- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 8: వల్లి చదువుపై రచ్చ, ఏ కాలేజీలో చదివావమ్మా బల్లి?
Illu Illalu Pillalu Today Episode Dec 8: వల్లి చదువుపై రచ్చ, ఏ కాలేజీలో చదివావమ్మా బల్లి?
Illu Illalu Pillalu Today Episode Dec 8: ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్లో వల్లి చదువు గురించే కథ నడుస్తుంది. రామరాజు ఇంగ్లీషులో మాట్లాడమని వల్లిని అడుగుతాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.

కొత్త గొడవ మొదలుపెట్టిన భాగ్యం
ధీరజ్ ప్రేమకు కానుకగా పోలీసు యూనిఫామ్ కొనిస్తాడు. దాన్ని వేసుకొని ప్రేమ కనిపించగానే ధీరజ్ ఆనందపడతాడు. వెంటనే ప్రేమ తాను ఈ డ్రెస్ లో బయటికి వెళ్తే నిజంగానే అందరూ తనను పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు కదా అని ఆనందపడుతుంది. దానికి చాలా నవ్వుతాడు. నువ్వు అసలే పొట్టిగా ఉంటావు ఇక ఈ డ్రెస్ లో ఇంకా పొట్టిగా కనిపిస్తున్నావు తెలుసా అని ధీరజ్ అనగానే దీంతో ప్రేమ నాలుగు దెబ్బలు వేస్తుంది. తర్వాత ధీరజ్ ప్రేమను పొగుడుతాడు. నిజంగానే నువ్వు పోలీస్ ఆఫీసర్ లా ఉన్నావని, నీకు పర్ఫెక్ట్ గా సూట్ అయిందని అంటాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీలవుతారు. ఇక్కడినుంచి సీన్ భాగ్యం, ఇడ్లీ బాబాయ్ దగ్గరికి మారుతుంది. వీరిద్దరూ కలిసి రామరాజు దగ్గరికి వస్తారు. రామరాజు పేపర్ చదువుతుండగా భాగ్యం, ఇడ్లీ బాబాయ్ వస్తారు. మొన్న మీరు ఇచ్చిన డబ్బులతో వ్యాపారం పెట్టాము. వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతోంది. దానికి సంబంధించిన విజిటింగ్ కార్డ్స్ ఇదిగోండి అని రామరాజుకు ఇస్తారు. అలాగే స్వీట్లు కూడా పంచుతారు .
వల్లి సర్టిఫికెట్లు పోయాయట
రామరాజు వారు చెప్పినది నమ్మి కష్టపడి పని చేసుకోండి, ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో అదే స్థాయికి మళ్లీ వెళ్లాలి అంటారు. అప్పుడు భాగ్యం మాట్లాడుతూ వల్లిని ఉద్యోగం చేయమని అనుమతిచ్చారట కదా అని అడుగుతుంది. దానికి వేదవతి వల్లి లేకపోతే నేను ఇంటి పనులు చేయలేను అనుకుంటుంది.. తన ఉద్యోగానికి వెళ్తే నేను అన్ని పనులు చేయగలరని నిరూపిస్తాను అని చెబుతోంది. ఇప్పుడు భాగ్యం ఉద్యోగానికి వెళ్లేందుకు పెద్ద చిక్కు ఉందని చెబుతుంది. అప్పుడు భాగ్యం మాట్లాడుతూ వల్లి చదివిన ఎమ్మే సర్టిఫికెట్లలో సమస్య ఉందని చెబుతుంది. ఈలోపు ప్రేమ కల్పించుకొని ఎమ్ఏ సర్టిఫికెట్లలో సమస్య ఏంటి? వల్లి ఎమ్ఏ చదవలేదా అని అడుగుతుంది. ఓ పక్క వల్లిలో కంగారు పెరిగిపోతుంది. అప్పుడు భాగ్యం మాట్లాడుతూ మొన్న మేము ఇల్లు మారినప్పుడు వల్లి ఎంఏ సర్టిఫికెట్లు ఎక్కడో పడిపోయాయి. ఇప్పటివరకు ఇల్లంతా వెతికినా ఎక్కడా దొరకలేదు. అదే బోలెడంత బాధగా ఉందని భాగ్యం తెగ నటించేస్తుంది. అది విని వల్లిలో ఆనందం పెరిగిపోతుంది.
వల్లి ఏ కాలేజీలో చదివింది?
వల్లి మాట్లాడుతూ నన్ను ఉద్యోగం చేయమని మావయ్య గారు చెప్పారు, మావయ్య గారు చెప్పిన పని చేయడం కోడలిగా నా ధర్మం, మరి ఇప్పుడు సర్టిఫికెట్ లేకపోతే నేను ఎలా ఉద్యోగం చేయాలి అని ఓవరాక్షన్ చేస్తుంది. రామరాజు కల్పించుకుని పర్వాలేదు అమ్మా... నువ్వు ఉద్యోగం చేయకపోయినా ఎలాంటి సమస్య లేదు, నువ్వేం బాధపడకు అని చెబుతాడు. దీంతో భాగ్యం, ఇడ్లీ బాబాయ్ వల్లి ఎంతో ఆనందపడతారు. అప్పుడు నర్మదా కల్పించుకొని ‘నువ్వేం బాధపడకు అక్కా.. నువ్వు మామయ్య గారికి మాట ఇచ్చినట్టే ఉద్యోగం కచ్చితంగా చేస్తావు’ అని అంటుంది. అది విని వల్లి షాక్ అవుతుంది. ప్రేమ మాట్లాడుతూ డూప్లికేట్ సర్టిఫికెట్లు కాలేజీ నుంచి తీసుకోవచ్చని చెబుతుంది. ఇక వల్లి భయంతో వణికి పోతూ ఉంటుంది.
అప్పుడు నర్మదా మాట్లాడుతూ ఆన్లైన్లో అప్లై చేస్తే వెంటనే నీ ఇంగ్లీష్ ఎంఏ సర్టిఫికెట్లు పంపిస్తారు అని చెబుతుంది. మావయ్య గారికి మాట ఇచ్చినట్టే నువ్వు చక్కగా ఉద్యోగం చేయవచ్చు బాధపడకు అని చెబుతారు. ఏ కాలేజీలో చదివావో, యూనివర్సిటీలో చదివావో చెబితే మేము సర్టిఫికెట్లు ఆన్లైన్లో తెప్పిస్తామని చెబుతుంది. దాంతో వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు భాగ్యం కల్పించుకొని నర్మద, ప్రేమలకు ఎందుకు శ్రమ? మాకు తెలిసిన మాస్టర్ గారు ఉన్నారు... ఆయనకు చెప్పి సర్టిఫికెట్లు తెప్పిస్తాంలెండి అని అంటుంది. సరే త్వరగా తెప్పించండి అని చెప్పి రామరాజు అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
నర్మద ఇంటికి సాగర్
ఇక ఇక్కడి నుంచి సీన్.. సాగర్ దగ్గరికి మారుతుంది. సాగర్ నర్మదా వాళ్ళ నాన్నని కలుస్తాడు. ‘మామయ్య నర్మద నా కోసం మిమ్మల్ని అందరినీ వదిలేసుకుని వచ్చింది. ఇప్పటికే కన్నవాళ్ళ ప్రేమకి దూరంగా ఉంది. నర్మద చెప్పకపోయినా, బయటపడకపోయినా నర్మద మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. నాకోసం అంత త్యాగం చేసిన నర్మద కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందుకే తనని మీకు దగ్గర చేయడానికి నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అనుకున్నాను. కానీ నేను ఓడిపోయాను. గెలిచే దారి నాకు కనిపించడం లేదు’ అని బాధపడతాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో మీరే చెప్పండి, మీ అమ్మాయిని మీ ఇంటికి రానివ్వాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతాడు.
జాబ్ కొనమని చెప్పిన నర్మద తండ్రి
దానికి నర్మద తండ్రి మాట్లాడుతూ ‘నువ్వు నేరుగా గవర్నమెంట్ జాబ్ కొట్టడం కష్టం అంటున్నావు కాబట్టి ఉద్యోగాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయు’ అని చెబుతాడు. సాగర్ ఉద్యోగం కొనేందుకు ఎంత ఖర్చవుతుందని అడుగుతాడు. దానికి నర్మద తండ్రి కనీసం 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షలు అవసరం పడతాయని చెబుతాడు. దీంతో సాగర్ ఏం చేయాలో తెలియక ఆవేదన చెందుతాడు. ఇంటి దగ్గర ఉన్న రామరాజుకి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎత్తితే అవతలి వ్యక్తి ఇంగ్లీష్ లో మాట్లాడుతాడు. అయితే రామరాజు తనకు ఇంగ్లీషు రాదని అంటాడు. ఈ లోపు అక్కడ వల్లి కనిపిస్తుంది. వల్లిని పిలిచి ఆ ఫోను తనకిచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడమని అడుగుతాడు. దీంతో వల్లి భయంతో వణికిపోతుంది. ఈరోజుతో ఇక్కడ ఎపిసోడ్ ముగిసిపోతుంది.

