MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ram Charan: మా బాబు చిరంజీవి కాదు.. రామ్ చరణ్ ను ఇంత పెద్ద మాట అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Ram Charan: మా బాబు చిరంజీవి కాదు.. రామ్ చరణ్ ను ఇంత పెద్ద మాట అన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

Ram Charan: పాన్ఇండియా హీరో, టాలీవుడ్ లో తిరుగు లేని ఇమేజ్ సాధించిన నటుడు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను పట్టుకుని మా బాబు చిరంజీవి కాదు.. అని అన్నది ఎవరో తెలుసా? అలా అంటానికి కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 21 2026, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వారసత్వంగా వచ్చి.. స్వయంకృషితో ఎదిగిన హీరో..
Image Credit : Asianet News

వారసత్వంగా వచ్చి.. స్వయంకృషితో ఎదిగిన హీరో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం వారసత్వంగానే వచ్చినా.. స్టార్ గా ఎదగడం మాత్రం తస సొంత టాలెంట్ తోనే జరిగింది. మెగా స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ కొంత కాలం సరైన సక్సెస్ ను చూడలేకపోయాడు. కానీ తర్వాత కాలంలో తనను తాను మార్చుకుని.. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్, పెద్ది లాంటి సినిమాల్లో తన నట విశ్వరూపం చూపించాడు చరణ్. 

ఒకప్పుడు చిరంజీవి కొడుకు అనే పరిస్థితి నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనేలా తన ఇమేజ్ ను బిల్డ్ చేసకున్నాడు. ఈ విషయంలో చరణ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. చరణ్ సినిమాల విషయంలో ఎంత కష్టపడ్డాడు అనేది ఓ సందర్బంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు.అంతే కాదు మా బాబు చిరంజీవి కాదు అనే మాట స్వయంగా మెగాస్టారే రామ్ చరణ్ ను అన్నారు. కారణంఏంటంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమౌళి చెక్కిన శిల్పం..
Image Credit : X

రాజమౌళి చెక్కిన శిల్పం..

రామ్ చరణ్‌కు చిన్నప్పటి నుంచే గుర్రపు స్వారీ (Horse Riding) పై ఉన్న ప్రత్యేక ఆసక్తిని గమనించి, ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఒక ప్రొఫెషనల్ ట్రైనర్‌ను ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించినట్లు చిరంజీవి ఓ ఈవెంట్ లో తెలిపారు. చిన్నతనం నుంచే నిరంతర సాధన చేయడం వల్లే చరణ్ హార్స్ రైడింగ్‌లో అంతటి పర్ఫెక్షన్ సాధించగలిగాడని అన్నారు. అందుకోసం చరణ్ చాలా కష్టపడ్డాడని చిరు వెల్లడించారు. అలా తయారైన చరణ్ అనే శిలను దర్శకధీరుడు రాజమౌళి అనే అమర శిల్పి మరింత అద్భుతమైన శిల్పంగా తీర్చిదిద్దాడని మెగాస్టార్ ప్రశంసించారు.

35
"మా బాబు చిరంజీవి కాదు" అని ఎందుకు అన్నారంటే?
Image Credit : Asianet News

"మా బాబు చిరంజీవి కాదు" అని ఎందుకు అన్నారంటే?

అదే సమయంలో తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, రామ్ చరణ్‌కు లభించినట్లుగా తనకు ముందస్తుగా ఎలాంటి ప్రత్యేక శిక్షణ లభించలేదని చిరంజీవి చెప్పారు. "మన శిల్పాన్ని మనమే చెక్కుకోవాల్సి వచ్చింది.. షూటింగ్ స్పాట్‌కు వెళ్లాక, అక్కడ ఉండే ఫైటర్స్ ఏది నేర్పిస్తే దాన్ని నేర్చుకుంటూ, గుర్రాలెక్కి స్వయంగా ప్రాక్టీస్ చేస్తూ నైపుణ్యం సాధించాను. నాకంటు స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చేవారు లేరు. "ఎందుకంటే మా బాబు చిరంజీవి కాదు" అంటూ" చిరంజీవి చమత్కారంగా, ఆత్మీయంగా రామ్ చరణ్‌ను టీజ్ చేశారు. 

చిన్నప్పటి నుంచే శిక్షణ ఇప్పించడానికి, ప్రోత్సహించడానికి "చిరంజీవి" అనే తండ్రి ఉన్నాడు. కానీ చిరంజీవికి అలా ముందే అన్ని వసతులు, ప్రొఫెషనల్ శిక్షణ కల్పించే "చిరంజీవి" లాంటి స్టార్ తండ్రి లేడు. అందుకే తాను ప్రతీ విషయాన్ని షూటింగ్ లొకేషన్‌లోనే కష్టపడి, స్వయంకృషితో నేర్చుకోవాల్సి వచ్చిందని మెగాస్టార్ స్పష్టం చేశారు.

45
70 ఏళ్ళ వయసులో దూసుకుపోతున్న మెగాస్టార్...
Image Credit : Asianet News

70 ఏళ్ళ వయసులో దూసుకుపోతున్న మెగాస్టార్...

ఎవరి సపోర్ట్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన చిరంజీవి.. వారసత్వంగా వచ్చిన హీరోలకు పోటీ ఇచ్చి.. సొంత ఇమేజ్ ను, స్టార్ డమ్ ను సాధించాడు.దాదాపు 45 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు చిరు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 70 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. రచ్చ చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే మన శంకర వరప్రసాదుగారు సినిమాతో భారీ సంక్రాంతి హిట్ కొట్టిన చిరంజీవి.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి బరిలో దిగాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈలోపు విశ్వంభర కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

55
చిరంజీవిని మించిపోయిన రామ్ చరణ్..
Image Credit : Asianet News

చిరంజీవిని మించిపోయిన రామ్ చరణ్..

మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. కొన్ని విషయాలలో తండ్రిని మించిపోయాడు చరణ్. నటనలో ఎన్నో వేరియేషన్లు చూపిస్తూ.. సినిమా కోసం ఎన్నో సాహసాలు చేస్తూ.. అభిమానులను అలరించడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు మెగా పవర్ స్టార్. వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన సొంత కష్టంతో స్టార్ గా ఎదిగాడు చరణ్. ముఖ్యంగా పెద్ది సినిమాలో రామ్ చరణ్ నటన, పాత్రల కోసం ఆయన చేసిన శ్రమ, తీసుకున్న రిస్క్ అంతా ఇంతా కాదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Recommended image2
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ
Recommended image3
Yash: సంచలనం సృష్టిస్తున్న సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ సపోర్ట్.. ఫొటోలు చూసేయండి!
Related Stories
Recommended image1
Balakrishna: షూటింగ్ లో ప్రమాదం, బాలయ్యకు గాయాలు, ఆందోళనలో అభిమానులు..
Recommended image2
Chiranjeevi: మెగాస్టార్ సినిమాను చావు దెబ్బ కొట్టిన ఆర్ నారాయణమూర్తి, ఒకే టైటిల్ తో రిలీజ్ అయిన రెండు సినిమాలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved