Guppedantha Manasu: శైలేంద్రని తప్పుపడుతున్న రిషి.. తల్లి కొడుకుల్ని బయటికి పొమ్మన్న వసుధార!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. దక్కాల్సిన పదవి దక్కలేదని బాధపడిపోతున్న తల్లి కొడుకుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో నీకు పెండింగ్ వర్క్ చాలా ఉంది నీ పని చేసుకో, నాకు కొంచెం పని ఉంది వెళ్లి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత కబోర్డ్ లో ఉన్న హార్ట్ షేప్ ను చూసి గతంలోకి వెళ్తుంది వసుధార ఆ తర్వాత ఒక చైర్ లాక్కొని ఎండి చైర్ పక్కనే కూర్చుంటుంది. ఆ చైర్ ఎప్పటికీ మీదే సార్ నేను మీ చైర్ లో కూర్చోలేను. నేను ఎప్పుడూ మీ పక్కనే ఉంటాను అంటూ పక్క కుర్చీలోనే తన వర్క్ స్టార్ట్ చేస్తుంది.
మరోవైపు కాలేజ్ ఆవరణలోకి వచ్చిన తల్లి కొడుకులు ఎండి సీటు దక్కలేదని బాధపడిపోతూ ఉంటారు. ఇలా జరిగింది ఏంటి శైలేంద్ర, మనం ఎన్ని కుట్రలు చేసినా ఆఖరికి మనకి దక్కాల్సిన పదవి దక్కలేదు అంటుంది దేవయాని. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటే ఇదేనేమో మమ్మీ, అయినా పోయేదేముంది మన బుర్ర నిండా బోలెడన్ని కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. వాటిని అమలు చేద్దాంలే. కొంచెం లేట్ అయినా కానీ మనం అనుకున్నది జరిగి తీరుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్తాడు.
అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అంటుంది దేవయాని. సత్యయుగం, ధర్మ యుగం మంచి వాళ్ళకి రోజులు కానీ కలియుగం మనలాంటి మోసగాళ్లకు మంచి ఫలితాలను ఇస్తుంది. తను ఎండి సీట్లో కూర్చున్నంతమాత్రాన అంతా అయిపోలేదు. తను ఎం డి సీట్ కి అర్హురాలు కాదు అనేలా చేస్తే సరిపోతుంది అంటాడు శైలేంద్ర. ఎవరి గురించి అన్నయ్య మాట్లాడుతున్నావు వసుధార గురించేనా అని అడుగుతాడు రిషి.
సడన్గా అతని మాట విని షాక్ అవుతారు తల్లి కొడుకులు. ఎవరి గురించి అన్నయ్య మాట్లాడుతున్నావు, వసుధార గురించేనా తను ఎండి సీట్ కి అర్హురాలు కాదు అని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు రిషి. అది కాదు రిషి తనకి మీకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందులోనూ తన వయసు చాలా చిన్నది ఇంత పెద్ద కాలేజీ ని హ్యాండిల్ చేయగలదో లేదో అని అలా అన్నాను.
ఏమైనా తేడా వచ్చిందంటే కాలేజీ మళ్ళీ మొదటికే వస్తుంది అంటాడు శైలేంద్ర. మీరు వసుధార క్యాపబిలిటీ గురించి అసలు ఆలోచించక్కర్లేదు. నేను తనకి ఈ పదవి నా భార్యను ఈ ఇంటి కోడలని ఇవ్వలేదు తన క్యాపబిలిటీని చూసే ఇచ్చాను. ఇక వయసు అంటావా, వయసును బట్టి తెలివితేటలు అంచనా వేయకూడదు చిన్న వయసులోనే గొప్ప పనులు చేసిన మహిళలు చాలామంది ఉన్నారు అంటాడు రిషి. దేవయాని కూడా వసుధారని వెనకేసుకొచ్చినట్లుగా మాట్లాడుతుంది.
సారీ రిషి ఏదైనా మొహం మీద అనటం నాకు అలవాటు కదా అంటాడు శైలేంద్ర . అలా అ నేవాడివి అక్కడే అనొచ్చు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడటం ఎందుకు ఇదే విషయంలో అయితే మీరు ఇంకేమీ ఆలోచించక్కర్లేదు, అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత వసుధార దగ్గరికి వెళ్తారు తల్లి కొడుకులు. అక్కడ వసుధార కనీసం వాళ్ళని కూర్చోమని కూడా అనదు. ఆ సీట్లో కూర్చున్న అందుకు చాలా గర్వంగా ఉన్నట్లు కనిపిస్తున్నావు అంటాడు శైలేంద్ర.
నువ్వు ఆఫీస్ వ్యవహారాలు చక్కబెట్టగలవో,లేదో అవసరం అనుకుంటే మా హెల్ప్ తీసుకో అంటుంది దేవయాని. అలాంటిదేమీ అక్కర్లేదు అని చెప్పిన వసుధార అసలు మీరు ఎందుకు వచ్చారు, ఇంట్లో కూర్చొని ఇంటికి వ్యవహారాలు చూసుకోండి, శైలేంద్ర సార్ మిమ్మల్ని చూసుకుంటారు కాలేజీని నేను చూసుకుంటాను అంటుంది వసుధార. నీ ఎండి సీట్ చూసుకొని నువ్వు మురిసిపోతున్నట్లుగా ఉన్నావు అంటూ లేడి కధ చెప్తాడు శైలేంద్ర.
అప్పుడు వసుధార మాట్లాడుతూ మీరు లేడి అనుకున్నది పెద్దపులి అని మీరు గ్రహించడం లేదు అనటంతో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు తల్లి కొడుకులు. సీన్ కట్ చేస్తే హాల్లో పడుకున్న వసుధార చలికి వణుకుతూ ఉంటుంది. ఆమెను తీసుకెళ్లి రూమ్ లో పడుకోబెడతాడు రిషి. అప్పుడే వసుధారకి మెలకువ వస్తుంది. ఏంటి సర్ మీరు నాకు సేవలు చేస్తున్నారు నాకు అలా నచ్చదు అంటుంది.
ఇందులో తప్పేముంది ఎప్పుడూ భార్యలు సేవలు చేయడమేనా మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి అంటాడు. ఈలోపు తండ్రి కేక వినిపించడంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు రిషి, వసుధార. మహేంద్ర కింద పడిపోయి ఉంటాడు. అతనిని లేపి మంచం మీద కూర్చోబెడితే జగతిని తలుచుకుంటూ ఏడుస్తూ మళ్ళీ పడుకుండిపోతాడు. మహేంద్ర ని అలా చూసి చాలా బాధపడతారు రిషి, వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.