MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Roja Selvamani: అనుష్క లాగా నేను కూడా చేయగలను, ఆ సినిమాలు అందుకే అట్టర్ ఫ్లాప్.. రోజా సంచలన వ్యాఖ్యలు

Roja Selvamani: అనుష్క లాగా నేను కూడా చేయగలను, ఆ సినిమాలు అందుకే అట్టర్ ఫ్లాప్.. రోజా సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటి రోజా ఓ ఇంటర్వ్యూలో అనుష్క సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అప్పుడే తల్లి పాత్రలకు సెట్ కాను అని చాలా మంది చెప్పినట్లు రోజా పేర్కొన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 11 2026, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Roja Selvamani
Image Credit : Asianet News

Roja Selvamani

సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సినిమాల్లో నటించి హీరోయిన్ గా వెలుగు వెలిగారు. ఆ తర్వాత తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. చాలా ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత రోజా రాజకీయాల్లో విజయం సాధించారు. వైసీపీ హయాంలో మంత్రి కూడా అయ్యారు. గత ఎన్నికల్లో రోజా ఓటమి చెందిన సంగతి తెలిసిందే. రోజా గతంలో జబర్దస్త్ షోకి హోస్ట్ గా కూడా చేశారు. ఇటీవల ఆమె బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ అంతగా కనిపించడం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ సినిమాలు అంటే చాలా ఇష్టం
Image Credit : INSTAGRAM/Roja Selvamani

ఆ సినిమాలు అంటే చాలా ఇష్టం

ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ అనుష్క శెట్టిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలకు సమయం కేటాయించడం చాలా కష్టం. కానీ నేను ఇప్పటికీ ఎలాంటి పాత్రలో అయినా నటించగలను. అయితే ఇప్పుడున్న పరిసస్థితుల్లో మాత్రం అనుష్క నటించే తరహాలో సినిమాలు చేయాలని ఉంది. అనుష్క నటించిన అరుంధతి మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఆమె పాత్ర ట్రెడిషనల్ గా ఉంటూనే పవర్ ఫుల్ గా ఉంటుంది.

35
అనుష్క లాగా నేను కూడా చేయగలను
Image Credit : Instagram/Roja Selvamani

అనుష్క లాగా నేను కూడా చేయగలను

అదే విధంగా ఆమె నటించిన రుద్రమదేవి చిత్రం అంటే కూడా ఇష్టం. అలాంటి చిత్రాలు వస్తే నేను కూడా చేయగలను అని రోజా అన్నారు. బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర అంటే కూడా నాకు చాలా ఇష్టం. అయితే నేను తల్లి పాత్రలో నటిస్తే ఒక సమస్య ఉంది. నా నవ్వు అంటే అందరికీ చాలా ఇష్టం. ఆ నవ్వే నాకు మైనస్ గా కూడా మారుతోంది.

45
ఇంకా హీరోయిన్ గా చేయమంటున్నారు
Image Credit : Asianet News

ఇంకా హీరోయిన్ గా చేయమంటున్నారు

నేను మొగుడు, శంభో శివ శంభో, గోలీమార్ లాంటి చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించాను. ఆ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు నా నవ్వు చూసి మీరు అప్పుడే తల్లి పాత్రలు ఎందుకు చేస్తున్నారు. హీరోయిన్ గా చేయొచ్చు కదా అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ చిత్రాల్లో నాకు తల్లి పాత్రలు సెట్ కాలేదు. అందుకే ఆ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి ని రోజా అన్నారు.

55
స్టార్ హీరోలతో రొమాన్స్
Image Credit : Asianet News

స్టార్ హీరోలతో రొమాన్స్

రోజా తెలుగు సినిమాల్లో నటించి పదేళ్లుపైనే అవుతోంది. రోజా తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోలతో నటించింది. భైరవద్వీపం, బొబ్బిలి సింహం లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Balakrishna: నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Bharathiraja Telugu Films: అలీకి వాచిపోయేలా చెంపదెబ్బలు, చిరంజీవి అంటే పిచ్చి..భారతీరాజా తెలుగు సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved