Guppedantha Manasu: శైలేంద్ర కి బ్యాడ్ న్యూస్ చెప్పిన హంతకుడు.. ప్రాణాపాయ స్థితిలో జగతి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అధికారం కోసం ప్రాణాలు తీయటానికి సైతం వెనుకాడని ఒక దుర్మార్గుడి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ధరణి జగతికి ఫోన్ చేస్తుంది కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వసుధారకి ఫోన్ చేసి రిషి ప్రమాదంలో ఉన్నాడు వెళ్లి కాపాడు అని చెప్తుంది. కంగారుపడిన వసుధార జగతి మేడంకి తెలుసా అని అడుగుతుంది. లేదు, చెబుదామంటే తను ఫోన్ ఎత్తట్లేదు అందుకే నీకు ఫోన్ చేశాను త్వరగా వెళ్ళు అని కంగారు పెడుతుంది ధరణి. అప్పుడు వసుధార పాండ్యన్ ని తోడు తీసుకొని కార్లో బయలుదేరుతుంది.
తను ఫోన్ చేస్తే రిషి నిజం చెప్పడని పాండ్యన్ చేత ఫోన్ చేయించి రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటుంది. మరోవైపు రిషి దగ్గరికి వస్తున్న జగతి కారు పక్కన ఆపి బ్యాగ్ లో ఉన్న నల్లపూసలు తీసి నా వల్లే మీ బంధం మసకబారింది. నీ దగ్గర మాట తీసుకుని మీకు అన్యాయం చేశాను వసుధార. రిషి కి నిజం చెప్పి మీ ఇద్దరినీ కలిపి మీ ఇద్దరికీ పెళ్లి చేయడమే తరువాయి అనుకుంటుంది. ఆ తర్వాత రిషి పంపిన లొకేషన్ కి చేరుకుంటుంది జగతి. అప్పటికే అక్కడ రిషి వెయిట్ చేస్తూ ఉంటాడు.
రిషి ని చంపడానికి వచ్చిన హంతకుడు కూడా జగతిని ఫాలో అవుతూ వస్తాడు. రిషి ని కాల్చడానికి పొజిషన్ సెట్ చేసుకుంటాడు. శైలేంద్ర కి ఫోన్ చేసి ఇద్దరిలో ఎవరిని లేపమంటారు అని అడుగుతాడు. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు ఇద్దరినీ లేపేయ్, లేపిన తర్వాత ఫోన్ చేస్తే నీకు లైఫ్ సెట్టిల్ చేసేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు శైలేంద్ర. మరోవైపు నిన్ను ఇక్కడికి రమ్మని ఇబ్బంది పెట్టినందుకు పెట్టినట్లు ఉన్నాను కానీ ఈరోజు నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను అంటుంది జగతి.
పర్వాలేదు మేడం ఈరోజు ఒక్కరోజు మీరు చెప్పినట్లు చేస్తే ఇకపై మీ దగ్గర నుంచి ఫోన్లు, మెసేజ్లు రావు. నాకు టార్చర్ ఉండదు అంటాడు రిషి. నా ఫోను నీకు టార్చర్ లాగా అనిపిస్తుందా.. నేను ఏం చేసినా నీకోసమే చేశాను అంటూ జగతి ఏదో మాట్లాడబోతుంటే ఇంతలో అక్కడికి వసుధారా వస్తుంది. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోదాం పదండి అని కంగారు పెడుతుంది. రిషి వసుధార ని కోప్పడతాడు.
ఆవిడ రమ్మంటుంది, నువ్వేమో వెళ్ళిపోదాం అంటున్నావు. మళ్ళీ ఏమైనా కొత్త నాటకమా అంటాడు. జగతి కూడా ఈరోజు నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తాను ఒక ఐదు నిమిషాలు ఆగు అంటుంది. అలా కాదు మేడం, కావాలంటే వేరే చోటికి వెళ్లి మాట్లాడుకుందాం అంటుంది జగతి. రిషి వసుధారని మందలించి జగతిని నిజం చెప్పమంటాడు. జగతి నిజం చెప్పబోతూ అనుకోకుండా అంతకుడిని చూస్తుంది. కంగారుపడి రిషికి అడ్డుగా వెళ్తుంది. అప్పటికే షూటర్ షూట్ చేయడంతో ఆ బుల్లెట్ జగతికి తగులుతుంది.
కంగారుపడిన రిషి వసుధార ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లటానికి కారు దగ్గరికి తీసుకువెళ్తారు. ఈ లోపు పాండ్యన్ హంతకుడిని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడు పారిపోతాడు. అదే విషయం రిషికి చెప్తాడు పాండియన్. ఆ సంగతి తర్వాత చూద్దాం ముందు కారు తీయు అని చెప్పి రిషి తల్లిని ఒడిలో పడుకోబెట్టుకొని ధైర్యం చెబుతూ ఉంటాడు. మరోవైపు హంతకుడు ఫోన్ చేసి రిషి చనిపోలేదు ఆ లేడీ అడ్డొచ్చేసింది రిషి ని కాల్చడానికి వీలుపడలేదు.
అక్కడికి ఇంకా ఎవరెవరో వచ్చారు అని చెప్తాడు. అప్పుడు హంతకుడు మీద శైలేంద్ర కోప్పడి ఫోన్ పెట్టేస్తాడు. తను కిందకి వచ్చేటప్పటికి మహేంద్ర జగతికి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని తెలిసి కంగారుగా బయటికి వెళ్లి పోతూ ఉంటాడు. మరోవైపు కార్లో పెయిన్ తో ఇబ్బంది పడుతూ ఉంటుంది జగతి. మళ్ళీ చెప్పగలనో,లేదో అని వసుధారకి సారీ చెప్తుంది. తర్వాత ఆమెని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. ఆమెకి ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి ఆమె కండిషన్ గురించి అప్పుడే చెప్పలేము అనేసరికి బాగా ఎమోషనల్ అయి డాక్టర్ మీద రుబాబు చేస్తాడు రిషి.
వసుధార మందలించడంతో నార్మల్ అయినా రిషి డాక్టర్ కి సారీ చెప్తాడు. ఇంతలో మహేంద్ర కూడా వచ్చి జగతిని చూసి బాగా ఎమోషనల్ అవుతాడు. అప్పుడు రిషి మహేంద్ర ని డాడ్ అని పిలవడం చూసి షాక్ అవుతాడు పాండ్యన్. మరోవైపు ఆలోచనలో ఉన్న భర్త దగ్గరికి వచ్చి రిషి ని ఏం చేద్దామని ప్లాన్ చేశారు అని నిలదీస్తుంది ధరణి.మీరు ఎన్ని ప్లాన్లు వేసినా భగవంతుడు మంచివారికి సాయం చేస్తాడు అంటుంది.ఇంతలో కంగారుగా వచ్చిన ఫణీంద్ర జగతిని ఎవరో షూట్ చేశారంట అని చెప్తాడు.
ఆ పని మనదే అన్నట్టు గర్వంగా ధరణి వైపు చూస్తాడు శైలేంద్ర. కానీ తండ్రి వైపు తిరిగి కంగారుపడుతున్నట్లుగా నటిస్తూ పదండి అక్కడికి వెళ్దాం అనటంతో అందరూ బయలుదేరుతారు. మరోవైపు బాధపడుతున్న మహేంద్ర తను ఇక్కడికి వస్తున్నట్లు తెలియదు లేదంటే ఒక్కదాన్నే పంపించే వాడిని కాదు అంటూ ఎమోషనల్ అవుతాడు. మేడంకి ఏమీ కాదు అని ధైర్యం చెబుతూ ఉంటారు రిషి, వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.