేపిన మాధురి రాథోడ్.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Recommended image2
Sowcar Janaki Passed Away: 70 ఏళ్ల సినీ ప్రయాణం, 400 సినిమాల రికార్డు, షావుకారు జానకి కన్నుమూత, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Recommended image3
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved