రోజా భర్త మాటలు విని కోట్లు నష్టపోయిందా.? మాజీ హీరోయిన్ చేసిన పొరపాటు ఏంటి?
రోజా తన భర్త మాటలు వినడం వల్ల కోట్లలో నష్టపోయిందా..? ఆమె చేసిన చిన్న పొరపాటు ఆమెకు భారీ నష్టాన్ని మిగిల్చిందా.? రోజాకు ఏ విషయంలో అంత నష్టం వచ్చింది.? కారణం ఏంటి?

రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మాజీ హీరోయిన్.. మాజీ మినిస్టర్..మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం పార్టీ కార్యకర్త మాత్రమే. వైసీపీ ఓడిపోయిన తరువాత పెద్దగా యాక్టీవ్ గా లేదు రోజ.
రోజా ప్రస్తుతం తెరమీద ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లోఓడిపోవడంతో..పెద్దగా బయటకు రావడం లేదు రోజా. ఇప్పుడిప్పుడే కాస్త యాక్టీవ్ అవుతున్న రోజా.. చెన్నై నుంచి అన్నిపనులు చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి
ఇక దాదాపు పది నెలలుగా ఆమో చేసిన ప్రయత్నంతో రీసెంట్ గా బుల్లితెరమీదకు ఆమె ఎంట్రీఫిక్స్ అయ్యింది. జీలో ఓ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా కనిపించింది రోజా. ఇక సినిమా ప్రయత్నాలు కూడా చేస్తుందట.
కాని టాలీవుడ్ లో కాని.. కోలీవుడ్ లో కాని రోజాకు పెద్దగా ఆఫర్లు రావడంలేదు అని సమాచారం. గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు రజినీకాంత్ ను, ఇక్కడ మెగా ప్యామిలీని ఆమె అనరాని మాటలు అనడం వల్ల.. రోజాకు ఆఫర్లు రావడం కష్టమనే చెప్పాలి.
Also Read:సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?
గతంలో హీరోయిన్ గా స్టార్ డమ్ చూసింది రోజా. టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకీ, నాగార్జున, బాలయ్య, శ్రీకాంత్, జగపతిబాబు, కోలీవుడ్ లో రజినీకాంత్, విజయ్ కాంత్, శరత్ కుమార్, అజిత్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి హీరోలతో నటించి మెప్పించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రల్లో కూడా అదరగొట్టింది సీనియర్ బ్యూటీ.
Also Read:60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?
బుల్లితెరపై కూడా ప్రతాపం చూపించింది రోజా. జబర్థస్త్ జడ్జిగా.. తన మార్క్ చూపించిన ఈ నటి ఎక్కువకాలం జబర్థస్త్ జడ్జిగా కొనసాగింది. అప్పట్లో మినిస్టర్ గా ప్రమోషన్ రావడంతో.. రూల్స్ ప్రకారం జబర్థస్త్ ను వదిలేసింది రోజా.
ఇక రోజా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి గతంలో ఎక్కువ సినిమాలు చేశారు. 2002 లో వీరు పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు
Also Read:హీరోయిన్ గా స్టార్ డమ్, పెళ్లి, విడాకులు, అనారోగ్యం, సమంత 15 ఏళ్ల సినీ ప్రయాణం
రోజా - 5 లక్షలు
ఇక వీరిద్దరి గురించి చెప్పుకోవాలి అంటే.. ఓ సందర్భంలో రోజా కోట్లకు కోట్లు నష్టపోయిందట. అది కూడా భర్త సెల్వమణి మాటలు విని రోజా నష్టపోయిందట. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన సెలవ్వమణి తమిళంలో సూపర్ హిట్ సినిమాలు చేశారు.
ఆ నమ్మకంతోనే సెల్వమణి దర్శకత్వంలో సుమన్ హీరోగా ఓ సినిమాను రోజా నిర్మించిందట. సమరం టైటిల్ తో రిలీజ్ అయిన ఈ యాక్షన్ మూవీకి నిర్మాతగా వేరే పేరు ఉన్నా.. డబ్బు పెట్టింది రోజానే అని సమాచారం.
Also Read: ధనుష్, విజయ్, అజిత్ కి సాధ్యం కాలేదు, డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ మాత్రం రికార్డు సృష్టించాడు
అయితే ఇందలో నిజం ఎంతో తెలియదు కాని.. బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుకు వేయకుండ రోజా ఖర్చు పెట్టారట. ఈ సినిమా పాటలు అద్భుతంగా వెళ్లడంతో సినిమా కూడా హిట్ అవుతుంది అనుకున్నారట.
కాని ఈమూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే నెగెటీవ్ టాక్ రావడంతో.. మూవీ ప్లాప్ గా నిలిచిందట. ఈ సినిమా కోసం రోజా పెట్టిన డబ్బంతా ఆవిరై పోవడంతో.. కోట్లలో ఆమె నష్టపోయిందట. దాంతో వీరు ఆర్ధికంగా నష్టపోయి.. కోలుకోవడానికి చాలా టైమ్ పట్టిందని ఇండస్ట్రీ టాక్.