MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Roja selvamani daughter: హాలీవుడ్ స్టూడియోలో రోజా కూతురు, అన్షు మాలిక హీరోయిన్ గా సినిమా ఎప్పుడు? నిజమెంత?

Roja selvamani daughter: హాలీవుడ్ స్టూడియోలో రోజా కూతురు, అన్షు మాలిక హీరోయిన్ గా సినిమా ఎప్పుడు? నిజమెంత?

Roja selvamani daughter: హాలీవుడ్ లో అన్షు మాలిక. రోజా కూతురు ఎంట్రీ హాలీవుడ్ లో జరగబోతోందా? ఫారెన్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతోందా. చదవుల్లో టాపర్ గా ఉన్న అన్షు ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు? ఆమె హాలీవుడ్ స్టూడియోకి వెళ్లడానికి కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 22 2026, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోజాను మించిన గ్లామర్..
Image Credit : Asianet News

రోజాను మించిన గ్లామర్..

హీరోయిన్ రోజా కూతురు అన్షు మాలిక బ్యూటీతో అభిమానులను కట్టిపడేస్తోంది. హీరోయిన్లను మించిన గ్లామర్ తో వెలిగిపోతున్న ఆమెను హీరోయిన్ గా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోజాను మించిన టాలెంట్ ఉన్న ఆమె ఇండస్ట్రీ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ వారసుడి ఎంట్రీతో రోజా కూతురు ఎంట్రీ కూడా ఉంటుందని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అన్షు మాత్రం అమెరికాలో తన చదవు కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లకు, ఫోటోలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈక్రమంలో అన్షు హాలీవుడ్ స్టూడియోకు వెళ్లడం.. అందరి దృష్టిని ఆకర్శించింది. ఆమె సినీ ప్రవేశంపై వార్తలు మళ్లీ మొదలయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హాలీవుడ్ స్టూడియోస్‌లో సందడి
Image Credit : @anshumalikar

హాలీవుడ్ స్టూడియోస్‌లో సందడి

ఇటీవల అన్షు మాలిక్ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ 'యూనివర్సల్ స్టూడియోస్' (Universal Studios) ముందు దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. వెనుక హాలీవుడ్ గ్లోబ్ మెరుస్తుండగా, ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ అన్షు సొంతం" అని కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆ ఫోటోలు ఉండటంతో.. అన్షు త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతుందా? అనే ప్రచారం మళ్లీ మొదలైంది. హన్షు.. హాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇవ్వబోతుందని అంతా అనుకుంటున్నారు. అక్కడే స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె కేవలం విజిట్ కోసమే అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అమెరికాలో రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అన్షు... తాజాగా హాలీవుడ్ స్టూడియోస్ కి వెకేషన్ కి వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేసి.. ఆఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Related Articles

Related image1
Ram Charan: మా బాబు చిరంజీవి కాదు.. రామ్ చరణ్ ను ఇంత పెద్ద మాట అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
Horror Movie: 25 ఏళ్ల నాటి హారర్ సినిమా OTTలో ట్రెండింగ్... ఒంటరిగా చూశారంటే అంతే సంగతి
35
చదువులో రికార్డులు.. గ్లోబల్ అవార్డులు
Image Credit : our own

చదువులో రికార్డులు.. గ్లోబల్ అవార్డులు

అన్షు కేవలం స్టార్ కిడ్ అనిపించుకోవడమే కాదు, చదువులోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిన్నతనంలోనే అన్షు "ది లైట్ ఇన్ ది డార్క్ నెస్" అనే పుస్తకాన్ని రచించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చదువులో ఆమె చూపిన ప్రతిభకు గానూ ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది 'గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు'ను కైవసం చేసుకున్నారు. అన్షు మాలిక ఇది మాత్రమే కాదు.. చాలా ఘనతలను సాధించింది. తను చదువకుంటున్న రోజుల్లో పలు ప్రెస్టేజియస్ అవార్డులను కూడా అందుకుంది. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, లడ్డి అకాడెమిక్ ఎక్సలెన్స్ అవార్డు, డీన్ లిస్ట్ గుర్తింపులు, ఫౌండర్స్ స్కాలర్ వంటి అనేక గౌరవాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అదనంగా గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు 2024, గ్లోబల్ ఇంపాక్ట్ అడ్వకేట్ అవార్డు 2025 వంటి గుర్తింపులు కూడా ఆమె సాధించింది.ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తూ, సాంకేతిక రంగంలో ఎన్నో పతకాలు, సర్టిఫికేట్లు సాధించారు.

45
అన్షు మాలిక హీరోయిన్ ఎంట్రీ ఎప్పుడు?
Image Credit : @anshumalikar

అన్షు మాలిక హీరోయిన్ ఎంట్రీ ఎప్పుడు?

అన్షు అందం, అభినయం చూసిన అభిమానులు ఆమె టాలీవుడ్ లేదా కోలీవుడ్‌లో ఎప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పైగా తండ్రి సెల్వమణి ప్రముఖ దర్శకుడు, తల్లి రోజా నటి కావడంతో సినీ రంగానికి ఆమె రాక సులభమే అని భావిస్తున్నారు.అయితే, ఇప్పటివరకు ఉన్న అధికారిక సమాచారం ప్రకారం అన్షు మాలిక్ సినీ ఎంట్రీపై ఎలాంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు.

55
అభిమానుల కోరిక.. రోజా కామెంట్స్...
Image Credit : @rojaselvamairk)

అభిమానుల కోరిక.. రోజా కామెంట్స్...

అన్షు రోజాను మించిన అంతంతో హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు కలిగి ఉంది. కానీ ఆమె మాత్రం సినీరంగం వైపు రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు అని తెలుస్తోంది. పిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించి, రాజకీయంలో మంత్రిగా కొనసాగిన రోజా కూతురు, ఈ రెండింటిలో ఏది ఎంచుకోకుండా చదువులో రాణిస్తూ.. అంతర్జాతీయ గుర్తింపుని సాధించింది. రోజా అభిమానులు మాత్రం అన్షును హీరోయిన్ గా చూడాలని కోరుకుంటున్నారు. ఈ విషయంపై గతంలో రోజా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. "అన్షుకు ప్రస్తుతం చదువుపైనే పూర్తి దృష్టి ఉంది. తనకి సాంకేతిక రంగం, పరిశోధనలంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో సినిమాల్లోకి రావాలా వద్దా అనేది ఆమె సొంత నిర్ణయం" అని స్పష్టం చేశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin Team Remunerations: లెనిన్‌ మూవీకి అఖిల్‌ పారితోషికం ఎంతో తెలుసా? కెరీర్ లోనే హైయ్యెస్ట్.. టీమ్ ఫీజు వివరాలు
Recommended image2
CM Vijay Movies: విజయ్ దళపతి కెరీర్‌లో ఈ 7 సినిమాలు చాలా స్పెషల్, జననాయగన్ కంటే ముందు చూడాల్సిన మూవీస్ ఇవే..
Recommended image3
Mannat: 18 కోట్లకు కొన్న బంగ్లా విలువ ఇప్పుడు 300 కోట్లు.. దేశంలోనే ఖరీదైన బంగ్లా..
Related Stories
Recommended image1
Ram Charan: మా బాబు చిరంజీవి కాదు.. రామ్ చరణ్ ను ఇంత పెద్ద మాట అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Horror Movie: 25 ఏళ్ల నాటి హారర్ సినిమా OTTలో ట్రెండింగ్... ఒంటరిగా చూశారంటే అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved