- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి, వసు గురించి జగతికి కంప్లైంట్ చేసిన గౌతమ్.. లైబ్రెరీ సిన్ తో అసలు ట్విస్ట్?
Guppedantha Manasu: రిషి, వసు గురించి జగతికి కంప్లైంట్ చేసిన గౌతమ్.. లైబ్రెరీ సిన్ తో అసలు ట్విస్ట్?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక రిషి, వసులు లైబ్రరీలో స్టక్ అయినా క్రమంలో వసు దోమలు కుట్టడంతో చిరాకు పడుతూ ఉండగా రిషి (Rishi) అంతాక్షరి ఆడదామని అట పట్టిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో రిషి (Rishi) , వసు ల మధ్య కొంతవరకు ఫన్నీ వార్ జరుగుతుంది. ఈ క్రమంలో వసు అన్నటుగా రిషి ని ఇమిటేట్ చేయమంటుంది. ' దేవుడా.. నువు మంచోడివి లైబ్రరిలో ఇరికించావు అయినా పరవాలేదు రిషి సార్ ఉన్నారుగా' అని వసు (Vasu) ఈ విధంగా అంటూ రిషి ను ఇమిటేట్ చేయమంటుంది.
ఈ క్రమంలో వీరిరువురు ఒక సెల్ఫీ కూడా దిగుతారు. ఇక తర్వాత రిషి (Rishi) నీకు కాగితాలతో పడవలు తయారు చేయడం వచ్చా అని అడుగుతాడు. వసుధార కాగితపు పడవను తయారు చేసి చూపెడుతుంది. మరోవైపు గౌతమ్ ఆఫీస్ ప్రాజెక్ట్ కు సంబంధించిన చార్ట్ ను పట్టుకొని వసుధార (Vasudhara) ను ఉంచుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటాడు.
ఇక ఆ తర్వాత హడావిడిగా లైబ్రేరియన్ గౌతమ్ (Goutham) దగ్గరికి వస్తాడు. ఇంతలో గౌతమ్ ఏం జరిగింది అని అడగగా లైబ్రేరియన్ జరిగినదంతా చెబుతాడు. ఇద్దరూ కలిసి లైబ్రరీ కి వెళతారు. ఇక లైబ్రరీ తలుపులు ఓపెన్ చేసిన గౌతమ్ లోపలికి వెళ్ళి వసు (Vasu) ను చూడగానే స్టన్ అవుతాడు.
ఇక ఆ క్రమంలో రిషి ని (Rishi) చూసిన గౌతమ్ కి ఏమీ అర్థం కాదు. ముగ్గురు కలిసి కారులో వెళుతుండగా గౌతమ్, వసుతో లైబ్రరీ ప్రస్తావన తెస్తుండగా రిషి గౌతమ్ చేతిని గట్టిగా ఎవరికీ తెలియకుండా కొడతాడు. దాంతో గౌతమ్ గట్టిగా అరుస్తాడు. ఇక గౌతమ్ (Goutham) ఇంటికి వెళ్ళిన తర్వాత జగతికి కాల్ చేసి జరిగినదంతా చెబుతాడు.
దాంతో జగతి (Jagathi) వసుధార దగ్గరకు వచ్చి లైబ్రరీ లో ఏం జరిగింది అని అడుగుతుంది. ఇక వసు చెప్పడానికి సందేహిస్తూ ఉండగా రిషి (Rishi) కి కాల్ చెయ్ అని జగతి అంటుంది. ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.