- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 8వ తేదీ)లో శివన్నారాయణ ఇంటికి వెళ్లడానికి కాంచనను ఒప్పిస్తుంది దీప. కాంచన ఫోటో చూస్తూ కావేరికి దొరికిపోతాడు శ్రీధర్. తల్లికి సారీ చెప్తుంది శౌర్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో కిచెన్ లో పనిచేసుకుంటూ ఉంటుంది అనసూయ. అక్కడే కూర్చొని దీప గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాంచన. ఇంతలో దీప అక్కడకు వచ్చి అత్తయ్య అని పిలుస్తుంది. నిన్నే పిలుస్తుంది అక్క అంటుంది కాంచన. ఏంటే అని అడుగుతుంది అనసూయ. నిన్ను కాదు నువ్వు పనిచేసుకో.. నేను మిమ్మల్నే పిలుస్తున్నాను అత్తయ్య అని మరోసారి కాంచనను పిలుస్తుంది దీప.
నేను తనతో మాట్లాడను అని చెప్పక్క అంటుంది కాంచన. నేను మీకు ఒకటి చెప్పాలి అంటుంది దీప. శౌర్య నా బిడ్డే. ఇప్పుడు నా కడుపులో ఉంది కూడా నా బిడ్డే. నీ కొడుకు వారసత్వం మీద మీరు ఎంత ప్రేమ పెంచుకున్నారో నాకు తెలుసు. అలాగే నా భర్త ప్రేమకు ప్రతిరూపం అయిన నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉండదా? ఒక తల్లిగా తనని కాపాడుకునే బాధ్యత నాది. కానీ నన్ను ఆ ఇంటికి వెళ్లొద్దు అని మాత్రం చెప్పకండి అత్తయ్య అని రిక్వెస్ట్ చేస్తుంది దీప.
కాంచన చేతులు పట్టుకొని ఏడ్చిన దీప
ఈ ఇంట్లో ఉంటే నాకు సేవ చేయాల్సి వస్తుందనే నువ్వు అక్కడికి వెళ్తానంటున్నావు కదా.. నీతో సేవలు చేయించుకునే దౌర్భాగ్యం నాకు పట్టలేదు దీప అంటుంది కాంచన. అత్తయ్య మీకు సేవ చేయడం నా అదృష్టం. ఎవ్వరో తెలియని నన్ను కోడలిగా ఆదరించారు. ప్రేమించారు. నా కూతురిని నీ సొంత మనుమరాలిగా చూసుకుంటున్నారు. అలాంటి నీకు సేవ చేయడం నా అదృష్టం. మీరు ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అని కాంచన చేతులు పట్టుకొని ఏడుస్తుంది దీప.
నేను మీకు మాట ఇస్తున్నాను. నీ కొడుకు వారసత్వానికి ఏం కాకుండా ఈ చేతుల్లో పెడతాను. కానీ నన్ను ఆ ఇంటికి మాత్రం వెళ్లొద్దు అని చెప్పకండి అంటుంది దీప. నేను ఆ ఇంటికి వెళ్లడానికి ఒక కారణం ఉంది. అది ఇప్పుడు చెప్పలేను. కానీ తెలిసిన రోజు నేను ఎందుకు ఇవన్నీ చేస్తున్నానో మీకే అర్థం అవుతుంది అంటుంది దీప.
నా కొడుకు నాకు నిజం చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్పట్లేదు. కానీ మీ మాటలపై నాకు నమ్మకం ఉంది. నీకు నచ్చినట్లు చెయ్ అంటుంది కాంచన. సంతోషంగా అక్కడినుంచి వెళ్లిపోతుంది దీప. ఇది నా చేతనే ఒప్పించింది చూడక్క అంటుంది కాంచన. నీ కోడలు నిన్ను, నీ భర్తను కూడా కలుపుతుంది చెల్లెమ్మ అంటుంది అనసూయ. ఏమన్నావు అక్క అంటుంది కాంచన. ఏం లేదు అని కవర్ చేస్తుంది అనసూయ.
కావేరికి దొరికిపోయిన శ్రీధర్
మరోవైపు ఫోన్ లో కాంచన ఫోటో చూస్తూ బాధపడుతుంటాడు శ్రీధర్. అది చూసి షాక్ అవుతుంది కావేరి. మీరు ఇక్కడున్నారా అంటూ వచ్చి పాల గ్లాసు చేతికి ఇస్తుంది. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటుంది కావేరి. హుమ్ అంటాడు శ్రీధర్. మీరు నన్ను వదిలేసి కాంచన అక్క దగ్గరికి వెళ్లిపోతారా? అంటుంది కావేరి. షాక్ అవుతాడు శ్రీధర్.
ఎందుకు అలా అడుగుతున్నావు అంటాడు శ్రీధర్. నేను చాలా మారిపోయాను ఒకప్పుడు తీసుకోవడంలోనే ఆనందం ఉంది అనుకునేదాన్ని కానీ.. ఇవ్వడంలో కూడా ఆనందం ఉందని నాకు తెలిసింది. అలాగే మీరు కూడా మారిపోయారు. ఒకప్పటిలా నాతో ఉండట్లేదు. బెడ్ రూమ్ లో పడుకోవట్లేదు. కాంచన అక్క కోసం ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అక్క ఫోటో చూసి బాధపడుతున్నారు. నేనంటే కూడా మీకు ఇష్టం ఉంటే అక్క పక్కన నా ఫోటో కూడా ఉండేది కదా అంటుంది కావేరి.
నిన్ను నేను ఎప్పటికీ వదిలేయను
కాంచన కోసం బాధపడట్లేదని నేను చెప్పను. కానీ నేను మొదటి నుంచి కూడా వాళ్లు నాతోనే ఉండాలని కోరుకున్నాను. దీప మీద తప్ప నాకు ఎవ్వరిమీద కోపం లేదు. స్వప్న నా బిడ్డే. కార్తీక్ నా కొడుకే. నాకు నువ్వు కావాలి. కాంచన కావాలి. నిన్ను నేను ఎప్పటికీ వదిలేయను. ఇప్పటికే ఒక ఆడదాన్ని ఏడిపిస్తున్నాను. నిన్ను కూడా ఏడిపించి ఆ కన్నీటి సముద్రంలో ఈదే అంత ఓపిక నాకు లేదు కావేరి అని చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్.
సారీ చెప్పిన శౌర్య
మరోవైపు తన తప్పు గురించి తెలిసి తల్లికి సారీ చెప్తుంది శౌర్య. నాకు తెలియకుండా కాలు తగిలిందమ్మా.. నీకు బేబీకి సారీ అని చెప్తుంది. నేను ఈ రోజు నుంచి నానమ్మ దగ్గర పడుకుంటానని చెప్పి వెళ్లిపోతుంది. దీపను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా అని తల్లితో చెప్తాడు కార్తీక్. దీప నాకు మాటిచ్చింది. కానీ నా భయాలు నాకు ఉన్నాయి అంటుంది కాంచన. కొన్ని సార్లు మనం సరిగ్గా వెళ్లినా.. ఎదురొచ్చే వాళ్లు సరిగ్గా లేకపోతే నష్టం తప్పదు అంటుంది. నీ కోడలి మాటను నేను నిలబడతాను అని తల్లికి మాటిస్తాడు కార్తీక్.
ఆదిశక్తిలా మారిపోతాను
నువ్వు ఎందుకు ఆ ఇంటికి రావాలని అనుకుంటున్నావో మన ఇద్దరికే తెలుసు. నువ్వు మీ అమ్మనాన్నలు నీ కళ్లముందు ఉండాలని కోరుకుంటున్నావు. కానీ మా అమ్మ.. పారు, జ్యోత్స్న వాళ్ల నీకేమైనా ఆపద వస్తుందేమోనని భయపడుతోంది అంటాడు కార్తీక్.
సంకల్ప బలం చాలా గొప్పది. అత్త సంకల్పించుకుంది. అది జరిగి తీరుతుంది. మనం పెళ్లి చేసుకుంటామని ముందే అనుకున్నామా? తాళి కట్టే వరకూ నీకు తెలీదు. నాకు తెలీదు. అంతా సంకల్ప బలం. కడుపులో బిడ్డకు కూడా ఏం కాదు. జ్యోత్స్న, పారిజాతం లాంటి వారు ఎంతమంది వచ్చినా నా బిడ్డను ఏం చేయలేరు. నా బిడ్డ జోలికి వస్తే నేను ఆదిశక్తిని అవుతాను అంటుంది దీప.
నేనూ చూశాను. నిన్నలా చూస్తే నాకు భయమేసింది దీప అంటాడు కార్తీక్. నేను ఆదిశక్తిని అయితే నువ్వు ఆదిశంకరుడివి. అయినా నువ్వు ఉండగా మాకు ఏమి కాదు అంటుంది దీప. సరే.. రేపు డ్యూటీకి వస్తామని నేను తాతతో చెప్పాను. ఏ చిన్న తప్పు జరిగినా ఇక వాళ్లు మన మాట వినరు. మన బిడ్డను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

