Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Emmanuel lover తనకు ఒక లవర్ ఉందని ఒప్పుకున్న బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ .. ఆమె ఎవరో మాత్రం వెల్లడించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఒక డాక్టర్ ను పెళ్ళాడబోతున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు 9 టాప్ కంటెస్టెంట్
జబర్దస్త్ ద్వారా ఆడియన్స్ కు బాగా పరిచయమైన కమెడియన్ ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఆయన టాప్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. అంతే కాదు బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి బాగా ఎంటర్టైన్ చేస్తూ.. టాస్క్ లు కూడా అద్భుతంగా ఆడుతూ.. టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. పటాస్ కామెడీ షో ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టిన ఇమ్మాన్యుయేల్, జబర్దస్త్‌లో చేసిన స్కిట్స్‌తో మంచి ఫేమ్ సంపాదించాడు. సినిమాల్లో కూడా పలు చిన్నపాటి పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ వర్ష, ఫైమాతో చేసిన లవ్ ట్రాక్‌లు జబర్దస్త్ ప్రేక్షకులను అలరించాయి.
ఇమ్మాన్యుయేల్ లవ్ స్టోరీ..
జబర్దస్త్ లో వర్ష, ఫైమాతో ఇమ్మాన్యుయేల్ చేసిన స్కిట్స్ మూలంగా.. వర్షతో ఆయన లవ్ లో ఉన్నాడని అందరు అనుకున్నారు. దీనికితోడు కావాలని స్కిట్స్ లో వేసే ఎలివేషన్ మ్యూజిక్ లు, సాంగ్స్ తో అందరు వర్షకు, ఇమ్మాన్యుయేల్ కు మధ్య ఏదో ఉందంటూ.. రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదని.. ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ లోకి వచ్చిన తరువాత తెలిసింది. ఆయన తనకు ఒక లవర్ ఉందని బిగ్ బాస్ హౌస్ లో వెల్లడించాడు. కానీ ఆమె ఎవరు అనే విషయం మాత్రం చెప్పలేదు. అయితే ఇమ్మాన్యుయేల్ కు కాబోయే భార్య గురించి ఆయన అన్న వంశీ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రివిల్ చేశాడు.
డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్న ఇమ్మాన్యుయేల్
ఇమ్మాన్యుయేల్ అన్న వంశీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు మాట్లాడారు. ఇమ్ము వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మొదటిసారిగా స్పష్టత ఇచ్చారు. వంశీ మాట్లాడుతూ, “ఇమ్మాన్యుయేల్‌కి గర్ల్ ఫ్రెండ్ ఉంది. కానీ ఆమె ఎవరో ఎవరికి తెలీదు. ఆమె ఎవరో నాకు మాత్రమే తెలుసు. ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్‌లో ఉన్నాడు కాబట్టి.. సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిల ఫోటోలు పెట్టి ‘ఈమె అతని గర్ల్ ఫ్రెండ్’ అని చెబుతున్నారు. నన్ను కూడా ట్యాగ్ చేస్తున్నారు. కాని ఆ అమ్మాయికి ఇబ్బంది కాకూడదు అనే ఆమె ఎవరో చెప్పడంలేదు. ఆమె ఒక డాక్టర్.. స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం కోసం బయట ఉంది. ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదు అనే ఇలా సీక్రెట్ మెయింటేన్ చేస్తున్నాము'' అని వంశీ అన్నారు.
త్వరలో ఇమ్మాన్యుయేల్ పెళ్లి..?
ఇమ్మాన్యుయేల్ చేసుకోబోయే అమ్మాయి వ్యక్తిగత వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతో.. ఆమె గురించి చెప్పడంలేదు. ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే అతనే ఆమె ఎవరో ప్రకటిస్తాడు. అంతే కాదు అతను రాగానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారని కూడా వంశీ చెప్పాడు. ఇక వంశీ చేసిన ఈ కామెంట్స్ తో.. ఇమ్మాన్యుయేల్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. తమ అభిమాన కమెడియన్ త్వరలోనే డాక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడని సంబరపడిపోతున్నారు. శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు.

